British rulers
-
జైహింద్ స్పెషల్: సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ
‘సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ..’ స్వరాజ్య ఉద్యమకారుల నాల్కలపై నడయాడిన గేయమిది. రెడ్డిరాజుల పరాక్రమాన్ని పుణికిపుచ్చుకున్న గాదె చిన్నపరెడ్డి శౌర్యపరాక్రమాలకు ఈ గేయం దర్పణం. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన కోటప్పకొండ దొమ్మీ చిన్నపరెడ్డి సాహసానికి నినాదం. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇంతగా ఊపిరిలూదిన ఆ.. చిన్నపరెడ్డి ఉరికొయ్యన సైతం ఉయ్యాలలూగిన ధీరుడు, యోధుడు. చదవండి: జైహింద్ స్పెషల్: 47కు 32 ఏళ్ల ముందే భారత్‌కు స్వాతంత్య్రం! గుంటూరుజిల్లా తెనాలి డివిజనులోని మండల కేంద్రం చేబ్రోలు శివారు.. కొత్తరెడ్డిపాలెం చిన్నపరెడ్డి స్వస్థలం. గాదె సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు ఆరుగురు మగ సంతానం. వీరిలో చివరివాడు చిన్నపరెడ్డి. 1864లో జన్మించాడు. నీలిమందు పంట సాగు వీరి ప్రధాన వ్యాపకం. నీలిమందును గుర్రాలపై మద్రాసు తీసుకెళ్లి విక్రయించేవారు. ఇంట్లోనే గుర్రాలు ఉండటంతో చిన్నతనం నుంచి చిన్నపరెడ్డికి స్వారీ అలవాటు. నీలిమందు పంట అమ్మేందుకు తాను కూడా నాటి మద్రాసు రాష్ట్రంలోని కూవం నది ఒడ్డున తెలుగువారి మార్కెట్‌కు వెళుతుండేవాడు. రెడ్డిపాలెం రాబిన్‌హుడ్ అప్పట్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కఠినంగా వసూలుచేసేవారు. కరువు రోజుల్లో గ్రామంలో వీరితోపాటు ఉండే రైతుకూలీలు, బీదాబిక్కీ ఆకలి బాధలు పడుతుండేవారు. వీరికోసం ధాన్యం కొల్లగొట్టేందుకు చిన్నపరెడ్డి జంకేవాడు కాదు. సమీప గ్రామాల్లోని రైతులను కలసి, తాను అడిగిన ధరకు ధాన్యం ఇవ్వమని కోరేవాడు. అందుకు నిరాకరిస్తే రాత్రికి రాత్రే పొల్లాల్లోని ధాన్యం కుప్పలను నూర్చుకు వచ్చేవాడు. ఆజానుబాహుడైన చిన్నపరెడ్డి, గుబురుమీసాలతో తలపాగా చుట్టుకుని గుర్రంపై స్వారీచేస్తూ రోడ్డుపై వెళుతుంటే చిన్నాపెద్దా కన్నార్పకుండా చూసేవారు. చేబ్రోలులో మకాంవేసిన జమీందారి సైన్యానికి ఇదే కంటగింపయింది. చేబ్రోలు రోడ్డులో గుర్రంపై వెళుతున్న చిన్నపరెడ్డిని వారు అడ్డుకున్నారు. రాజవీధుల్లో ఇతరులు స్వారీ చేయరాదని, తలపాగా చుట్టరాదని ఆంక్ష విధించారు. దీన్ని సహించలేకున్నా, అప్పట్లో ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చాడు చిన్నపరెడ్డి. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చిన్నపరెడ్డి ఊరు ఊరంతా వెంటరాగా గుర్రంపై స్వారీ వెళ్లాడు. పెద్ద రగడ అవుతుందేమోనని భావించిన చేబ్రోలులోని పెద్దలు రాజీ ప్రతిపాదన చేశారు. గొడవ సద్దుమణిగినా అతడిలో ఆత్మాభిమానజ్వాల రగులుతూనే ఉంది. ఈ గొడవ పరోక్షంగా మరో యుద్ధానికి తెరతీసింది. జాతీయ నేతల స్ఫూర్తి 1907లో నీలిమందు పంట విక్రయానికి మద్రాసు వెళ్లినపుడు అక్కడ కూవం నది ఒడ్డున జరుగుతున్న బహిరంగసభలో ప్రకాశం పంతులు, బాలగంగాధర తిలక్ ప్రసంగాలను విన్నాడు చిన్నపరెడ్డి. వారి నోటివెంట వెలువడ్డ ‘వందేమాతరం’ నినాదానికి చిన్నపరెడ్డికి రోమాలు నిక్కబొడిచాయి. తిరిగొచ్చాక ‘వందేమాతరం.. మనదే రాజ్యం, బ్రిటిష్‌వారిని పారద్రోలండి’ అనే నినాదంతో జనాన్ని ఉత్సాహపరిచే ఒక దండును తయారుచేశాడు. 1907లో చిన్నపరెడ్డి గురించి తెలుసుకున్న అప్పటి బ్రిటిష్ కలెక్టర్ అతడిని పిలిపించుకుని ఉద్యమాన్ని విరమించాలని కోరాడు. రాజీమార్గంలోకి తెచ్చేందుకు ఎంతో ఒత్తిడి చేసినా చిన్నపరెడ్డి అంగీకరించలేదు. భారీ ప్రభతో తిరునాళ్లకు మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు 60 అడుగుల ప్రభను సిద్ధంచేసి తీసుకెళ్లటం శివభక్తుడైన చిన్నపరెడ్డికి ఆనవాయితీ. నందీశ్వరుడికి ప్రతిరూపంగా శివలింగాల దివ్యతేజస్సుతో ఆరు రాతిచక్రాల ప్రభను అలంకరించేవారు. ప్రభతో అరవైమంది ఆహారధాన్యాలు, వంటకాలతో నడిచివెళ్లేవారు. కోటప్పకొండ ప్రాంతం అప్పట్లో రెడ్డిరాజుల పాలనలో ఉండేది. దీనితో రెడ్డిపాలెం నుంచి వెళ్లిన చిన్నపరెడ్డి ప్రభకు ముందువరుసలో స్థానం కల్పించేవారు. నరసరావుపేట సమీపంలోని రావిపాడుకు చెందిన మోతుబరి మహిళ తాలూకు ప్రభకు రెండోస్థానం ఇచ్చేవారు. గుర్రంతో సహా ఏటా కోటప్పకొండకు వెళ్లటం చిన్నపరెడ్డికి అలవాటు. ఏనుగులబాట నుంచి గుర్రంపైనే కొండపైకి నేరుగా వెళ్లేవాడు. స్వామివారికి పూజలు జరిపించి వచ్చేవాడు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
అవును... కొనసాగిస్తే ద్రోహమే!
శతాబ్దిన్నర క్రితం నాటి వలస పాలకుల చట్టమది. ఇవాళ అన్ని రకాలుగా కాలం చెల్లిన శాసనమది. అయినా సరే ఏలినవారి చేతిలో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే బలమైన ఆయుధంగా మిగిలింది. నిరసన తెలిపే రైతుల మొదలు విమర్శించే విలేఖరుల దాకా ప్రతి ఒక్కరినీ పాలకుల దృష్టిలో రాజద్రోహుల్ని చేసింది. ప్రభుత్వ సమీక్ష సాగే వరకు ఆ చట్టం అమలును నిలిపి వేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారమిచ్చిన ఆదేశం చరిత్రాత్మకమైనది. వేధింపులకూ, రాజకీయ కక్ష సాధింపులకూ సాధనంగా మారిన భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని ‘సెక్షన్ 124ఎ’ను సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనలపై ప్రజాస్వామ్యవాదులకు ఈ తీపి కబురు వచ్చింది. ఈ ఒక్క మాటతో చట్టాల దుర్వినియోగం సంపూర్ణంగా మారకపోయినా, కనీసం ఒక ముందడుగు. ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వ సమీక్ష ప్రక్రియ కోసం వేచిచూడాలి. ఒక చట్టంగా ఏదీ చెడ్డది కాకపోవచ్చు. కానీ, దుర్వినియోగంతోనే సమస్యంతా! రాజద్రోహ చట్టంలోనూ అదే జరిగింది. ఆ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చి, వారం తిరగకుండానే సరైన వేదికపై చట్టాన్ని సమీక్షిస్తామని మాట మార్చే ఏలికలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థల చొరవే సామాన్యులకు శ్రీరామరక్ష. రాజద్రోహ చట్టం కింద 2014 –19 మధ్య అయిదేళ్ళ కాలంలో దేశంలో మొత్తం 326 కేసులు దాఖలయ్యాయని హోమ్ శాఖే చెబుతోంది. వాటిలో అత్యధికంగా 54 కేసులు అస్సామ్ లోవే. అయితే, నమోదైన ఆ కేసుల్లో సగాని కన్నా తక్కువగా కేవలం 141 కేసుల్లోనే ఛార్జ్షీట్లు ఫైలయ్యాయి. తీరా ఆరుగురంటే ఆరుగురే దోషులుగా తేలారట. దీన్నిబట్టి పెడుతున్న కేసులకూ, దోషులకూ పొంతన లేదన్న మాట. ఇప్పటికీ ఏటా 90 శాతానికి పైగా కేసులు పెండింగ్‌లోనే. చరిత్ర చూస్తే, ఐపీసీ ముసాయిదాను రూపొందిస్తున్నప్పుడే బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే రాజద్రోహ చట్టాన్ని అందులో చేర్చారు. అయితే, 1860లో అమలులోకి వచ్చిన శిక్షాస్మృతిలో పొర పాటున ఈ చట్టాన్ని చేర్చలేదు. తర్వాత 1890లో ప్రత్యేక చట్టం 17 ద్వారా ఐపీసీలో 124ఎ సెక్షన్ కింద నేరంగా రాజద్రోహాన్ని చేర్చారు. అప్పట్లో ద్వీపాంతరవాస శిక్ష విధించేవారు. అటుపైన 1955లో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ అసమ్మతిని సహించలేని బ్రిటిష్ పాలకులు తిలక్, అనీబిసెంట్, మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్య్ర సమరయోధులపై ఈ శాసనాన్నే ప్రయోగించిన తీరు ఓ పెద్ద కథ. స్వాతంత్య్రం వచ్చాక రెండు హైకోర్టులు ఐపీసీ ‘సెక్షన్ 124ఎ’ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. కానీ, 1962 నాటి ప్రసిద్ధ కేదార్నాథ్ కేసులో అయిదుగురు జడ్జీల సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆ హైకోర్టు తీర్పుల్ని కొట్టేసి, ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొంది. హింసకు ప్రేరేపించనంత వరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినా సరే అది రాజద్రోహం కాదంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాతా గత 60 ఏళ్ళలో విచ్చలవిడిగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉండడం సిగ్గుచేటు. ఒక్క 2019లోనే రాజద్రోహం కేసులు 25 శాతం, అరెస్టులు 41 శాతం పెరిగాయి. అలా ఉద్యమ నేతలు హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్, పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవి, బీమా కొరేగావ్ కేసు నిందితుల మొదలు తాజా మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా – ఆమె భర్త దాకా పలువురు ఇప్పుడు రాజద్రోహులు. ప్రత్యర్థుల నోరు నొక్కడానికి కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఈ చట్టాన్ని వాటంగా చేసుకున్నాయని విమర్శలు వస్తున్నది అందుకే. 1950ల నుంచి నేటి దాకా పార్టీలకు అతీతంగా ఈ పాపంలో అందరిదీ భాగం ఉంది. భారత లా కమిషన్, సుప్రీం కోర్ట్ ఈ పరిస్థితిని ఎప్పుడో గుర్తించాయి. చట్టాన్ని రద్దు చేయడమే సబబన్నాయి. దేశ సమైక్యత, సమగ్రతకు పాకిస్తాన్, చైనా సహా అనేక ప్రమాదాలు పొరుగునే పొంచి ఉన్నవేళ, తీవ్రవాదాన్నీ, అసాంఘిక శక్తుల్నీ అణచివేయడానికి కఠిన చట్టాలు అవసరమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనో, మరొకటనో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఆ చట్టాలను దుర్వినియోగం చేయడంతోనే చిక్కు. ప్రాథమిక హక్కులైన వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు మినహాయింపుగా రాజద్రోహాన్ని పెట్టాలనే చర్చ రాజ్యాంగ రచన రోజుల్లోనే వచ్చింది. భారత రాజ్యాంగ షరిషత్లోని పలువురు సభ్యులు దానితో విభేదించి, ఆ మాటను చేర్చనివ్వక స్వేచ్ఛను కాపాడారు. అయితే, ఇవాళ చట్టమంటూ ఉన్నాక అరుదుగానో, తరచుగానో దుర్వినియోగం కాక తప్పని దుఃస్థితిలో పడ్డాం. అందువల్లే రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే వాదనలో బలం ఉంది. సమీక్షిస్తామనడం మంచిదే కానీ, దానికి ఏళ్ళూపూళ్ళూ కాలయాపన చేస్తేనే కష్టం. కొత్త పేరు, కొత్త రూపంలో పాత చట్టం తెస్తే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పటికే లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్ సాక్షిగా రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం విజ్ఞత. ఇంకా చెప్పాలంటే, విమర్శకులను వేధించడానికి సాధనాలవుతున్న ‘ఉపా’ లాంటి అనేక స్వాతంత్య్రానంతర కర్కశ చట్టాలపైనా ఆ ఉదార సమీక్ష నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది. మారిన కాలానికి తగ్గట్టుగా శిక్షాస్మృతిని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త స్మృతిని పార్లమెంట్ ఆమోదంతో తేవాలని నిపుణుల మాట. ఎనిమిదేళ్ళలో 1500కి పైగా పాత చట్టాలను రద్దు చేశామని జబ్బలు చరుస్తున్న పాలకులు ఇంతటి విప్లవానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా? ఎంతసేపటికీ అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయలేదనే కన్నా, ఇప్పుడు తాము చేసిచూపడంలోనే చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే అమృత కాలం గడిచిపోయింది. -
న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదు
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదని.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివని జై భీమ్ రియల్ హీరో జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు – పరిష్కార మార్గాలు’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అప్పట్లో బ్రిటీష్ పాలకులకు నేరాలు జరిగిన సమయంలో నేరస్థులను పట్టుకోవడం చేతకాలేదని, సులభంగా కేసులను మూసేందుకు వీలుగా కొన్ని సామాజిక తెగలను నేరస్థ తెగలుగా గుర్తిస్తూ వచ్చారని వెల్లడించారు. ఆ మేరకు చట్టం చేశారని, స్వాతంత్య్రం వచ్చాక కూడా అది కొనసాగిందని, కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగా ఆ చట్టం రద్దయిందని పేర్కొన్నారు. ఆ తెగలను డీ నోటిఫైడ్ చేసినా.. ఇప్పటికీ వారికి ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదని తెలిపారు. కమ్యూనిస్టులు చూపించే విముక్తి మార్గమే శాశ్వతమైందన్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్క ర్ చెప్పినట్లుగా ‘నేర్చుకో.. బోధించు.. పోరాడు’ను గుర్తుంచుకోవాలన్నారు. తాము యూనియన్లతో సంప్రదింపులు జరపమంటూ ముఖ్యమంత్రులు భీష్మించుకు కూర్చోడానికి వీల్లేదని జస్టిస్ చంద్రు చెప్పారు. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిన నాటి తమిళనాడు సీఎం జయలలిత, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ మొండికేసిన సందర్భాలను ఉటంకించారు. సెన్సార్ బోర్డులన్నీ ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులతో నిండిపోయాయన్నారు. జైభీమ్ సినిమాలో చూపించిన హింస వాస్తవంగా జరిగిన దాంట్లో 10 శాతం మాత్రమేనన్నారు. చదువుతోపాటు ధైర్యముండాలి... వ్యవస్థలో మార్పు కోసం పోరాడేందుకు చదువుకుంటేనే సరిపోదని, ధైర్యం కూడా ఉండాలని జస్టిస్ చంద్రు సూచించారు. సమ్మె చేశారనే కారణంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తే, వారంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే, వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ముందుకు రాలేదని తెలిపారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లు రాజుకన్న భార్య పోలీసుల ప్రలోభాలకు లొంగకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి న్యాయవ్యవస్థను కదిలించిందని గుర్తుచేశారు. జైభీమ్ సినిమా లోని జస్టిస్ మిశ్రా న్యాయవ్యవస్థ పనితీరును మానవీయంగా కొత్తమార్గం పట్టించారని కొనియాడారు. 1990లో చిదంబరంలో లైంగిక దాడికి గురైన మహిళ వామపక్ష పార్టీల సహకారంతో న్యాయంకోసం పోరాడగలిగిందనీ, అది మొదలు మిశ్రా అనేక కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు కట్టుబడ్డారని తెలిపారు. పరిహారం ఇచ్చే ప్రొవిజన్ లేకపోయినా... గౌరవనీయ పరిహారం ఇప్పించారన్నారు. భారత్‌లో మూడు గ్రామాలవ్యవస్థ ఉందని.. ఒకటి కాలనీ అని, మరొకటి షెడ్యూల్డ్ కులాల నివసించే ప్రాంతమని, మూడో నివాస ప్రాంతం ఆదివాసీలు ఉండేదని పేర్కొన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకం జనవరిలో విడుదల చేయనున్నట్లు జస్టిస్ చంద్రు వివరించారు. -
మహాత్ముని నోట మరణమనే మాట..!
భారతమాత నుదుట స్వేచ్ఛా తిలకం దిద్దిన ఉద్యమం అది. ప్రతీ భారతీయుడి నరనరాన రగిలిన మహోద్యమమది. క్విట్ ఇండియా... ఈ నినాదం మనదేశంలో స్వాతంత్రోద్యమాన్ని మలుపుతిప్పింది. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అవసరమైన పోరాట స్పూర్తిని నింపింది. బ్రిటీష్ పాలకులను గడగడలాడించింది. డూ ఆర్ డై అనే నినాదం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యానికి పునాదులు వేసింది. నేటితో క్విట్ ఇండియా ఉద్యమానికి 77 ఏళ్లు నిండిన సందర్భంగా సాక్షి .కామ్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ... -
భాషల బాషా
‘బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’ అంటాడు ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ వేలెత్తి చూపుతూ. దేశంలోని ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ..ఎన్ని ఏకార్థ పదాలున్నాయో కొండలు, కోనలు ఎక్కిదిగి మరీ చెబుతున్నాడు గణేశ్ నారాయణ్ దేవ్. అందుకే ఆయన భాషల బాషా! మనదేశంలో ఎన్ని భాషలున్నాయి? 780. ఇది మల్టిపుల్ చాయిస్లో ఒక ఆప్షన్ కాదు. నూటికి నూరు శాతం కచ్చితమైన ఆన్సర్. మరో ప్రశ్న.. మనదేశంలో ఉన్న భాషల్లో లిపి ఉన్న భాషలెన్ని? 86. ఇక్కడ కూడా రెండో ఆప్షన్ లేదు. నికార్సయిన జవాబిది. ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్నలోంచే ఇప్పుడు మనం ఆసక్తికరమైన అనేక విశేషాల్లోకి వెళ్లబోతున్నాం. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు? ఇదేం ప్రశ్న. ఎన్నో భాషలెందుకుంటాయి? అని ఎదురు ప్రశ్నించారంటే ‘మంచు’లో కూరుకుపోయినట్లే. అక్కడ పదహారు రకాల భాషలు మనుగడలో ఉన్నాయి. మంచుకొండల పాదాల చెంత విస్తరించిన దేశంలో మంచును వర్ణించడానికే 200 పదాలున్నాయి! ఆశ్చర్యంగా ఉన్నా సరే... ఇది నిజం. ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ దేశవ్యాప్తంగా సంచరించి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయిన విషయాలివి. మనుగడ పోరాటం పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ‘లింగ్విస్ట్ గణేశ్ నారాయణ దేవ్’ ఆధ్వర్యంలో ఈ ‘ఏకార్థ పదాల సర్వే’ జరిగింది. రాజస్థాన్‌లోని సంచార తెగల్లో ఎడారి ఇసుకను వర్ణించడానికి ఎన్ని పదాలు వాడతారో లెక్క పెట్టడం కూడా సాధ్యం కాదు. ఆ తెగల వాళ్లు అనేక ప్రాంతాల్లో సంచరిస్తుంటారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా వాడుకలో ఉన్న పదాలన్నింటితోనూ అనుబంధం కలిగి ఉంటారు. ఇలా మనదేశంలో ఎన్నో భాషలు, మరెన్నో మాండలికాలు... వేటికవి తమ ఉనికిని కాపాడుకుంటూ ఉంటాయి. అయితే గడచిన యాభై ఏళ్లలో మనదేశంలో దాదాపుగా 250 భాషలు అంతరించి పోయాయి. అంతకు ముందెప్పుడో..! మనదేశంలో భాషల మీద అధ్యయనం, భాషల పరిరక్షణ బ్రిటిష్ హయాంలో జరిగింది. ముప్పై ఏళ్ల పరిశోధనలో వాళ్లు గుర్తించింది 364 భాషలు, మాండలికాలను మాత్రమే. బ్రిటిష్ పాలకులు నియమించిన విదేశీ ఉద్యోగులు మారుమూల ప్రదేశాలకు వెళ్లక పోవడం, వాళ్లకు భారతీయ భాషల్లోని వైవిధ్యత స్పష్టంగా తెలియకపోవడంతో ఆ పరిశోధన పరిమితమైన నివేదికను మాత్రమే ఇవ్వగలిగింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో మన పాలకులు భాషాపరమైన పరిశోధన మీద ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పటికీ అధికారిక లెక్కల్లో బ్రిటిష్ అధికారుల నివేదిక ప్రామాణికంగా కొనసాగుతోంది. దానిని వ్యతిరేకిస్తారు గణేశ్. అందుకే ఆయన పరిశోధన మొదలు పెట్టారు. పదేళ్లవుతోంది ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ 2010లో ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. రచయితలు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, స్కూలు టీచర్లతోపాటు భాషల మీద ఆసక్తి కలిగిన వాళ్లు మొత్తం కలిసి 3500 మంది ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వీరికి సర్వే ఎలా నిర్వహించాలనే మార్గదర్శనం చేయడం కోసం దేవ్ దేశవ్యాప్తంగా పర్యటించి మూడు వందల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. గణేశ్ నారాయణ దేవ్ మహారాష్ట్రలో పుట్టారు, వాళ్లది గుజరాతీ కుటుంబం. ఇంట్లో గుజరాతీ మాట్లాడేవాళ్లు. స్కూల్లో మరాఠీ మాధ్యమంలో చదవాల్సి వచ్చింది. అది ఒక సంఘర్షణ, అసౌకర్యం. అలాగే టెన్త్ పూర్తిచేసి కాలేజ్‌లో అడుగుపెట్టినప్పుడు ఇంగ్లిష్ రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. ఆంగ్లంలో చెప్పే పాఠాలు అర్థం చేసుకోలేక కాలేజ్ మానేసి గోవాకు వెళ్లి గనుల్లో రోజు వారీ కూలీగా పనికి కుదిరారు. ఖాళీ సమయంలో ఇంగ్లిష్ రచనలను విస్తృతంగా చదివారు. ఇంగ్లిష్ మీద ఇష్టం పెరిగిన తర్వాత తిరిగి కాలేజ్‌లో చేరారు. తర్వాత కొల్హాపూర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ కూడా చేశారు దేవ్. బరోడాలోని మహారాజా షాయాజీ రావు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో భాషల మీద పరిశోధన మొదలు పెట్టారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో 92 పుస్తకాలు రాయడానికి సిద్ధమయ్యారాయన. 2013లో మొదలైన ఈ యజ్ఞంలో ఇప్పటికి 45 పుస్తకాలు పూర్తయ్యాయి. మిగిలినవి 2020 నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు జి.ఎన్ దేవ్. మంజీర -
ఓటొచ్చిన వేళా విశేషం
ఆకాశంలో సగమైనా అన్నింటా వెలివేతే! అన్ని అవరోధాలనూ అధిగమించి, ప్రతి అడ్డంకినీ ప్రతిఘటించి, చివరకు ఇంటా బయటా అన్నీ తానై నిలిచి, రణానికీ సైతం సిద్ధపడి, విశాల ప్రపంచాన్ని శాసిస్తోన్న మహిళల చరిత్ర అంతా నిరాకరణే. ఇక రాజకీయ హక్కుల సంగతి సరేసరి. అసలు ప్రపంచ ప్రజల ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కు మగువ చేతికి రావడానికే శతాబ్దాలు పట్టింది. ‘మాటలు కాదు చేతలు కావాలి’ (డీడ్స్ నాట్ వర్డ్స్).. ఇది ఈనాటి ఎన్నికల నినాదం కాదు. 1913లోనే అంటే.. నూటా ఆరు సంవత్సరాల క్రితమే స్త్రీలు పురుషులతో సమానంగా స్త్రీలకూ ఓటు వేసే హక్కు కావాలంటూ బ్రిటన్ వీధుల్లో కదం తొక్కిన మహిళల రాజకీయ రణన్నినాదం. శాంతి ప్రదర్శనలూ, నిరసనలూ, ధర్నాలతో దిగిరాని నాటి బ్రిటిష్ పాలకులను హడలెత్తించిన మహిళల మహోద్యమమది. తపాలా కార్యాలయాలు తగలబెట్టారు. పోలీసు స్టేషన్లపై రాళ్ల వర్షం కురిపించారు. పాలకుల కార్యాలయాలనూ చుట్టుముట్టారు. సమాచార వ్యవస్థని ధ్వంసం చేశారు. టెలిఫోన్ వైర్లు తెంపేశారు. దీనికి నాయకత్వం వహించిన మహిళ ఎమ్మలీన్ పంఖస్ట్. ఈ మహిళోద్యమంతో బెంబేలెత్తిన పోలీసులు స్త్రీలను ఇళ్లల్లోనుంచి వీధుల్లోకి లాక్కొచ్చారు. అరెస్టుల పాల్జేశారు. ఓటు అడిగినందుకు వారిని మట్టిలో దొర్లించి, గుర్రాలతో తొక్కించారు. రక్తసిక్తమైన గాయాలతో ఆ పోరాటంలో ఎమిలీ డెవిసన్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అయినా చలించలేదా స్త్రీలు. జైల్లోనే నిరశన దీక్షకు పూనారు. ముద్దముట్టబోమని శపథం చేసారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మహిళల ఓటు హక్కుని నిర్లక్ష్యం చేసినందుకు, మాయమాటలు చెప్పి మహిళలను తరాల తరబడి వంచించినందుకు వందేళ్ల క్రితమే స్త్రీల రాజకీయ చైతన్యాన్ని చవిచూసిన బ్రిటన్ కథ ఇది. అయితే ఇది ఒక్కటే కాదు. ఆనాటికే అనేక దేశాల్లో స్త్రీలు ఓటు హక్కుకోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా 170 ఏళ్ల క్రితం స్త్రీల ఓటుహక్కు నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. దాని పునాదులు అమెరికాలోనే ఉన్నా ఆ తరువాత భారతీయ మహిళలు ‘ఓటు మా హక్కు’ అనే నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రాచీన గ్రీస్, రోమన్ రిపబ్లిక్ తో సహా 18వ శతాబ్దాంతంలో ఆవిష్కృతమైన ప్రజాస్వామ్య దేశాలెన్నో మహిళలకు ఓటు హక్కుని నిరాకరించాయి. 1832లో యునైటెడ్ కింగ్డమ్ మహిళల ఓటుహక్కు నిరాకరణ వారసత్వాన్ని కొనసాగించింది. అయితే తొలిసారిగా బ్రిటన్‌లోనూ, అమెరికాలోనూ 19 వ శతాబ్దంలో మహిళల ఓటు హక్కు చర్చనీయాంశంగా మారింది. ఓటు మహిళల ఉద్యమంగా మారింది. అయితే ఏ దేశాల్లో అయితే ఈ ఉద్యమం జరిగిందో ఆ దేశాలు తొలుత మహిళలకు ఓటు హక్కు ప్రసాదిం^è కపోవడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మహిళల హక్కులు ఏవీ మానవహక్కుల్లో భాగం కాలేదు. ఆమాటకొస్తే ఈరోజుకీ అదే పరిస్థితి కొనసాగుతోంది. విముక్తితో పాటే ఓటూ! రెండవ ప్రపంచ యుద్ధానంతరం అనేక పోరాటాల తరువాత మహిళలు ఓటు హక్కుని సాధించుకోగలిగారు. బ్రిటిష్ పాలననుంచి మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే సమయంలోనే స్త్రీలకు ఓటు హక్కుని రాజ్యాంగబద్దం చేసింది. భారత స్వతంత్య్ర సంగ్రామంలోనే స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన మహిళ సరోజినీ నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే సరోజినీ నాయుడు.. అనీబిసెంట్‌తో కలిసి 1917లో వుమెన్స్ ఇండియా అసోసియేషన్ స్థాపించారు. అదే సంవత్సరం స్త్రీలకు ఓటు హక్కుని ఆమోదించాలని ఆనాటి స్టేట్ సెక్రటరీ ఎడ్విన్ మాంటెగ్కి వినతిపత్రం సమర్పించిన బృందానికి సరోజినీ నాయుడు నాయకత్వం వహించారు. మన దేశంలో స్త్రీల ఓటు హక్కు కోసం 1900 సంవత్సరంలోనే ఉద్యమం ప్రారంభం అయినా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు 1947కి పూర్వం పురుషులకి కానీ, మహిళలకి కానీ సార్వత్రిక ఓటు హక్కు లేదు. విద్య, వ్యాపారాలూ, ఆస్తిపాస్తులూ ఉన్నవారికే ఓటు హక్కు ఉండేది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తరువాత 1950లో మన దేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటు హక్కుని ఆమోదించారు. 1950లో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వజనీన ఓటు హక్కు ద్వారా స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఓటు హక్కు సాధ్యమయ్యింది. మహిళలకు ఓటేసిన శతాబ్దం ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు వేసే అవకాశం వచ్చింది 20 శతాబ్దంలోనే. ఒక్క 1893లో మాత్రం న్యూజిలాండ్ జాతీయ ఎన్నికల్లో మహిళ తొలిసారిగా తన ఓటు హక్కుని వినియోగించుకుంది. ఆ తరువాత 1902లో ఆస్ట్రేలియా, 1906లో ఫిన్లాండ్, 1913లో నార్వే మహిళలకు ఓటు హక్కు ఇచ్చాయి. స్వీడన్‌లోనూ, అమెరికాలోని స్థానిక ఎన్నికల్లో మహిళలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 1914–39 సంవత్సరాల మధ్య కాలంలో మరో 28 దేశాల్లో నేషనల్ ఎలక్షన్స్‌లో స్త్రీలు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అందులో సోవియట్ రష్యా కూడా ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా, యుగోస్లేవియా, చైనా దేశాలు స్త్రీల ఓటు హక్కుని ఆమోదించాయి. మన తరువాత ఆరేళ్లకు పాకిస్తాన్లో 1956లో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఇక ప్రపంచంలో మహిళల ఓటు హక్కుని ఆమోదించిన దేశాల సంఖ్య 100 కు చేరడానికి మరో దశాబ్దకాలం పట్టింది. 1971లో స్విట్జర్లాండ్ పాక్షికంగా స్త్రీలకు ఓటు వేసే అవకాశాన్నిచ్చింది. 1973లో సిరియా పూర్తిస్థాయిలో స్త్రీల ఓటు హక్కుని ఆమోదించింది. అయితే అనేక అరబ్ దేశాల్లోనూ, పర్షియన్ గల్ఫ్ దేశాల్లోనూ, సౌదీ అరేబియాలాంటి అనేక సాంప్రదాయ వాద దేశాల్లోనూ చాలా కాలం మహిళల ఓటు హక్కు నిరాకరణకు గురయ్యింది. తొలిసారిగా 2015లో సౌదీలో మహిళల ఓటు హక్కును ఆమోదించారు. తొలిసారి అక్కడి మహిళలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసారు. మహిళల రాజకీయ హక్కులపై జరిగిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్‌లో ఎటువంటి వివక్షకూ అవకాశం లేకుండా పురుషులతో సమానంగా స్త్రీలకు సైతం ఓటు హక్కు ఉండాలని 1952లో జరిగిన తీర్మానం కూడా ఈ మార్పుకు తోడ్పడింది. – అత్తలూరి అరుణ పేద మహిళల కోసంక్లారా ఓటు పోరాటం స్త్రీ పురుష సమానత్వం కోసం, ప్రపంచ స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తిన జర్మనీకి చెందిన సోషలిస్టు, కమ్యూనిస్టు క్లారా జెట్కిన్. స్త్రీ విముక్తి పోరాటాలెన్నింటికో నాయకత్వం వహించిన క్లారాజెట్కిన్ శ్రామిక మహిళల పోరాటదినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని తొలిసారి ప్రకటించిన పోరాటయోధురాలు. యూరప్ సంపన్న వర్గ మహిళలు, నాటి ఫెమినిస్టులు ఆస్తి ప్రాతిపదికగా ఇచ్చే స్త్రీల ఓటు హక్కుని ఆమోదించారు. అయితే రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మిక వర్గ స్త్రీల ఓటు హక్కుని గురించి మాట్లాడకపోతే ఈ ఉద్యమానికి అర్థం లేదని క్లారా వాదించారు. అందుకే ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అందరు స్త్రీలతో పాటు పేద కార్మికవర్గ స్త్రీలకు సైతం ఓటు హక్కు కోసం క్లారా గళమెత్తారు. -
72 సంవత్సరాల ప్రేమ
స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో విడిపోయిన ఓ యువజంట, 72 ఏళ్ల తర్వాత అనూహ్యంగా కలుసుకుంది. ఒకరికోసం మరొకరు చాలా ఏళ్లు ఎదురు చూసి, ఇక జీవితంలో కలవలేమని నిరాశ చెంది, పరిస్థితులతో రాజీ పడిపోయి బతికిన ఆ జంట.. జీవిత చరమాంకంలో కలుసుకోవడం ఒక సినిమా కథనే తలపింపజేస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. అది 1946వ సంవత్సరం. కేరళలోని కవుంబాయి గ్రామం. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఏక్నారాయణన్ నంబియార్ వయసు 17 ఏళ్లు. శారదకి 13 ఏళ్లు.. వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. పట్టుమని పదినెలలు కలిసి ఉన్నారో లేదో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూస్వాములకి వ్యతిరేకంగా రైతన్నలు కదం తొక్కారు. ఆ ఉద్యమంలో నారాయణన్ నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్‌తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. ఆ ఉద్యమం హింసాత్మకంగా మారింది. బ్రిటిష్ జవాన్ల కాల్పుల్లో చాలా మంది మరణించారు. నారాయణన్ నంబియార్ అందులో తప్పించుకున్నారు. తండ్రితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఇంట్లోనే దాక్కున్నారని బ్రిటిష్ పాలకులు భావించారు. వారి ఆదేశాల మేరకు మలబార్ స్పెషల్ పోలీసులు నంబియార్ ఇంటిపైన దాడి చేశారు. నంబియార్ ఆచూకీ చెప్పకపోతే అందరినీ కాల్చి పారేస్తామని హెచ్చరించారు. ప్రాణభయంతో గజగజలాడుతున్న శారదను చుట్టుపక్కల వారు కాపాడి వాళ్ల పుట్టింటికి పంపేశారు. ఆ తర్వాత నంబియార్ ఆచూకీని కనుక్కున్న పోలీసులు తండ్రీ కొడుకుల్ని జైల్లో పెట్టారు. తరచూ జైళ్లు కూడా మార్చారు. దీంతో భార్యాభర్తలిద్దరికి ఒకరి గురించి మరొకరికి వివరాలు తెలియలేదు. భర్త ఎప్పటికైనా వస్తాడేమోనని శారద ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసేది. కానీ పుట్టింటివాళ్లు బ్రిటిష్ సైన్యం నంబియార్‌ను చంపేసి ఉంటుందని నిర్ధారించుకొని ఆమెకి బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు. మరోవైపు జైల్లో రామన్ నంబియార్‌ను కాల్చి చంపేశారు. నారాయణన్ శరీరంలో కూడా తూటాలు దిగినా, ప్రాణగండం తప్పింది. పదేళ్ల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన నారాయణన్ నంబియార్‌కి భార్య జాడ తెలియలేదు. దీంతో జీవితంతో రాజీపడి అతనూ మరో పెళ్లి చేసుకున్నారు. అలా ఒకరి పట్ల మరొకరికి అనంతమైన ప్రేమానురాగాలు ఉన్న ఆ జంటని విధి విడదీసింది. అలా ఏళ్లకి ఏళ్లు గడిచిపోయాయి. శారద కుమారుడు భార్గవన్ పెరిగి పెద్దయి వ్యవసాయం చేసేవాడు. ఒకసారి వ్యవసాయ పనుల కోసం కన్నూర్‌కి వచ్చి అనుకోకుండా నారాయణన్ మేనల్లుడు మధుకుమార్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు తమ కుటుంబ వివరాలు పంచుకున్నారు. అప్పుడే తెలిసింది మధుకుమార్ మేనమామ నారాయణన్ నంబియారే తన తల్లి శారద మొదటి భర్త అని. 30 ఏళ్ల క్రితమే శారద రెండో భర్త మరణించారు. నంబియార్ భార్య కూడా చాలా ఏళ్ల క్రితమే కన్నుమూసింది. అందుకే వాళ్లిద్దరూ ఆ మాజీ జంటని ఒక్కటి చెయ్యాలని అనుకున్నారు. విషయం విన్న నంబియార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ శారద పరిస్థితి కూడా అదే. నంబియార్ రెక్కలు కట్టుకొని భార్గవన్ ఇంట్లో వాలిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 ఏళ్ల తర్వాత, తొంబై ఏళ్ల వయసులో ఒకరినొకరు చూసుకోగానే వారిద్దరికీ నోటి వెంట మాట కూడా రాలేదు. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీళ్లని అదిమిపెట్టుకుంటూ నంబియార్ శారద తలపై చేయి వేసి ఆర్తితో నిమిరాడు. ఆ చర్య ఒక్కటి చాలు. వారిద్దరి గుండెల్లో ప్రేమ ఎంతలా గూడు కట్టుకొని ఉందో చెప్పడానికి. ఇదంతా చూసిన బంధువులు కూడా వారిద్దరిదీ ఆత్మబంధం అని కీర్తించారు. ఇక తరచూ ఆ రెండు కుటుంబాలు కలవాలని నిర్ణయించుకున్నాయి. ఆనాటి రైతు పోరాటంతోపాటు వీరిద్దరి జీవిత కథని నారాయణన్ మనవరాలు శాంత ‘డిసెంబర్ 30’ అన్న పేరుతో ఒక నవలగా తీసుకువస్తుండడం విశేషం. -
బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : బ్రిటిష్ పాలకులు మరో వందేళ్లు దేశాన్ని పాలించాల్సిందని బీఎస్పీ యూపీ చీఫ్ ధరంవీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని మరో వందేళ్లు పాలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఎదిగేవారని అన్నారు. బీఆర్ అంబేడ్కర్‌ను బ్రిటిషర్లు చదువుకునేందుకు అనుమతించకపోతే దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించగలిగే వారు కాదని వ్యాఖ్యనించారు. బ్రిటిష్ పరిపాలనలో ఆయనకు చదువుకునే అవకాశం దక్కిందని, వారు లేకుంటే దేశంలో ఏ పాఠశాలలోనూ బాబాసాహెబ్‌కు అడ్మిషన్ లభించేది కాదని అన్నారు. ధరంవీర్ వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన నేతలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. బ్రిటిషర్ల పాలనకు గాను మనం రుణం చెల్లించాలని ధరంవీర్ భావిస్తే ఆయన బ్రిటన్‌లో శరణార్ధిగా ఉండాలని కొందరు నేతలు సూచించారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో బిఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ ఏడున జరిగే రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను టార్గెట్ చేసిన బీఎస్పీ వారిని ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. -
టర్కీ, పాక్ నుంచి విమానంలో ఆయుధాలు!
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోలేదు. కానీ నాటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సైనిక చర్యతో తలవంచాల్సి వచ్చింది. బ్రిటిష్ పాలకులు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి నిర్ణయించినప్పుడు దేశంలోని సంస్థానాలకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. స్వతంత్రంగా కొనసాగడమా?... భారత్‌లో విలీనమవడమా? తేల్చుకోవాలన్నారు. కశ్మీర్, హైదరాబాద్ మినహా అన్ని సంస్థానాలు విలీనమయ్యాయి. ఈ రెండు సంస్థానాలు దేశంలోని ఇతర సంస్థానాలతో పోల్చితే చాలా పెద్దవి. స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ పాలనలో చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ హైదరాబాద్ సంస్థానం దాదాపు 200 ఏళ్లు కుతుబ్ షాహీ, 224 ఏళ్లు ఆసిఫ్ జాహీల పాలనలో ఉంది. అయినా ఇతర నగరాలు, సంస్థానాల కంటే హైదరాబాద్ మెరుగ్గానే ఉంది. హైదరాబాద్ సంస్థానంలో రోడ్లు, బస్సు, రైలు, విమానయానం కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, కర్మాగారాలు, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలున్నాయి. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పుష్కలంగా ఉన్నాయి. రైతులకు నరకం.. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాలనలో జమిందార్, జాగీర్ వ్యవస్థ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులు పండించిన పంటలపై విపరీతంగా పన్నులు వసూళ్లు చేశారు. పంట పండించిన రైతుకే అన్నం లభించేది కాదు. రైతుల జీవితాలు నరకప్రాయంగా ఉండేవి. సంస్థానం విలీనమైతే ఈ వ్యవస్థ పోతుందని తమకు స్వేచ్ఛ లభిస్తుందని రైతులు భావించారు. ఈ క్రమంలోనే దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. ఈ సమయంలో నిజాం రాజు ఏ నిర్ణయం తీసుకోలేదు. సంప్రదింపుల తరువాత భారత్ ప్రభుత్వం, హైదరాబాద్ సంస్థానం మధ్య 1947, నవంబర్ 29న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు హైదరాబాద్ సంస్థానం యథాతథంగా కొనసాగాలని నిర్ణయించారు. భారత దేశంలో విలీనం... నాటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో కలపాలని నిర్ణయించాడు. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో సైన్యాన్ని హైదరాబాద్ పంపాలని ఆదేశాలిచ్చారు. భారత సైన్యం అన్ని రకాల ఆయుధాలతో బయలుదేరింది. నిజాం తన సంస్థానానికి టర్కీ, పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందని భావించాడు. నిజాంకు చెందిన సిడ్నీ కాటన్ విమానం ఆ దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు తీసుకొని వస్తుందని అనుకున్నారు. ఈ రెండూ జరగలేదు. అప్పటికే రజాకార్ల దౌర్జన్యంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, మరోవైపు భారత సైన్యంతో మన సైన్యం పోటీపడలేదని సైన్యాధిపతి అల్ ఇద్రూస్ నిజాం తెలియజేశారు. భారత సైన్యం సునాయాసంగా నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 1948, సెప్టెంబర్ 17న సాయంత్రం ఏడు గంటలకు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిజాం పాలన ఇంతటితో అంతమైందని, నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించారు. ఈ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో పెట్టిన అన్ని కేసులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి అల్ ఇద్రూస్ భారత సైన్యా«ధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపొయాడు. మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి హైదరాబాద్ సైనిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1949 వరకు కొనసాగారు. అనంతరం 1950 జనవరిలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారి ఎం.కె. వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించింది. తర్వాత 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. రజాకార్లతో .. ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాలను తమ సమస్యల పరిష్కారానికి ఒకే వేదికపైకి తీసుకురావడానికి 1924లో బహదూర్ యార్ జంగ్ మజ్లీస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ సంస్థను స్థాపించారు. 1944లో బహదూర్ యార్ జంగ్ మృతి చెందడంతో మజ్లిస్ పగ్గాలు ఖాసీం రజ్వీ చేతికొచ్చాయి. అప్పటికే స్వాతంత్ర ఉద్యమం తారస్థాయికి చేరింది. బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్ సంస్థానం కూడా దేశంలో కలిస్తే మన పరిస్థితి దారుణం అయిపోతుందని ముస్లింలను రజ్వీ రెచ్చగొట్టాడు. రజాకార్ (స్వచ్ఛంద) అనే గ్రూప్‌ను తయారు చేసి వారికి కర్ర, ఆయుధాల శిక్షణ ఇచ్చాడు. దేశానికి అనుకూల నినాదాలు చేసిన వారిపై రజాకార్లు దాడులు చేయడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయిన తరువాత ఖాసీం రజ్వీని జైలులో పెట్టారు. ఆరేళ్ల తర్వాత విడుదలై పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడే మరణించాడు. -
థ్రిల్లింగ్ షిల్లాంగ్...
టూర్‌దర్శన్ - షిల్లాంగ్ వెండిమబ్బులను తాకే కొండల తీరు... కొండల మీదుగా జోరుగా దూకే జలపాతాల హోరు... పచ్చని పరిసరాల్లోంచి తలపెకైత్తి చూస్తే నింగీ నేలా కలుసుకున్నాయా అనిపించే ప్రకృతి వర్ణవైవిధ్యం... బాతులు ఈదులాడే కొలనులు, కొంగలు వాలే సరస్సులు సరేసరి... సముద్ర మట్టానికి దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున వెలసిన పట్టణం షిల్లాంగ్... పట్టణానికి చుట్టూ దట్టమైన అరణ్యం... ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి సేదదీరాలనుకునే పర్యాటకులకు ఇది సాక్షాత్తు స్వర్గధామాన్నే తలపిస్తుంది. అస్సాం నుంచి మేఘాలయ 1972లో విడిపోయేంత వరకు షిల్లాంగ్ అస్సాం రాజధానిగా ఉండేది. ఇక్కడి చల్లని వాతావరణానికి, చూడచక్కని ప్రకృతి అందాలకు ముగ్ధులైన బ్రిటిష్ పాలకులు ఇక్కడ తరచుగా విడిది చేసేవారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఇక్కడ ఒక వేసవి విడిది గృహాన్ని నిర్మించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత సుందర నగరంగా పేరుపొందిన షిల్లాంగ్, నేటికీ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. ఏం చూడాలి? చిన్న పట్టణమే అయినా షిల్లాంగ్‌లో చూసి తీరాల్సిన ప్రదేశాలు, విశేషాలు చాలానే ఉన్నాయి. షిల్లాంగ్ శిఖరం పైనుంచి పరిసరాల పచ్చదనాన్ని తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం, పరిసర ప్రాంతాలు చక్కగా కనిపిస్తాయి. తూర్పు ఖాసీ కొండలపై వెలసిన షిల్లాంగ్ పరిసరాల్లో ఎక్కడికక్కడ జలపాతాలు కనిపిస్తాయి. వీటిలో ఎలిఫెంట్ జలపాతం, స్ప్రెడ్ ఈగల్ జలపాతం, స్వీట్ జలపాతం, క్రినోలిన్ జలపాతాల వద్దకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఉరకలేసే ఈ జలపాతాల సొగసును చూసి తీరాల్సిందే. ఈశాన్య సంస్కృతికి ఆలవాలమైన షిల్లాంగ్‌లో తప్పనిసరిగా చూడాల్సినవి మ్యూజియమ్స్. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కాంప్లెక్స్‌లోని కెప్టెన్ విలియమ్సన్ సంగ్మా స్టేట్ మ్యూజియం, డాన్‌బాస్కో ఆదిమ సంస్కృతుల మ్యూజియంలలో ఈశాన్య సంస్కృతికి సంబంధించిన రకరకాల పురాతన వస్తువులను చూడవచ్చు. ఎంటమాలజీ మ్యూజియంలో రంగురంగుల సీతాకోకలు, అరుదైన కీటకాలను తిలకించవచ్చు. లేడీ హైదరీ పార్కు నందనవనాన్నే తలపిస్తుంది. ఈ పార్కులోనే ఉన్న ఫారెస్ట్ మ్యూజియంలో అటవీ సంపదకు సంబంధించిన అరుదైన వస్తువులను తిలకించవచ్చు. ఎగువ షిల్లాంగ్‌లో ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి వార్డ్స్ లేక్, ఉమియమ్ లేక్ వంటి సుందర సరోవరాలు బాతులు, కొంగలు వంటి పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి పురాతన మహాదేవ్ ఖోలా ధామ్ శైవక్షేత్రం, కేథలిక్ కెథడ్రల్, ఆల్ సెయింట్స్ చర్చి వంటివి ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. ఇక క్రిసాలిస్ ఆర్ట్ గ్యాలరీని కళాభిమానులు చూసి తీరాల్సిందే. ఏం చేయాలి? జనసమ్మర్దం తక్కువగా ఉండే షిల్లాంగ్ వీధుల్లో జాలీగా షికారు చేస్తూ, షాపింగ్ చేయవచ్చు. షిల్లాంగ్ పీక్ పెకైక్కి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. ఉరకలేసే జలపాతాల వద్ద ఉత్సాహంగా, ఉల్లాసంగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కొండలు, గుట్టలు ఎక్కవచ్చు. సరస్సుల్లో బోటు షికార్లు చేయవచ్చు. ఈశాన్య సంస్కృతి, ఇక్కడి ఆదిమ తెగలు, అరుదైన జీవజాతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఇక్కడి మ్యూజియమ్స్ను చూసి తీరాల్సిందే. షిల్లాంగ్ శివార్లలోనే దట్టంగా విస్తరించి ఉన్న మాఫ్లాంగ్ అరణ్యంలో వనవిహారం చేయవచ్చు. ఈ అరణ్యాన్ని ‘సేక్రెడ్ ఫారెస్ట్’ (పవిత్రారణ్యం) అంటారు. ఎలా చేరుకోవాలి? షిల్లాంగ్‌కు వెలుపల ఉన్న ఉమ్రాయ్లో విమానాశ్రయం ఉంది. అయితే, కోల్‌కతా నుంచి మాత్రమే ఇక్కడకు విమానాల రాకపోకలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోల్‌కతాలో మరో విమానం ద్వారా ఇక్కడకు రావచ్చు. విమానాశ్రయం నుంచి షిల్లాంగ్ పట్టణానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వచ్చేవారు గువాహటి రైల్వేస్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో షిల్లాంగ్ చేరుకోవాల్సి ఉంటుంది. గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బస్సులు, ట్యాక్సీలు విరివిగా అందుబాటులో ఉంటాయి. ఏం కొనాలి? ఇక్కడి అడవుల్లో విస్తారంగా దొరికే స్థానిక కళాకారులు రూపొందించిన వెదురు అలంకరణ వస్తువులు, బుట్టలు, పూలసజ్జలు, వెదురు కర్టెన్లు వంటివి కొనుక్కోవచ్చు. నాగా, మణిపురి నేతగాళ్లు నేసిన ఊలు దుప్పట్లు, శాలువలు, తేలికపాటి ఊలుతో ప్రత్యేకంగా నేసిన మణిపురి లుంగీలు, షర్టులు కొనుక్కోవచ్చు. బడాబజార్ అని ఇక్కడి స్థానికులు పిలుచుకునే ల్యూడహ్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు, చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. ఈ బజారులోని దుకాణదారులందరూ మహిళలే కావడం విశేషం. పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు ఇక్కడ బజార్లలో చౌకగా దొరుకుతాయి. ఇక్కడ మాత్రమే దొరికే ‘ఖాసీ స్క్రబ్’ను కొని తీరాల్సిందే. పాత్రలు తదితరమైన వాటిని శుభ్రం చేసుకునేందుకు వాడవచ్చు. చాలా పెద్ద సైజులో దొరికే ఈ స్క్రబ్‌ను కావలసిన రీతిలో ముక్కలుగా కత్తిరించుకుని వాడుకోవచ్చు. -
నలుగురితో పోరాడాలి
జై జవాన్ బ్రిటిష్ పాలకులు భారత్‌ను వదిలి వెళ్తూ వెళ్తూ తీసుకున్న నిర్ణయాలు భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశ రక్షణ కోసం భారత్ భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోంది. మన ల్యాండ్ బౌండరీ ఎత్తై మంచుపర్వతాలతో ఉండడం వల్ల మన సైనికులు శత్రువు కంటే ముందు ప్రకృతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉగ్రవాదులతో పోరాడాలి, మూడవ పోరాటం ప్రత్యర్థి దేశానికి చెందిన సైనికులతో (శత్రువుతో) యుద్ధం. ఇక నాలుగో యుద్ధం ప్రకృతి వైపరీత్యాలతో. వరదలు, భూకంపాల సమయంలో పౌరులను కాపాడడంలో ముందుండాలి. అతలాకుత లమైన పరిస్థితులను చక్కదిద్దాలి. ఈ బాధ్యతల నిర్వహణలో తనకేమవుతుందోననే ఆలోచనకు ఏ మాత్రం తావివ్వకూడదు. జీవితం పట్ల, కుటుంబం పట్ల అంతటి డిటాచ్మెంట్ ఉండాలి, దేశం పట్ల అటాచ్మెంట్ ఉండాలి. ఇది సైనికుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఆ తర్వాత స్థానంలో సాహసం, త్యాగం, మనోధైర్యం ఉండాలి. -
అంబేడ్కర్‌ని ఎందుకని అందరూ ప్రేమిస్తారు?
ఇప్పుడు దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవాళ్లు, మైనారిటీలు ఎక్కువగా అంబేడ్కర్‌ను ఆరాధించటం వెనుక ఆయన సిద్ధాంతాల వల్ల తమ రక్షణ ఉంటుందని విశ్వసించడమే కారణం. ఆచార్య కొలకలూరి ఇనాక్ భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో తమ శక్తియుక్తుల్ని, ధన మాన ప్రాణాల్ని, సమయ సామర్థ్యాల్ని, విద్యావిజ్ఞాన వివేకాల్ని పణంగా పెట్టి, తృణప్రాయంగా భావించి, పోరాడిన ఎందరినో మర్చిపోయినా భారతీయులు అంబేడ్కరును మర్చిపోలేదు. ఆ మాటకొస్తే బ్రిటిష్ పాలకులూ అంబేడ్కర్‌ను ప్రేమించారు. అంబేడ్కర్ విద్యావేత్తగా, మేధావిగా, ఆలోచనాపరుడుగా, ప్రపంచ విజ్ఞానఖనిగా, సామాజిక దార్శనికుడుగా, దీనజనోద్ధారకుడిగా చైతన్యమూర్తి అవుతున్న దశలో బ్రిటిష్ పాలకులు అంబేడ్కరును ప్రోత్సహించారు. తాము తలపెట్టిన హరిజనోద్యమ సారథిగా అతన్ని గుర్తించారు. సాహు మహరాజ్ కూడా అంబేడ్కర్‌ను ప్రోత్సహించారు. విద్య పూర్తయి వచ్చిన అంబేడ్కర్‌కు తన సంస్థానంలో ఉన్నత పదవినిచ్చిన ఆ సంస్థానాధీశుడికి, ఒక ఆయుధం అంబేడ్కర్ రూపంలో దొరికింది. ఆ ఆయుధంతో అస్పృశ్యతా నిర్మూలన అవకాశం దొరికిందని అంబేడ్కర్‌ను ప్రేమించాడు సాహు. ఇక నెహ్రూ... అంబేడ్కర్ మేధావి అని, విద్యాసంపన్నుడని, తేజస్సంపన్నుడనే కాక, హరిజనులందరూ ఆనందిస్తారని తన మంత్రివర్గంలో ‘లా’ మంత్రిగా నియమించుకున్నాడు. అది అతడి అవసరం కావటంతో పాటు మిత్రుడన్న ప్రేమకూడా పనిచేసి ఉండాలి. భారతీయుల ప్రేమ అంబేడ్కర్‌కు అందివచ్చిన వరం. పాకిస్తాన్ ఏర్పడేప్పుడు భారతీయులు సంచలించిపోయారు. భారతదేశం మరిన్ని ముక్కలు కాకుండా కాపాడటంలో అంబేడ్కరు దీక్ష అచంచలం. రాష్ట్రాల ప్రతిపత్తి చెడకుండా, దేశ సమగ్రత, సమైక్యత కాపాడేట్లుగా, రాజ్యాంగ రచన చేయటం కత్తిమీది సాము. స్వతంత్ర, స్వయం సత్తాక దేశంగా భారతదేశం ఉండటమేకాదు, రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో ప్రవర్తిల్లేట్లు రాజ్యాంగం రాసి భారతీయుల మన్ననలు పొందాడు అంబేద్కర్. తాను జీవితమంతా పోరాడిన హిందూమతానుయాయులు అంబేడ్కరును ఆరాధించటం విశేషాంశం. హిందూమతంతో అంబేడ్కరు పేచీ పడ్డాడు. వర్ణ వ్యవస్థను తిరస్కరించాడు. అస్పృశ్యుల కోసం ఆరాటపడ్డాడు. సాంఘిక పౌరుడుగా, రాజకీయ యోధుడుగా రాటుదేలాడు. వేదపురాణ ఇతిహాసాలేకాదు, ధర్మశాస్త్రాలన్నీ తిరస్కరించిన తత్త్వవేత్త. తాను హిందువుగా చావనని ప్రతిజ్ఞచేసి బౌద్ధమతంలోకి చేరి దీక్ష తీసుకొన్నాడు. అనుచరులకు దీక్ష ఇప్పించాడు. ఇప్పుడు దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవాళ్లు, మైనారిటీలు ఎక్కువగా అంబేడ్కర్‌ను ఆరాధించటం వెనుక ఆయన సిద్ధాంతాల వల్ల తమ రక్షణ ఉంటుందని విశ్వసించడమే కారణం. తమను అందరితో సమానంగా చూడటం, న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం, సోదరత్వం అందరికీ కాంక్షించటం, అందరికీ ఒక్క ఓటు - ఒక్క విలువ ప్రతిపాదించటం, ప్రభుత్వ సహాయ సహకారాలు పేదలకు అందేట్టు చూడటం, దళితులకు, గిరిజనులకు విద్యా ఉద్యోగాది రంగాలలో ప్రాధాన్యం కలిగించటం, వల్ల వీళ్లకు అంబేడ్కరు విముక్తిదాత, తమ నేత, రక్షణకర్తగా మారాడు. అంబేడ్కరు పేదవాడుగా పుట్టి, పేదవాడుగా పరమపదించాడు. బొంబాయి హిందూకాలనీలో ఉన్న ఇల్లు ఇల్లు కాదు, గ్రంథాలయం. అది అనుచరుల చందాలతో కట్టిన భవనం. అంబేద్కరు సంపాదించినదంతా పుస్తకాలు, కలాలు. అంబేడ్కరు పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి బొంబాయి పంపటానికి చిల్లి గవ్వలేదు. జగజ్జీవన్‌రాం ఆ ఏర్పాట్లు చేశాడు. అంతిమ సంస్కారం స్థానికులు చందాలతో సాగింది. దేశ చరిత్ర స్థితినీ, గతినీ శాసించిన మహోన్నతవ్యక్తి నిర్ధయుడుగా గతించాడు. ఈ పరిస్థితిని ఎవరైనా, ఇప్పుడు ఎవరితోనైనా పోల్చి చూస్తే అంబేడ్కర్ ఎంత త్యాగజీవో, ధన్యజీవో అర్థమవుతుంది. (వ్యాసకర్త ప్రముఖ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఫోన్: 9440243433) -
కాంగ్రెస్‌లో బ్రిటీష్ భావజాలం
దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు విమర్శ యర్రగొండపాలెం : భారత్ నుంచి బ్రిటీష్ పాలకులు వెళ్లి పోయిన తర్వాత 60 ఏళ్లపాటు పాలించిన స్వదేశీయుల్లో బ్రిటీష్ భావజాలం గల వ్యక్తులున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. యర్రగొండపాలెంలో గురువారం భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బ్రిటీష్ రాజుల భావాజాలంతో ఉన్న వ్యక్తులు దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించడం వల్లే అభివృద్ధికి నోచుకోలేదని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను దుయ్యబట్టారు. పవిత్రమైన భావాజాలంతో దేశ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో అడుగుపెట్టారని చెప్పారు. పనికిమాలిన 70 చట్టాలను మోదీ రద్దు చేశారన్నారు. గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రపంచ మీడియా ఆసరాగా చేసుకుని మోదీని ఒక క్రూరుడిగా చిత్రికరించారన్నారు. భారతీయ యువశక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతున్న మోదీ నాయకత్వంలో.. బీజేపీ పేదల పార్టీగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ కోసమే రాష్ట్ర విభజన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బు తప్ప అభివృద్ధి తెలియదని విమర్శించారు. ముందుగా వైపాలెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, ఆయన సోదరుడు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘాల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి సత్యనారాయణలను మంత్రి మాణిక్యాలరావు బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ఆలిండియా ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి జీ రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, పార్టీ నాయకులు బత్తిన నరసింహారావు, భీమని మీనాకుమారి, కందుకూరి వెంకటసత్యనారాయణ, రేగుల రామాంజనేయులు, ఉలిసి ఏసుబాబు, ఆరె రమణయ్య, గోలి నాగేశ్వరరావు, శాసనాల సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
68 ఏళ్లలో..ఇదీ మనం సాధించింది..
ఆదిలాబాద్ రిమ్స్ : ఎందరో వీరుల పోరాటం.. మరెందరో మహాత్ముల త్యాగఫలం.. బ్రిటీష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ 68 స్వాతంత్య్ర భారతావనిలో గ్రామీణ ప్రాంతాలు నేటికీ వెనుకబడే ఉన్నాయి. మరి.. మనం సాధించిందేముంది అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామస్వరాజ్యమేది..! గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలన్నది జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్ష. స్వాతంత్య్రం గడించి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా పారిశుధ్య లోపించింది. ప్రజలు దీనస్థితిలో ఉండిపోయారు. గుక్కెడు నీరు కూడా దొరకని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షకాలంలో పారిశుధ్యలోపం.. సీసీ రోడ్లు లేక ఎక్కడిక్కడ మట్టి రోడ్డుపై గుంత లు ఏర్పడి.. మురికి కాలువల్లేక దోమలకు నిలయంగా మారి వ్యాధులకు దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేని చెక్‌పవర్ సర్పంచ్‌కే ఉంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ చిత్తశుద్ధితో పనిచేయాలి. ఉపాధికి దూరంగా యువత నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఉపాధి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు మన పెద్దలు. అలాంటిది వారికి ఉపాధియే లేనప్పుడు వా రు ఇక దేశానికి ఎలా ఉపయోగపడేది. జిల్లాలో మూతబడిన పరిశ్రమలు తెరిపించడం ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. వృత్తివిద్యా కోర్సుల ద్వారా యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వైద్యం.. అందని ద్రాక్షే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నా.. ఇంకా పేదలకు మాత్రం వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. జిల్లా కేంద్రంలో రూ.125 కోట్లతో రిమ్స్ ఆస్పత్రి నిర్మించినా వై ద్యుల కొరతతో నాణ్యమైన వైద్యం అందడం లేదు. అత్యవసర సమయంలో వైద్య సదుపాయం లేదంటూ ఇతర ప్రాం తాలకు రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తం 3 వేల మంది సిబ్బంది వైద్య సేవలుందిస్తున్నారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, వైద్యుల కొరతతో రోగులకు వైద్యం అంద డం లేదు. విషజ్వరాలు, ఇతర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. ఏటా వందల సంఖ్యలో మరణిస్తున్నారు. అక్షరాస్యతా.. అంతంతే.. నిరక్షరాస్యత మన దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. దీన్ని నిర్మూలించి తీరాలి అని మహాత్ముడు వ్యాఖ్యానించా రు. సరస్వతీ మాతకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా చదువుల్లో వెనుకబడింది. అంతటి ప్రాధాన్యమున్న అక్షరాస్యత మన జిల్లాలో 60 శాతమే. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 50 శా తం కంటే తక్కువనే చెప్పవచ్చు. పురుషుల్లో 71.22 శాతం ఉండగా, మహిళలు 51 శాతం మాత్రమే. పెరుగుతున్న నేరాలు.. జిల్లాలో నేరాలు తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట నేరా లు జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలపై, మహిళలపై, చిన్నారులపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. హ త్యలు.. అత్యాచారాలు.. దాడులు.. ఇలా వివిధ రకాల సం ఘటనలు ఉంటున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 17 వేల నేర కేసులు నమోదయ్యాయి. ‘మాయమైపోతున్నడమ్మా.. మని షన్నవాడు.. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు’ అని ఓ సినీకవి చెప్పినట్లే ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఉంది.