సాక్షి, న్యూఢిల్లీ: చైనా మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.లడాఖ్‌లో భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న వివాదం ఇంకా సమపిపోక ముందే చైనా దళాలు మరో దుస్సాహసానికి పూనుకున్నాయి. హద్దు మీరి చొరబాటుకు ప్రయత్నించడంతో వారిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. సిక్కిం సెక్టార్‌లోని నాథూ లా సమీపంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) మూడు రోజుల క్రితం ఈ ఉదంతం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) సైనికులకు భారతీయ జవాన్లు సరియైన రీతిలో బుద్ధి చెప్పారు. ఈ ఘర్షణలో ఇరువైపులా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై భారత సైన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఉత్తర సిక్కింలోని నాకూలాలో చైనా సైనికులు ఇండియాలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన ఘటన గతవారం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో 20 మంది గాయపడినట్టు సమాచారం. గాయనపడిన వారిలో నలుగురు భారత జవాన్లు కూడా ఉన్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తూర్పు లడాఖ్‌లో చైనా దుశ్చర్య కారణంగా జూన్ 2020 లో, గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ ప్రతిష్టంభను తొలగింపునకు సంబంధించి భారత్, చైనా మధ్య ఈ రోజు (జనవరి,25) తొమ్మిదో రౌండ్ సైనిక చర్చలను నిర్వహించనున్నాయి.
Troops of India and China involved in a physical brawl along the Line of Actual Control (LAC) last week near Naku La area in Sikkim. Soldiers from both sides are injured. More details awaited: Sources pic.twitter.com/Sff5eVDP1K
— ANI (@ANI) January 25, 2021
Comments
Please login to add a commentAdd a comment