
సాక్షి, పశ్చిమ గోదావరి: ఈ రోజు ఏలూరులో జరగబోయే బీసీ గర్జన సదస్సు చారిత్రాత్మకమైనదని, ఓ రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించటం ఇదే మొదటిసారని వైఎస్సార్ సీపీ బీసీ నేతలు వ్యాఖ్యానించారు. బీసీ గర్జన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ బీసీ నేతలు బాల సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బర్రి శంకర్, మండల కన్వీనర్లు దొంగ మురళి, కర్రి ఏసు, బీసీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వల్లే న్యాయం జరుగుతుందని, చంద్రబాబునాయుడు ఇచ్చే తాయిలాలకు బీసీలు ఎవరూ మోసపోరన్నారు. వైఎస్ జగన్‌ను బీసీలు ఎవరూ ఈ విషయంలో మరిచిపోరని పేర్కొన్నారు. బీసీ గర్జనలో పాల్గొనడానికి నరసాపురం నియోజకవర్గం నుంచి ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో 4000 వేల మంది బీసీ సోదరులు 60 బస్సులు, 100 కారులలో బయలు దేరారు.