జై జవాన్
బ్రిటిష్ పాలకులు భారత్‌ను వదిలి వెళ్తూ వెళ్తూ తీసుకున్న నిర్ణయాలు భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశ రక్షణ కోసం భారత్ భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోంది. మన ల్యాండ్ బౌండరీ ఎత్తై మంచుపర్వతాలతో ఉండడం వల్ల మన సైనికులు శత్రువు కంటే ముందు ప్రకృతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉగ్రవాదులతో పోరాడాలి, మూడవ పోరాటం ప్రత్యర్థి దేశానికి చెందిన సైనికులతో (శత్రువుతో) యుద్ధం.
ఇక నాలుగో యుద్ధం ప్రకృతి వైపరీత్యాలతో. వరదలు, భూకంపాల సమయంలో పౌరులను కాపాడడంలో ముందుండాలి. అతలాకుత లమైన పరిస్థితులను చక్కదిద్దాలి. ఈ బాధ్యతల నిర్వహణలో తనకేమవుతుందోననే ఆలోచనకు ఏ మాత్రం తావివ్వకూడదు. జీవితం పట్ల, కుటుంబం పట్ల అంతటి డిటాచ్‌మెంట్ ఉండాలి, దేశం పట్ల అటాచ్‌మెంట్ ఉండాలి. ఇది సైనికుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఆ తర్వాత స్థానంలో సాహసం, త్యాగం, మనోధైర్యం ఉండాలి.
నలుగురితో పోరాడాలి
Published Sun, Apr 19 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement