ఆదిలాబాద్ రిమ్స్ : ఎందరో వీరుల పోరాటం.. మరెందరో మహాత్ముల త్యాగఫలం.. బ్రిటీష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ 68 స్వాతంత్య్ర భారతావనిలో గ్రామీణ ప్రాంతాలు నేటికీ వెనుకబడే ఉన్నాయి. మరి.. మనం సాధించిందేముంది అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గ్రామస్వరాజ్యమేది..!
గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలన్నది జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్ష. స్వాతంత్య్రం గడించి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా పారిశుధ్య లోపించింది. ప్రజలు దీనస్థితిలో ఉండిపోయారు. గుక్కెడు నీరు కూడా దొరకని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షకాలంలో పారిశుధ్యలోపం.. సీసీ రోడ్లు లేక ఎక్కడిక్కడ మట్టి రోడ్డుపై గుంత లు ఏర్పడి.. మురికి కాలువల్లేక దోమలకు నిలయంగా మారి వ్యాధులకు దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేని చెక్‌పవర్ సర్పంచ్‌కే ఉంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ చిత్తశుద్ధితో పనిచేయాలి.
ఉపాధికి దూరంగా యువత
నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఉపాధి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు మన పెద్దలు. అలాంటిది వారికి ఉపాధియే లేనప్పుడు వా రు ఇక దేశానికి ఎలా ఉపయోగపడేది. జిల్లాలో మూతబడిన పరిశ్రమలు తెరిపించడం ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. వృత్తివిద్యా కోర్సుల ద్వారా యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి.
వైద్యం.. అందని ద్రాక్షే
ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నా.. ఇంకా పేదలకు మాత్రం వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. జిల్లా కేంద్రంలో రూ.125 కోట్లతో రిమ్స్ ఆస్పత్రి నిర్మించినా వై ద్యుల కొరతతో నాణ్యమైన వైద్యం అందడం లేదు. అత్యవసర సమయంలో వైద్య సదుపాయం లేదంటూ ఇతర ప్రాం తాలకు రెఫర్ చేస్తున్నారు.
జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తం 3 వేల మంది సిబ్బంది వైద్య సేవలుందిస్తున్నారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, వైద్యుల కొరతతో రోగులకు వైద్యం అంద డం లేదు. విషజ్వరాలు, ఇతర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. ఏటా వందల సంఖ్యలో మరణిస్తున్నారు.
అక్షరాస్యతా.. అంతంతే..
నిరక్షరాస్యత మన దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. దీన్ని నిర్మూలించి తీరాలి అని మహాత్ముడు వ్యాఖ్యానించా రు. సరస్వతీ మాతకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా చదువుల్లో వెనుకబడింది. అంతటి ప్రాధాన్యమున్న అక్షరాస్యత మన జిల్లాలో 60 శాతమే. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 50 శా తం కంటే తక్కువనే చెప్పవచ్చు. పురుషుల్లో 71.22 శాతం ఉండగా, మహిళలు 51 శాతం మాత్రమే.
పెరుగుతున్న నేరాలు..
జిల్లాలో నేరాలు తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట నేరా లు జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలపై, మహిళలపై, చిన్నారులపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. హ త్యలు.. అత్యాచారాలు.. దాడులు.. ఇలా వివిధ రకాల సం ఘటనలు ఉంటున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 17 వేల నేర కేసులు నమోదయ్యాయి. ‘మాయమైపోతున్నడమ్మా.. మని షన్నవాడు.. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు’ అని ఓ సినీకవి చెప్పినట్లే ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఉంది.
68 ఏళ్లలో..ఇదీ మనం సాధించింది..
Published Fri, Aug 15 2014 12:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement