
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు హనుమాన్ జంక్షన్ వద్ద నాలుగు గంటలుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ తలపెట్టిన బీసీ బహిరంగ సభ తర్వాత పోలీసులు పత్తా లేకుండా పోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కసారిగా బస్సులు, ఇతర వాహనాలు బయటకు రావడంతో రోడ్లు క్రిక్కిరిసిపోయాయి. వాహనాలు ముందుకు కదలడం కష్టమైపోయింది. కలపర్రు టోల్‌గేట్ వద్ద టోల్‌ఫీజు వసూలుతో మరింతగా ఇబ్బందులు తలెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment