
అమరావతి : ఏపీ శాసనమండలిలోని ఎమ్మెల్యే కోటాలో గల అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల సంఘం పరిశీలించింది. ఆయా స్థానాలకు ఇతరులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టీడీపీ నుంచి యనమల, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు ఈసీ శుక్రవారం ప్రకటించింది. (అశోక్ బాబుపై ఉద్యోగుల ఆగ్రహం)