ఆగస్ట్ 15న ఎన్టీఆర్ 'రభస' విడుదల | NTR 'Rabhasa' to release on Independence Day | Sakshi
Sakshi News home page

ఆగస్ట్ 15న ఎన్టీఆర్ 'రభస' విడుదల

Published Thu, Jul 31 2014 11:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

ఆగస్ట్ 15న ఎన్టీఆర్ 'రభస' విడుదల

ఆగస్ట్ 15న ఎన్టీఆర్ 'రభస' విడుదల

చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం  'రభస' ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి అభిమానులు పండుగ చేసుకోనున్నారు. ఎన్టీఆర్, నందమూరి అభిమానులకు ఈ చిత్రం అభిమానులకైతే పండుగలా ఉంటుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఆగస్ట్ 15న రభస చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పులేదన్నారు. సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమ బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందన్నారు.

రభస ఆడియోను ఆగస్ట్ 1వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో  ఘనంగా విడుదల చేస్తున్నట్లు బెల్లంకొండ తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందన్నారు. తమన్ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చాయని,  ఎన్టీఆర్‌, తమన్‌ కాంబినేషన్‌లో 'రభస' మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుందన్నారు.  ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడటం ఓ హైలెట్గా చెప్పొచ్చు. గతంలో జూనియర్....యమదొంగ, అదుర్స్, కంత్రీ చిత్రాల్లో గళం విప్పిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి ఎన్టీఆర్ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్‌, జయసుధ, సీత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement