మాడ్రిడ్: కేటలోనియా వేర్పాటువాద ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. వేర్పాటువాద నేతలు స్వాతంత్య్రం ప్రకటించకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. శనివారం అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన ప్రధాని మేరియానో రాజోయ్ కేటలోనియా ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటలోనియన్ పార్లమెంటును రద్దుచేసేందుకు తనకు సంపూర్ణ అధికారాలివ్వాలని స్పెయిన్ సెనెట్‌ను ఆయన కోరారు. సెనెట్‌లో రాజోయ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పాపులర్ పార్టీకి మెజారిటీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment