ఏలూరు బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ : బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు..మన జాతికి వెన్నెముక కులాలు’ ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టుగానే డిక్లరేషన్‌లో బీసీ ఉపకులాలన్నింటికీ పెద్ద పీట వేశారు. అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయింపులపై స్పష్టత బీసీల అభ్యున్నతికి దోహదపడే విధంగా డిక్లరేషన్ ఉందని అభివర్ణిస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తప్పనిసరిగా అమలు చేస్తారని, బడుగుల జీవితాలను మార్చుతారని ఆశిస్తున్నారు.
నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బీసీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. ఆయన మరణానంతరం బీసీల్ని పట్టించుకునే నాయకుడు కరువయ్యారు. వైఎస్సార్ ఉన్నంత కాలం కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా ఫీజు రియింబర్స్‌మెంట్, అందరికీ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, కార్పొరేషన్ రుణాలు...ఇలా అన్ని రకాలుగా బీసీలను ఆదుకున్న ఘనత వైఎస్‌కే దక్కిందని...ఆ తర్వాత పాలకులు గాలికొదిలేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో బీసీలను ఆదుకునేందుకు మళ్లీ వైఎస్ వారసత్వంగా, వారి ఆశయ సాధన దిశగా పనిచేస్తున్న జగన్‌మోహన్ రెడ్డి సమగ్ర అధ్యయనం చేసి, కులాల వారీగా ఆదుకునేందుకు దోహదపడేలా డిక్లరేషన్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక...దాదాపు ఐదేళ్లుగా అధికారంలో ఉండి బీసీలకు ఇచ్చిన 119 హామీల్లో ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయకుండా ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను కాపీ కొడుతూ, వాటినే తమ హామీలుగా చెప్పుకోవడాన్ని బీసీ వర్గాలు తప్పు పడుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం గల నాయకుడికి సొంత ఆలోచనలు రాలేదంటే బీసీలపై ఆయనకు చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతుందని బీసీలు చెబుతున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాల్లోనూ బీసీల ప్రభావం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో బీసీలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మళ్లీ పలు హామీలు ఇచ్చినా బీసీలు నమ్మడం లేదు. మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తారన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిక్లరేషన్‌పై నమ్మకం పెట్టుకున్నారు. దీంతో బీసీలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలుస్తున్నారు.
కార్పొరేషన్లతోఎంతో ప్రయోజనం
వెనుకబడిన తరగతుల వారిని ఆదుకోవాలంటే వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఉండాలన్న ఉద్దేశంతో బీసీ వర్గంలోని 139 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించారు. కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వదిలేయడమే కాకుండా సమృద్ధిగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. వీరందరికీ న్యాయం చేయాలన్న ఆశయంతో బీసీలకు ప్రతి ఏడాది రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు బీసీల కోసం కేటాయిస్తున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 32 లక్షల బీసీలు లబ్ధి పొందనున్నారు.
8 లక్షల మందిబీసీ విద్యార్థులకు ఊరట
బీసీ విద్యార్థుల ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని
వైఎస్ జగన్ ప్రకటించారు. దీనివల్ల ఐఏఎస్, ఐపీఎస్ ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంసీఎ, ఎంబీఎ తదితర ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంది. దాదాపు ప్రభుత్వమే వారి చదువుల బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది. అంతటితో ఆగకుండా హాస్టల్‌లో చదివే విద్యార్థులకు ఏటా రూ. 20వేలు మెస్ చార్జీల కింద కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ జగన్ ప్రకటించడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. వైఎస్ జగన్ ప్రకటనతో జిల్లాలో 8 లక్షల మంది బీసీ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
డెయిరీలకుపాలు పోస్తే రూ.4 అదనం
డెయిరీలకు పాలు పోసే పాడి రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఒక్కో లీటర్‌కి అదనంగా రూ.4 ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు. జిల్లాలో రైతులు 6 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 6 లక్షల 47 వేలు పాడి గేదెలు , 4 లక్షల 56 వేల పాడి ఆవులున్నాయి. వాటి ద్వారా రోజుకి 32 లక్షల 87 వేల 670 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 16 లక్షల 43 వేల 835 లీటర్ల మేర డెయిరీలకు పాలు పోస్తున్నారు. ఈ లెక్కన రోజుకి 66 లక్షల చొప్పున నెలకి రూ.20 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది.
‘వైఎస్సార్‌చేయూత’తోమహిళలకు ఊరట :కుల వృత్తిని చేపడితేనే పూట గడిచే పరిస్థితిబీసీ మహిళలది. ఈ పరిస్థితుల్లో మహిళలకు ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు అందిస్తే తప్ప స్వావలంబన సాధించ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి మహిళకు రూ.75 వేలు చొప్పున, నాలుగు విడతలుగా అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో వారి కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment