
భారతమాత నుదుట స్వేచ్ఛా తిలకం దిద్దిన ఉద్యమం అది. ప్రతీ భారతీయుడి నరనరాన రగిలిన మహోద్యమమది. క్విట్ ఇండియా... ఈ నినాదం మనదేశంలో స్వాతంత్రోద్యమాన్ని మలుపుతిప్పింది. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అవసరమైన పోరాట స్పూర్తిని నింపింది. బ్రిటీష్ పాలకులను గడగడలాడించింది. డూ ఆర్ డై అనే నినాదం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యానికి పునాదులు వేసింది. నేటితో క్విట్ ఇండియా ఉద్యమానికి 77 ఏళ్లు నిండిన సందర్భంగా సాక్షి .కామ్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ...