బ్యాంకాక్: మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 వేల మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలున్నదీ లేనిదీ వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తామంటూ దేశ మిలటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హెలయింగ్ తెలిపినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే, పదవీచ్యుత నేత అంగ్ సాన్ సుకీ(78) పేరు ఈ జాబితాలో ఉన్న సూచనల్లేవని పరిశీలకులు అంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. ఖైదీల విడుదల గురువారం మొదలై కొన్ని రోజులపాటు సాగుతుందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25 వేల మందికి పైగా నిర్బంధించినట్లు చెబుతున్నారు.
ఇవి చదవండి: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు
Comments
Please login to add a commentAdd a comment