భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ..  | Several Soldiers Were Injured India China Boundary In North Sikkim | Sakshi
Sakshi News home page

చైనా మరోసారి.. జవాన్ల మధ్య ఘర్షణ

Published Sun, May 10 2020 1:20 PM | Last Updated on Sun, May 10 2020 1:26 PM

Several Soldiers Were Injured India China Boundary In North Sikkim - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా జవాన్ల మధ్య ఆదివారం ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రస్తుతం భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కిం సెక్టార్‌ ‘నకులా’ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణ సమయంలో దాదాపు 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు దిగడంతో.. ఇరువురి మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. అనంతరం చిన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణకు కారణమైందని సమాచారం. అయితే ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. 

ఈ సంఘటనలో నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. కాగా చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. సాధారణంగా.. భారత్-పాక్‌ సరిహద్దుల వద్ద ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే చైనా, భారత్‌ల మధ్య ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో డోక్లామ్ విషయంలో భారత్, చైనా జవాన్ల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల జవాన్ల మధ్య అనేక ఘర్షణలులు చోటుచేసుకున్నాయి. తాజాగా  అదే తరహా ఘటన నకులా సెక్టార్‌లో చోటు చేసుకుంది.

చదవండి:
ఆశలు రేపుతున్న ఫేజ్‌–2 ట్రయల్‌

వైట్‌హౌస్‌కి కరోనా దడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement