mlc nomination
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ ఆర్వో సుబ్బారెడ్డికి వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. మే నాటికి మండలిలో వైఎస్సార్సీపీకి ఆధిక్యం వైఎస్సార్సీపీలో కష్టించి పని చేసే వారికి మంచి గుర్తింపు, హోదా లభిస్తుందని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ అనంతరం ఆయన వారితో కలిసి శాసనమండలి వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని, పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి, సమపాళ్లలో సముచిత స్థానాలు కల్పించటం జరుగుతోందన్నారు. ఇది సీఎం జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని తెలుగు ప్రజలంతా గమనించారని చెప్పారు. వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారన్నారు. వచ్చే మే నెలలో వైఎస్సార్సీపీకి కౌన్సిల్లో మెజార్టీ వస్తుందన్నారు. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ తీసుకునే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ఊపందుకుంటాయని తెలిపారు. బాలయ్య ధ్యాస సినిమాలపైనే : ఇక్బాల్ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నానని, అడగకుండానే తనకు రెండోసారి ఎమ్మెల్సీగా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లెజెండ్, రూలర్ అనుకుంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ప్రజాసేవను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. సీఎంకు కృతజ్ఞతలు : సి.రామచంద్రయ్య ఇచ్చిన మాటను ఈ స్థాయిలో నిలబెట్టుకునే సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని సీనియర్ రాజకీయ వేత్త, ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరుతో విశ్వసనీయత కోల్పోయారని తెలిపారు. టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదని.. చంద్రబాబు, లోకేష్ ఉన్నంత వరకు టీడీపీకి మనుగడ ఉండదని జోస్యం చెప్పారు. అచ్చెన్న ప్రజాద్రోహి : దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అచ్చెన్నాయుడు ప్రజా ద్రోహి అని ధ్వజమెత్తారు. తనపై అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై అమరావతిలో బహిరంగ చర్చ పెడతానని, ఈ చర్చకు ఆయన రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని చెప్పారు. మండలిలో ప్రజా సమస్యలు వినిపిస్తాం సీఎం జగన్ ఎంతో నమ్మకంతో తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని అభ్యర్థులు కళ్యాణ్ చక్రవర్తి, భగీరథరెడ్డి, కరీమున్నీసా తెలిపారు. ప్రజా సమస్యలు మండలిలో ప్రస్తావించి, మండలి ప్రతిష్ట పెరిగేలా పని చేస్తామన్నారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌కు జన్మజన్మలా రుణపడి ఉంటామన్నారు. -
డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘‘2014, 2015లోనే వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్సీపీలో చేరాను. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి’’ అని పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
అమరావతి : ఏపీ శాసనమండలిలోని ఎమ్మెల్యే కోటాలో గల అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల సంఘం పరిశీలించింది. ఆయా స్థానాలకు ఇతరులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టీడీపీ నుంచి యనమల, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు ఈసీ శుక్రవారం ప్రకటించింది. (అశోక్ బాబుపై ఉద్యోగుల ఆగ్రహం) -
నామినేషన్ దాఖలు చేసిన జంగా కృష్ణమూర్తి
-
‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు’
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని మరోసారి నిరూపించారు. బీసీని అయిన నన్ను ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీని చేశారు నన్ను. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసే బాధ్యత ఇచ్చారు. బీసీలను ఆదుకోవడానికి ఏం చేయాలో అధ్యయనం చేయమన్నారు. బీసీలకు ఎవ్వరూ ఇవ్వనటువంటి డిక్లరేషన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారు. అంతేకాదు బీసీ గర్జనలోనే వైఎస్సార్ సీపీకి వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీని ఇచ్చారు. ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.’ అని అన్నారు. నామినేషన్ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ముస్తఫా, ఆదిమూలం సురేష్, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, రక్షణ నిధి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జంకే వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దౌర్జన్య కాండ
► ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియలో చెలరేగిపోయిన టీడీపీ నాయకులు ► కలెక్టరేట్ చుట్టుపక్కల మోహరింపు ► అటువైపు వచ్చినవారిపై దాడులు ► పెద్దమండ్యం ఎంపీపీ కిడ్నాప్ ► వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడిపై దాడికి యత్నం టీడీపీ కార్యకర్తలు, నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మంగళవారం కలెక్టరేట్లో నామినేషన్లు వేయడానికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. చేతిలో కొన్ని కాగితాలు.. సంచి.. ఉంటే చాలు. ఎవరు..?.. ఎక్కడ అని ఆలోచించలేదు. దొరికిన వారిని.. దొరికినట్టుగా ఎత్తుకెళ్లి చితకబాదేశారు. తమకు లోబడని వారిని కిడ్నాప్ చేసేందుకూ వెనుకాడ లేదు. అరుపులు..ఈలలు వేస్తూ హంగామా సృష్టించారు. ఎవర్నీ నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతులకు గురిచేశారు. ఇంతజరుగుతున్నా పోలీసులు ఏ ఒక్క కార్యకర్తనూ అడ్డుకోకపోవడం గమనార్హం. చిత్తూరు, సాక్షి : జిల్లాలో అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియలో పలువురు కార్యకర్తలు రౌడీలులాగా వ్యవహరించారు. నామినేషన్లు వేయడానికి వచ్చినవారిపై దాడులకు తెగబడ్డారు. కొందరిని కిడ్నాప్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే దొంగచాటుగా వచ్చే పరిస్థితి నెలకొంది. నామినేషన్ వేసి బయటికి వెళ్లాలన్నా భయమే. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేశారు. మంగళవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని బలవంతంగా కలెక్టరేట్ నుంచి తీసుకెళ్లిపోయారు. పీలేరుకు చెందిన భానుప్రకాష్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ చాంబర్ దగ్గరలోనే చింపేశారు. ఆయన నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పీలేరుకు చెందిన వెంకటరమణారెడ్డి అనుచరులను కలెక్టరేట్లోని డి–సెక్షన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి భయపెట్టారు. కళ్లెదుటే అన్నీ జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. నామినేషన్ వేసి వెళుతున్న వెదురుకుప్పం జెడ్పీటీసీ మాధవరావును నేండ్రగుంట వద్ద టీడీపీ నాయకులు దాడిచేసి కిడ్నాప్ చేశారని తెలిసింది. సామాన్యులపైనా దాడులు.. అధికార దర్పంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సామాన్యులపైనా దాడులకు తెగబడ్డారు. కొన్ని కాగితాలు, చేతిలో సంచి ఉంటే చాలు. చెలరేగిపోయారు. వారిపై విక్షణా రహితంగా దౌర్జన్యం చేశారు. పీలేరు నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులను కలిసేందుకు వచ్చిన డీలరు గౌరయ్యపై దాడులకు దిగారు. చేతిలో ఉన్న సంచిని లాక్కెళ్లి అందులో ఉన్న ఈపాస్ మిషన్‌ను పగులగొట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమావేశం ఉండడంతో కరీముల్లా అనే వ్యక్తి కలెక్టరేట్‌కు వచ్చారు. అతని చేతిలో కాగితాలు ఉండడంతో నామినేషన్ పత్రాలు అని ఊహించి టీడీపీ నాయకులు వాటిని చింపేశారు. విద్యార్హత పత్రాలూ తీసుకెళ్లారు. కరిముల్లా కన్నీరుమున్నీరయ్యారు. -
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన
– రాయలసీమ అభివృద్ధిని విస్మరించారు – ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి – ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు – అట్టహాసంగా వెన్నపూస గోపాల్‌రెడ్డి నామినేషన్ అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, రాయలసీమ అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయని ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం (వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు వెన్నపూస గోపాల్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అనంతపురం రెండో రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గోపాల్‌రెడ్డికి పార్టీ బీఫారంను ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తదితరులు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఒకటో రోడ్డులోని రాఘవేంద్ర స్వామి ఆలయానికి చేరుకుని.. పూజలు చేశారు. అక్కడి నుంచి సుభాష్ రోడ్డులోని మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. అందుకు భిన్నంగా కేంద్రానికి దాసోహమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్న గళాలను అణదొక్కేందుకు చూస్తోందన్నారు. రాష్ట్రానికి హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయఽని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు వేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ..ప్రస్తుతం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, యువత వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి ప్రభుత్వానికి చెంపపెట్టు వంటి తీర్పు ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ యువతకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేయాలన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్‌ను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసి బుద్ధి చెప్పాలన్నారు. కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించిన టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపలేదన్నారు. మాజీ మేయర్ రాగేపరశురాం మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్‌రెడ్డి, బుర్రా సురేష్‌గౌడ్, గౌస్‌బేగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, కదిరి నియోజకవర్గ నాయకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, కార్పొరేటర్ గంగన హిమబిందు, విద్యార్థి విభాగం నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, బండి పరశురాం తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు – వెన్నపూస గోపాల్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. హామీలను అమలు చేయకుండా దగా చేసింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. కేవలం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తోంది. కేంద్రం వద్ద సాగిలబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు రైల్వే జోన్ రాకుండా చేసింది. మహిళా సాధికార సదస్సు నిర్వహించినా.. మహిళా రిజర్వేషన్, హింసపై డిక్లరేషన్ ఇవ్వలేదు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే ధ్యేయంగా పని చేస్తోంది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, యువత నాకు ఓటు వేసి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. -
బీజేపీ తరపున సోము వీర్రాజు నామివేషన్