ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు ఏమీ మేలు చేయలేదని వైఎస్‌ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు బీసీలను ఆదుకునే కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదని చెప్పారు. బీసీలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని తెలిపారు. వైఎస్సార్ కులమతాలకతీతంగా తన పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ పథకాలతో ఎక్కువ మేలు జరిగింది బీసీలకేనని వెల్లడించారు.