ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం | lot of sacrifice for independence | Sakshi
Sakshi News home page

ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం

Published Tue, Aug 16 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం

ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగానే  మనం స్వాతంత్య్ర ఫలాలు అనుభవించగలుగుతున్నామని ముస్లిం మత పెద్ద గవర్నమెంట్‌ ఖాజీ సయ్యద్‌ సలీం బాష ఖాద్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో సల్పిన స్వాతంత్య్ర సమరంలో  ముస్లింల పాత్ర కీలకమన్నారు. మొట్టమొదటిసారిగా నగర ముస్లింలు,   మతపెద్దలు, మౌల్వీలు స్థానిక రాజ్‌విహార్‌ సెంటర్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. సర్వమానవాళి సుఖం కోసం దువా చేశారు.  అతిథులుగా వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బి.వై.రామయ్య, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఎస్సీ, మైనారిటీ సెల్‌ల రాష్ట్ర కార్యదర్శులు మద్దయ్య, రహ్మాన్‌తో పాటు   ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి  హాజరయ్యారు. కార్యక్రమంలో నోబుల్‌ సర్వీసెస్‌ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్‌ రజాక్, మౌల్వీలు మౌలానా జుబేర్‌ అహ్మద్‌ ఖాన్‌ రషాది, మౌలానా జాకిర్‌ అహ్మద్‌ రషాది, మౌలానా సులేమాన్‌ నద్వి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement