సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదయ్య
నవాబుపేట: అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. తాను అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి ఆయన పెట్టిన భిక్షేనని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జగ్జీవన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ.. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ దేశానికి రెండు కళ్లలాంటివారన్నారు.
వీరి జీవిత పాఠాలు అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టంచేశారు. అన్ని కష్టాలను వారు అనుభవించి మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన మహానుభావులని కొనియాడారు. అందరూ ఆత్మ గౌరవంతో బతికేందుకు చదువే ఏకై క సాధనమని చాటిచెప్పిన మహనీయులన్నారు.
జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి
దేశానికి అందరికన్నా ఎక్కువ సేవ చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. స్వాతంత్రోద్యమంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్లు ఆయన ఘనతేనని తెలిపారు. ఎమ్మార్పీస్ కేవలం రిజర్వేషన్ విభజన కోసమే పుట్టలేదన్నారు. ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్ల పెరుగుదల ఉద్య మంలో తమది కీలక పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరి ఆనందం,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, సర్పంచు లు సోలిసేట నర్సింలు, రత్నం,పర్మయ్య,రంగారెడ్డి, నాయకులు కళ్యాణ్‌రావ్, ఆనందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment