సాక్షి, ఏలూరు : మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ‍్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు. బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారు. బీసీలకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని మాట ఇచ్చి చేసి చూపించారు. బీసీల కోసం నాడు నా పోరాటాలకు వైఎస్సార్ స్పందించారు. బీసీల కోసం కమిటీ కూడా వేశారు. బీసీలకు ఏదైనా చేసిన నాయకుడు ఉన్నారంటే వైఎస్సార్ అనే చెప్పాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లే మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ చలవ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. గురుకుల పాఠశాలలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీలు అభివృద్ధి కోసం నాడు వైఎస్సార్ పదేపదే తాపత్రయపడ్డారు.
అదేవిధంగా తండ్రి అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఏ ఒక్క పార్టీ కూడా స‍్పందించలేదు. పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఒక్క జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే హామీ ఇచ్చారు. పార్లమెంట్‌లో బీసీల రిజర్వేషన్లపై పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ సీపీదే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అప్పుడే రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది.
నేను 40సార్లు ప్రధానమంత్రిని కలిశానన్న చంద్రబాబు నాయుడు ఒక్కసారి అయినా బీసీల కోసం మాట్లాడారా?. సెంటిమెంట్లు, డబ్బులు, ప్రలోభాలు, క్షణికావేశాలకు బీసీలు లొంగిపోవద్దు. కచ్చితంగా వైఎస్ జగన్‌కే ఓటు వేయండి. మాట ఇస్తే తప్పని వ్యక్తి వైఎస్ జగన్. డిమాండ్లు పెడతానన్న భయంతోనే టీడీపీ బీసీ సభకు నన్ను పిలవలేదు. వైఎస్ జగన్ మీ డిమాండ్లు చెప్పాలని నన్ను ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment