సాక్షి, ఏలూరు: ఎన్నికలు వస్తుండటంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీసీలు గుర్తుకొస్తున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన బీసీలను వాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్‌షిప్ పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కీలకమైన ‘బీసీ గర్జన’ సభ ప్రారంభమైంది. ఈ సభలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీల పట్ల చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని ఖండించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే బీసీలను చంద్రబాబు దూషించారని దుయ్యబట్టారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment