బీసీల దశదిశ మార్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘బీసీ డిక్లరేషన్’ ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇచ్చిన మాట తప్పని నైజం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానిదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. ‘ మహానేత వైఎస్‌ఆర్ హయంలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట తప్పని తత్వం వైఎస్‌ఆర్ కుటుంబానిది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో అన్ని వర్గాలు ఉన్నత చదువులు కొనసాగించేలా వైఎస్సార్ ఆ పథకం ప్రవేశపెట్టారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని వైఎస్సార్ గుర్తించే ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం.
బీసీల దశదిశ మార్చేలా ‘బీసీ డిక్లరేషన్’
Published Sun, Feb 17 2019 3:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement