China border
-
సేనల ఉపసంహరణ స్వాగతించదగింది
బ్రిస్బేన్: భారత్, చైనాలు సరిహద్దుల్లో అత్యంత సమీపంలో మోహరించిన బలగాల ఉప సంహరణపై కొంత పురోగతి సాధించడం స్వాగతించదగిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. అనంతర చర్యలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెమ్చోక్, డెప్సాంగ్ల నుంచి రెండు దేశాలు ఇటీవల బలగాలను ఉపసంహరణను పూర్తి చేసుకోవడం, అనంతరం భారత్ ఆర్మీ పరిశీలనాత్మక గస్తీ జరుపుతున్న క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి జైశంకర్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వాస్తవా«దీన రేఖ వెంబడి 2020కు ముందు లేని ప్రాంతాల్లో చైనా బలగాలు ముందుకు చొచ్చుకువచ్చాయి. దీంతో మేం కూడా బలగాలను మోహరించాం. కొన్ని ఇతర కారణాలు కూడా ఇందుకు తోడయ్యాయి. దాదాపు నాలుగేళ్లపాటు బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. ఏదైనా అనూహ్య సంఘటన జరిగే అవకాశమున్న పరిస్థితి అది. తాజాగా భారత్, చైనాలు కొంత పురోగతి సాధించాయి. సేనలను వెనక్కి తీసుకున్నాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. ఇది ఇతర సానుకూల చర్యలకు దారి తీసే అవకాశముంది’అని ఆయన అన్నారు. ఉక్రెయిన్, పశి్చమాసియాల్లో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన..ఈ సమస్యల పరిష్కారానికి భారత్ తన వంతు కృషి కొనసాగిస్తోందని వెల్లడించారు. -
దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. -
G20 Summit: సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) త్రిశూల్ పేరిట భారీ సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. త్రిశూల్‌లో భాగంగా రఫేల్ వంటి యుద్ధ విమానాలను, ఎస్–400, ఎంఆర్‌సామ్, స్పైడర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దించనుంది. దీంతోపాటు, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు వేరుగా విన్యాసాలు చేపడతాయి. దేశ ఉత్తర సరిహద్దులతోపాటు ఢిల్లీలో, ఢిల్లీ వెలుపల ఐఏఎఫ్ పలు రక్షణ వ్యవస్థలను మోహరించనుంది. జీ20 సదస్సుకు సమగ్ర గగనతల రక్షణను కల్పించడమే త్రిశూల్ ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తాయి. పారా ట్రూపర్లు, పర్వత ప్రాంత యుద్ధ విద్యలో ఆరితేరిన విభాగాలు సైతం ఇందులో పాల్గొంటాయి. త్వరలో జరిగే జీ20 శిఖరాగ్రానికి 20 మందికి పైగా ప్రపంచ దేశాల నేతలు రానున్న దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. -
భారత సరిహద్దులపై చైనా కొత్త విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: చైనా విదేశాంగ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన క్విన్ గ్యాంగ్ భారత్‌తో సంబంధాలు, సరిహద్దు సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని బీజింగ్ చూస్తోందని తెలిపారు. వాంగ్ యీ స్థానంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే యూఎస్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘ప్రపంచం పట్ల చైనా ధోరణి’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ మ్యాగజైన్లో భారత్-చైనా సరిహద్దు అంశాలను ప్రస్తావించారు క్విన్ గ్యాంగ్. సరిహద్దుల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. అమెరికాపై మండిపడ్డారు క్విన్. తైవాన్ విషయంలో అమెరికా, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులకు జపాన్‌లు కారణమని పేర్కొన్నారు. చైనా అభివృద్ధి అంటే శాంతిని పరిరక్షించేందుకు బలమైన దళాన్ని సిద్ధం చేయటం తప్పా.. వారు చెబుతున్నట్లు భౌగోళిక స్థితిని మార్చే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలకు కారణం చైనా కాదని, తైవాన్ వేర్పాటువాదులు, విదేశీ శక్తులు అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో చైనా రాయబారిగా పని చేశారు 56 ఏళ్ల క్విన్ గ్యాంగ్. విదేశాంగ మంత్రిగా పదోన్నతి కల్పించిన క్రమంలో వాషింగ్టన్ నుంచి చైనాకు పయణమయ్యారు. 13వ జాతీయ ప్రజా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించింది. క్విన్ గ్యాంగ్‌కి అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చైనా నూతన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. వాషింగ్టన్-బీజింగ్ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సమచారా మార్పిడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదీ చదవండి: పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి -
తీరు మారితేనే సామరస్యం
దౌత్యరంగంలో మాటలకూ, చేతలకూ కాస్తయినా పొంతన ఉండాలి. లేనట్టయితే దేశాల మధ్య పరస్పర విశ్వాసం అడుగంటుతుంది. అవి ఇరుగు పొరుగు దేశాలైనప్పుడూ, వాటిమధ్య తీర్చు కోవాల్సిన జటిల సమస్యలున్నప్పుడూ మరింత జాగ్రత్తగా మెలగాలి. మొదటినుంచీ చైనా ఆ విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. అదును చూసి దాడికి దిగటం, ఆ తర్వాత భారత్‌దే తప్ప న్నట్టు మాట్లాడటం, ఏమీ ఎరగనట్టు చర్చలకు రావటం దానికి రివాజుగా మారింది. ఇంతక్రిత మైనా, ఈ రెండేళ్లనుంచైనా ఇదే వరస. సరిహద్దు ఘర్షణలపై ఈ నెల 20న చర్చలు జరుగుతాయన్న అవగాహన చైనాకుంది. అయినా అంతకు రెండు వారాలముందు... అంటే 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో గిల్లికజ్జాలకు దిగింది. దాని తీవ్రత గురించిన స్పష్టమైన సమాచారం విడుదల చేయకపోయినా ‘ఈ ఉదంతంలో ఇరు పక్షాల సైనికుల్లోనూ కొందరు స్వల్పంగా గాయ పడ్డా’రని మన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్ సైనిక కమాండర్ చొరవ తీసుకుని చైనా కమాండర్‌తో చర్చలు జరపటంతో సామరస్యత నెలకొందని ఆ ప్రకటన సారాంశం. చైనాతో మనకున్న 4,057 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ప్రస్తుతానికి సరిహద్దుగా ఉంది. రెండేళ్లుగా పశ్చిమ సెక్టార్ (లద్దాఖ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతం)లో తరచుగా చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇంకా చర్చల ప్రక్రియ సాగుతోంది. మూడురోజులనాటి చర్చలు అందులో భాగమే. ఈ చర్చల ప్రక్రియ పర్యవసానంగా ప్యాంగాంగ్ సో ప్రాంతంలో నిరుడు ఫిబ్రవరిలో, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ లోని 17వ పెట్రోలింగ్ పాయింట్ నుంచి నిరుడు ఆగస్టులోనూ, అదే ప్రాంతంలోని 15వ పెట్రో లింగ్ పాయింట్ నుంచి నవంబర్ మొదట్లోనూ రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గాయి. ఆఖరికి 20 మంది భారత జవాన్లను బలి తీసుకున్న తవాంగ్ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా నెమ్మ దిగా సామరస్యం నెలకొంది. ఇలా పరిస్థితులు ఎంతో కొంత కుదుటపడుతున్నాయనుకుంటున్న దశలో తాజా చర్చలకు ముందే తూర్పు సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నించటం చైనా కపటనీతికి నిదర్శనం. చైనాతో కోర్ కమాండర్ల స్థాయిలో ఇంతవరకూ 16 విడతల చర్చలు జరిగాయి. ప్రతి సంద ర్భంలోనూ మన ప్రభుత్వం చర్చల తేదీని ముందుగానే ప్రకటించటం, ఆ చర్చలు పూర్తయ్యాక అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయటం రివాజు. కానీ ఈసారి మాత్రం 17వ విడత చర్చల విషయంలో ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. చర్చలు పూర్తయిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రకటన వెలువడింది. కారణాలు ఊహించటం కష్టమేమీ కాదు. తవాంగ్‌లో జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ అలజడి రేగటం, ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇలాంటి సమయంలో చర్చలంటే భావోద్వేగాలు మరింత పెరుగుతాయి. అంతమాత్రాన ఏం జరుగుతు న్నదో దేశ ప్రజలకు వెంటవెంటనే తెలియజేయకపోవటం సరికాదని ప్రభుత్వం గుర్తించాలి. ఆ సంగతలా ఉంచి నిరంతర ఘర్షణ వాతావరణం ఏ దేశానికీ మంచిది కాదు. అయితే ఎల్లకాలమూ ఘర్షణ వాతావరణం ఉండటం సరికాదు. స్పష్టమైన సరిహద్దు లేనిచోట భారీగా సైన్యాలను మోహ రించటం, ఎప్పుడో ఒకప్పుడు ఫలానా ప్రాంతం తమదేనంటూ కయ్యానికి దిగటం, ఘర్షణలు చోటుచేసుకోవటం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అది చివరకు యుద్ధంగా పరిణమించినా ఆశ్చర్యంలేదు. కనుక ఎంతటి క్లిష్ట సమస్యకైనా చర్చల ప్రక్రియ మాత్రమే పరిష్కార మార్గం. అదే సమయంలో స్నేహం నటిస్తూనే ద్రోహ చింతనతో మెలగుతున్న చైనా కపటనీతిని బయటపెట్టడం కూడా అవసరం. మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే గత నెలలో ఎల్ఏసీ గురించి చెబుతూ అక్కడ పరిస్థితి స్థిరంగానే ఉన్నా అనూహ్యంగా ఉన్నదని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకపక్క కొవిడ్‌తో చైనా అల్లకల్లోలంగా ఉంది. కఠినమైన ఆంక్షలకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన జనమే ఇప్పుడు బయటకు రావటానికి హడలెత్తుతున్నారు. ఏం చేయాలో చైనా సర్కారుకు పాలు బోవటం లేదు. దాన్నుంచి జనం దృష్టి మళ్లించటానికి కూడా ఎల్ఏసీలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి ఉండొచ్చు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తూనే, వాటితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చైనా 80వ దశ కంలో ముందుకొచ్చింది. అందువల్ల గత కొన్ని దశాబ్దాలుగా మనకన్నా ఎక్కువ లాభపడుతున్నది కూడా చైనాయే. కానీ అంతర్గతంగా అవసరం పడినప్పుడల్లా ఎల్ఏసీ వద్ద మంట పెట్టాలని చూస్తోంది. ఈ పోకడలు ఎంత త్వరగా విరమిస్తే చైనాకు అంత మంచిది. ఘర్షణలు ముదురుతున్న తీరు చూశాక మన దేశం ఎల్ఏసీలోని మూడు సెక్టార్లలోనూ చైనాతో సమానంగా మౌలిక సదుపా యాల మెరుగుకు చర్యలు తీసుకోవటం మొదలెట్టింది. నిర్ధారిత సరిహద్దు లేనిచోట ఇరు దేశాలూ సైన్యాలను మోహరిస్తే, ఏదో ఒక పక్షం కయ్యానికి దిగుతుంటే సహజంగానే పరిస్థితులు ప్రమాద కరంగా పరిణమిస్తాయి. కనుక విజ్ఞతతో మెలగటం అవసరమనీ, అంతర్గత విషయాల్లోనైనా, విదేశీ సంబంధాల్లోనైనా శాంతి సుస్థిరతలు ఏర్పడాలంటే కొన్ని విలువలనూ, నియమ నిబంధనలనూ పాటించటం ముఖ్యమనీ చైనా నాయకత్వం గ్రహించాలి. -
చైనా వ్యూహానికి దూకుడే విరుగుడా?
భారత, చైనా సైనికుల మధ్య తవాంగ్ ప్రాంతంలో జరిగిన ఘటన అనూహ్యమేమీ కాదు. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తుందన్నది నిర్వివాదాంశం. చైనా దృష్టిలో ఆసియాలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. అందుకే తన షరతులతోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా నాయకత్వం భావిస్తోంది. అయితే భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి. చైనా మన మాటలు వినాలంటే, మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలి. యాంగ్సీలోనూ చైనా దళాలు వెంటనే వెనక్కు తగ్గడమూ ఈ విషయాన్నే సూచిస్తోంది! అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమభాగంలో... భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల తొమ్మిదిన తవాంగ్ ప్రాంతంలోని యాంగ్సీ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటన అనూహ్యమేమీ కాదు. ఏదో ఒక రోజు తప్పదన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ వెంబడి చాలాకాలంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూండటం ఇందుకు కారణం. ఈ ఘర్షణకు ముందస్తు సూచన ఏదైనా ఉందీ అంటే... అది భారత – అమెరికా మిలటరీ ప్రదర్శనలకు పొరుగుదేశం చైనా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం! వాస్తవాధీన రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ సెంట్రల్ సెక్టర్లో భారత, అమెరికా మిలటరీ దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే. యాంగ్సీ వద్ద చెలరేగిన ఘర్షణలు తూర్పు లదాఖ్ ఘటనల తరువాత రెండేళ్లకు జరిగాయి. ఈ రకమైన తోపు లాటలు, ఘర్షణలు, పరస్పర దాడులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లోని వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2020 జూన్‌లో గల్వాన్ లోయలో రెండుపక్కల సైనికులకు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో తాజా ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ఈ మధ్యకాలంలో వీధిపోరాటల విషయంలో బాగా ఆరితేరినట్లు కనిపి స్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వీరు ముళ్ల్లతో కూడిన కర్రలతో, టేజర్లతో(కరెంట్ షాక్ కొట్టే ఆయుధం) ప్రత్యర్థులపైకి విరుచుకుపడు తున్నారు. మందు గుండు ఆయుధాలు వినియోగించడం ఇక్కడ సాధ్యం కాదు మరి! గల్వాన్ ఘర్షణ... ఫలితంగా జరిగిన ప్రాణనష్టం... భౌతిక దాడుల విషయంలో పీఎల్ఏ చేసుకున్న మార్పుల తీవ్రత ఎలాంటిదో తెలిపింది. అయితే తవాంగ్ ఘటనకు భారతీయ సైనికులు సర్వసన్న ద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బలగాల మోహరింపును అడ్డుకోవడం, అదనపు సిబ్బందితో తమ స్థానాన్ని పదిలపరచు కోవడం, తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. చలికాలంలో తేమతో కూడిన దుస్తులపై టేజర్లు ప్రయోగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పో వచ్చు. కాబట్టి... భారతీయ సైనికుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు, ఇతర వ్యవస్థలను సమకూర్చడంతోపాటు ఘర్షణలను ఎదుర్కొ నేందుకు ఉపయోగించే పరికరాలనూ అందించాల్సిన అవసర ముంది. పిడిగుద్దులు, ఘర్షణలతో బెదిరించాలని చూస్తున్న శత్రు వును ఎదుర్కునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వ్యూహాత్మక సంకేతం అగ్రరాజ్యాల్లో ఒకటైన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం... తన సరిహద్దుల్లో వీధిపోరాటాల స్థాయికి దిగజారడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ... ఇవన్నీ తమ అసలు ఉద్దేశాలను వ్యక్తం చేసేందుకు వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలుగా పరిగ ణించాలి. చైనా నాయకత్వం మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పడం! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ రెండు నెలల క్రితం బీజింగ్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులోనే ప్రపంచ వేదికపై చైనా వ్యవహారశైలి ఎలా ఉండబోతోందో స్పష్టమైంది. ఇండోనేసియాలో జరిగిన జీ20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వైఖరి కూడా చైనా ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేదే. సుదీర్ఘ శత్రుత్వం కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక సరిహద్దు వివాదాలతో ఎలా వ్యవహరించబోయేదీ అధికారికంగానే వివరించారు. సౌత్ చైనా సముద్రంలో తైవాన్‌తో ఉన్న వివాదాలు... కొన్ని ద్వీపాల విషయంలో జపాన్‌తో ఉన్న చిక్కులు, హిమాలయా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ విషయంలోనూ తమ వైఖరి ఏమిటన్నది అక్కడే నిర్ణయమైంది. తైవాన్, ఇతర సముద్ర సంబంధిత సమస్యలను ఆర్థిక ప్రభా వంతో లేదా బలవంతంగానైనా పరిష్కరించాలని చైనా భావిస్తోంది. అయితే... భారత్ విషయంలోనే చైనా ఆందోళన. ఏకంగా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖతో కూడిన సరిహద్దు.... దాని వెంబడే గుర్తించిన వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సరిహద్దుపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. సద్దుమణిగేందుకు చైనా ఏ రకమైన అవకాశమూ ఇవ్వలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్గి రాజేస్తూ వివాదాన్ని కొనసాగిస్తోంది. ‘సెంట్రల్ టిబెటెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సైల్’, దలైలామా భారత నేలపై ప్రవాసంలో ఉండటం భారత, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన అంశంగా నిలుస్తోంది. అంతేకాకుండా... చైనా దృష్టిలో ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. తద్వారా భారత్ అగ్రరాజ్యం స్థాయిని అందుకోగలదని చైనా భావిస్తోంది. అందుకే తన షరతులతోనే భారత్‌తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడప్పుడే సమసేది కాదు తూర్పు లదాఖ్ ప్రాంతంలో పీఎల్ఏతో 2020 మే నెల నుంచి వివాదం మొదలైంది. పలు దఫాలు చర్చలు నడిచినా సాధించింది ఏమీ లేదు. ఫలితంగా భారత సైనికులు దీర్ఘ కాలంపాటు అననుకూల వాతావరణంలో గస్తీ నిర్వహించాల్సి వస్తోంది. భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి అని చెప్పవచ్చు. ఈ పరిణామంతో చైనా ఖంగుతింది. వెంటనే తాము నిర్మించిన ఆవాసాలను, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించింది. పాంగ్యాంగ్ సో ఉత్తరభాగ తీరం వెంబడి తన దళాలను ఉపసంహరించుకుంది కూడా. చైనా మన మాటలు వినాలంటే... మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలని చెబుతోంది ఈ ఘటన. యాంగ్సీలోనూ చైనా దళాలు వెనువెంటనే వెనక్కు తగ్గడం కూడా ఈ విషయాన్నే సూచిస్తోంది! ఒక్క విషయమైతే స్పష్టం. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయన్నది మనమూ అంగీకరించాల్సి ఉంటుంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు పీఎల్ఏ దూకుడుగా వ్యవ హరిస్తుందన్నదీ నిర్వివాదాంశం. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలనూ, సరిహద్దు వివాదాలనూ వేర్వేరుగా చూడాలని చైనా ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రతిగా భారత్ సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షించవచ్చునని అంటోంది. అయితే ఈ పరిస్థితి వల్ల భారత ఆర్మీ ఏడాది పొడవునా... అననుకూల పరిస్థితుల్లో గస్తీ కాయాల్సిన పరిస్థితి కొనసాగనుంది. చైనా ఒకవైపు తన మిలిటరీ దూకుడును కొనసాగిస్తూనే... భారత్‌తో సరిహద్దు వివాదాలను దీర్ఘకాలం నాన్చే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. ఇందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. దౌత్యం, మిలిటరీ రెండింటిలోనూ అన్నమాట. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుంటే... యాంగ్సీ, గల్వాన్ లాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే నివారించడం ఎంతైనా అవసరం. వ్యాసకర్త మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సైన్యం చేతికి సరికొత్త మిసైల్.. చైనా తోకజాడిస్తే ‘ప్రళయ’మే..!
న్యూఢిల్లీ: సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ గర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాన్ని చైనా అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అత్యాధునికి మిసైల్ చేరనుంది. ‘ప్రళయ్’గా పిలిచే ఈ బాలిస్టిక్ మిసైల్ 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిసైల్‌ను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది భారత రక్షణ దళం. ఈ వారంతాంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో అందుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖలో రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చర్చల కొనసాగుతున్న క్రమంలోనే ఈ క్షిపణిని తీసుకురావలన్న ప్రతిపాదన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఓ సమావేశంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కృషి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రళయ్ ప్రత్యేకతలు.. ► మిసైల్ ప్రళయ్‌ను గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండు రోజుల్లో విజయవంతంగా పరీక్షించారు. ► విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ క్షిపణిని సైన్యంలో చేర్చుకోవాలని బలగాలు భావిస్తున్నాయి. ► ఈ మిసైల్ 150- 500 కిలోమీటర్ల దూరంలోని సూదూర లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ► ప్రళయ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు సహా ఇతర కొత్త సాంకేతికలతో పని చేస్తుంది. ► ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే పాక్షిక-బాలిస్టిక్ మిసైల్. ► శుత్రువుల మిసైల్స్‌ను కూల్చేందుకు సైతం దీనిని ఉపయోగించేలా రూపొందించారు. ► గాల్లో కొంత దూరం వెళ్లాక దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం సైతం ఈ మిసైల్‌కు ఉంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు.. -
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, చైనాతో ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు, దేశ ఆర్థిక స్థితిగతులు, చైనాతో సరిహద్దు సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ండటం తదిరాలను సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ శనివారం పార్టీ నాయకురాలు సోనియాగాంధీ నివాసంలో సమావేశమైంది. విపక్షాలతో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తామని పార్టీ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈసారి సమావేశాలకు దూరం కానున్నారు. నా వ్యాఖ్యల వక్రీకరణ: ఖర్గే అహ్మదాబాద్: ప్రధాని మోదీని రావణుడని తాను ప్రత్యేకంగా అనాల్సిన పని లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గుజరాత్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మోదీ ముఖమే. అలా అనేలా చేసుకుంది వాళ్లే’’ అన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఆప్ ప్రయత్నిస్తోందన్నారు. -
సరిహద్దు ఉద్రిక్తత: 50 వేల అదనపు బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి సుమారు 50వేల అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. బ్లూంబర్గ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చైనా సరిహద్దు వెంబడి మూడు ప్రాంతాలకు దళాలను, స్క్వాడ్రాన్ ఫైటర్ జెట్లను చేరవేసినట్లు తెలిపింది. గతేడాదితో పోల్చుకుంటే.. ఇండియా ఈ ఏడాది 40 శాతం అదనంగా అనగా 20 వేల దళాలలను సరిహద్దులో మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లోయ నుంచి అత్యుత్తన్న శిఖర ప్రాంతాలకు సైనికులను చేరవేయడం కోసం ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లతో పాటు ఎం777 హోయిట్జర్ వంటి అత్యాధునిక ఆయుధాలను తరలించిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఇక భారత సరిహద్దు సమీపంలో చైనా ఇప్పటివరకు ఎన్ని దళాలను మోహరించిందో స్పష్టంగా తెలియదు. కానీ హిమాలయాల వెంబడి వివాదాస్పద ప్రాంతాలలో పెట్రోలింగ్ బాధ్యత వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల టిబెట్ నుంచి జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు అదనపు బలగాలను తరలించినట్లు తెలిసింది. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..
కిమిన్(అరుణాచల్‌ప్రదేశ్): శాంతి కాముక దేశం భారత్‌కు దురాక్రమణను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చైనాతో సరిహద్దుల్లో గురువారం ఆయన సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో) నిర్మించిన 12 వ్యూహాత్మక రహదారులను జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశం ప్రపంచ శాంతికి బోధకుడు వంటిదన్న రక్షణమంత్రి.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి ఎటువంటి అవరోధం వాటిల్లినా పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయన్నారు. ‘మనం ప్రపంచ శాంతిని కోరుకుంటాం. ఎవరైనా దుందుడుకుగా వ్యవహరిస్తే తగు సమాధానమిస్తాం’అని స్పష్టం చేశారు. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా బలగాలను కొనసాగిస్తుండటంపై పరోక్షంగా డ్రాగన్ దేశాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘గత ఏడాది గల్వాన్ లోయలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి, వీరోచితంగా పోరాడారు. దేశం కోసం జరిగిన అప్పటి పోరులో వీరమరణం పొందిన వారికి సెల్యూట్ చేస్తున్నాను’అని ఆయన అన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణకు కొత్త రోడ్ల నిర్మాణం ఉపకరిస్తుందన్నారు. ఈ రహదారుల నిర్మాణంతో సరిహద్దుల్లో బలగాలు వేగంగా కదిలేందుకు వీలవుతుందన్నారు. గురువారం ప్రారంభించిన 12 రహదారుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో 10, లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున రహదారులున్నాయి. చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్ కేసులు -
చైనా సరిహద్దులో ఆర్మీ జవాను మృతి
కొమురం భీం, ఆసిఫాబాద్ : చైనా సరిహద్దులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మరణించారు. వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణం అహ్మద్ రజా కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్ చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో చనిపోయాడు.. ఆరుగురు బృందంతో విధులు నిర్వర్తిస్తుండగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. 17 ఏళ్లుగా షాకీర్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షాకీర్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి -
వ్యూహాత్మక మోహరింపు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. తూర్పువైపు బలగాలు సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్‌లో లద్దాఖ్‌లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి. దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆందోళన అక్కర్లేదు 1962లో అరుణాచల్‌ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు. భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్‌లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు. -
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్‌లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్‌కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
సాయుధులుగానే ఉన్నారు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్‌ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు. ‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందించారని రాహుల్ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్‌నాథ్ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. -
సానుకూలంగా భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో మునుపటి పరిస్థితులను నెలకొల్పాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ కోరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. మున్ముందు కూడా సంప్రదింపులు జరుపుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను సైనిక, దౌత్యపరమైన మార్గాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, భారత్ గానీ, చైనా గానీ ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చైనా భారీగా సైన్యాన్ని తరలించడం, సైనిక నిర్మాణాలను చేపట్టడంతో నెల రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు గంటలు ఆలస్యంగా మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజ ర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా జవాన్ల మధ్య ఆదివారం ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కిం సెక్టార్ ‘నకులా’ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణ సమయంలో దాదాపు 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు దిగడంతో.. ఇరువురి మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. అనంతరం చిన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణకు కారణమైందని సమాచారం. అయితే ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఈ సంఘటనలో నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. కాగా చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. సాధారణంగా.. భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే చైనా, భారత్‌ల మధ్య ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో డోక్లామ్ విషయంలో భారత్, చైనా జవాన్ల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల జవాన్ల మధ్య అనేక ఘర్షణలులు చోటుచేసుకున్నాయి. తాజాగా అదే తరహా ఘటన నకులా సెక్టార్లో చోటు చేసుకుంది. చదవండి: ఆశలు రేపుతున్న ఫేజ్–2 ట్రయల్ వైట్‌హౌస్‌కి కరోనా దడ -
చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు
జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. సాయుధులైన ఉగ్రవాదులకు, ఇద్దరు భారత సైనికుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికులు మరణించారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ బుధవారం చెప్పారు. ఈ ఘటన మంగళ, బుధవారాల మధ్య రాత్రిలో జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో చోటుచేసుకుందని తెలిపారు. ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సైనికులు నాయక్ సావంత్ సందీప్ రఘునాథ్ (29), రైఫిల్‌మ్యాన్ అర్జున్ తపా మగర్ (25)లకు దేశం రుణపడి ఉంటుందన్నారు. వీరిలో సావంత్ మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవ్యక్తి కాగా, అర్జున్ నేపాల్‌లోని గోర్ఖా జిల్లాకు చెందినవారు. కాల్పుల అనంతరం ఉగ్ర కదలికలు ఉన్నట్లు అనుమానించిన చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ‘చైనా సరిహద్దుల్లో సామర్థ్యం బలోపేతం’ చైనాతో సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటే.. క్రమంగా సరిహద్దు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె పేర్కొన్నారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో మిలటరీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. -
ఖబడ్దార్ చైనా
భారత్–చైనా సరిహద్దు ప్రాంతం ‘డోక్లామ్’ నివురుగప్పిన నిప్పులా ఉంది. కొద్ది నెలలుగా అక్కడ చైనా సైనికుల కదలికలు ఎక్కువయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి, గతంలో మాదిరిగా చైనా ఇప్పుడు కూడా స్నేహద్రోహానికి పాల్పడి భారత్‌పై యుద్ధానికి దిగితే.. గట్టి సమాధానమే ఇచ్చేందుకు భారతీయ సైనికులు కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సర్దార్ జోగీందర్ సింగ్’ అనే పంజాబీ బయోపిక్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశంలోని ప్రతి యువకుడూ ‘ఖబడ్దార్ చైనా’ అంటూ, సైనిక దళాల్లో చేరేందుకు స్ఫూర్తినిచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమౌతోంది. నెహ్రూ ప్రేమమయుడు. శాంతి ప్రియుడు. శత్రువు ఖడ్గం తీస్తే, ఆ ఖడ్గంతో కరచాలనం కోసం మృదువైన తన చేయిని చాస్తాడు! అయితే ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్లడం లేదు. ‘పరమ వీర చక్ర సుబేదార్ జోగీందర్ సింగ్’ అనే కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం కథ కాదు. నిజ జీవిత కథ. ఏప్రిల్ 6న ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ అని సినిమాగా విడుదల కాబోతున్న సాహస గాథ. చైనాను నెహ్రూ గుడ్డిగా నమ్మకపోతే 1962 ఇండో చైనా యుద్ధమే లేదు. ఆ యుద్ధమే లేకపోతే సుబేదార్ జోగీందర్ సింగ్ అనే సినిమానే ఉండబోయేదే కాదు. నిబద్ధతలో గెలుపు మనదే! శత్రువును నమ్మొద్దని ఇండో–చైనా యుద్ధం మనకు నేర్పింది. ‘శత్రువును తరిమికొట్టేందుకు.. సైనికుడా.. నువ్వు నీ చివరి ప్రాణపు చుక్క చిందే వరకు పోరాడుతూనే ఉండు’ అని జోగీందర్ సింగ్ స్ఫూర్తినిచ్చాడు! యుద్ధంలో భారత్ ఓడిపోయింది. నిబద్ధతలో భారత సైన్యానిదే గెలుపని నిరూపించాడు జోగీందర్. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు నెల రోజుల యుద్ధమది. మనవైపు 1383 మంది సైనికులు చనిపోయారు. 3,968 మంది సైనికులు చైనాకు బందీలయ్యారు. బందీ అయ్యాక కూడా తిరగబడి, వీరమరణం పొందిన సైనికుడు సుబేదారు జోగీందర్ సింగ్! గాయాల నుంచి కారుతున్న రక్తపు చుక్కల్ని బౌండరీలపై రెడ్మార్కులుగా పెట్టి, ‘దాటితే చస్తావ్’ అని శత్రు మూకల్ని హడలుకొట్టి, అరుణాచల్‌ప్రదేశ్‌ను భరతమాత ఒడి జారనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు జోగీందర్ సింగ్. అరుణాచల్‌ప్రదేశ్‌కు అప్పటికొక పేరు లేదు. ‘నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ’ (ఎన్.ఇ.ఎఫ్.ఎ) అది. దాని కోసమే చైనా యుద్ధానికొచ్చింది. యుద్ధంలో గెలిచి కూడా ఎన్.ఇ.ఎఫ్.ఎ.ని పొందలేకపోయింది. ఆ ఘనకీర్తి జోగీందర్దీ, జోగీందర్ నడిపించిన ‘బమ్ లా’ దళానిది. చైనా నుంచి నెహ్రూ ఏం కోరుకున్నాడో అది దక్కనందుకు యుద్ధం వచ్చింది. చైనా ఏం కోరుకుందో అది దక్కకుండా చేసినందుకు జోగీందర్ హీరో అయ్యాడు. చైనా నుంచి నెహ్రూ స్నేహాన్ని కోరుకున్నాడు. చైనా విప్లవ నేత మావో జెడాంగ్ని తన స్నేహితుడు అనుకున్నాడు. ‘‘మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే మన మధ్య బంధం బలపడుతుంది’’ అన్నాడు నెహ్రూ. ‘‘అలాగైతే అక్సాయ్చిన్ని, అరుణాచల్నీ ఇవ్వు’’ అన్నాడు జెడాంగ్. ‘‘భౌగోళికంగా కాదు, బాంధవ్యాలతో పెనవేసుకుందాం’’ అన్నాడు నెహ్రూ. జెడాంగ్ మౌనంగా ఉండిపోయాడు. భారత్ సరిహద్దుల్లోకి గుట్టు చప్పుడు కాకుండా చైనా చొరబడింది. నెహ్రూకి యుద్ధం చెయ్యక తప్పలేదు. సరిగ్గా ఇక్కడి నుంచే ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ సినిమా మొదలౌతుంది. 1962 సెప్టెంబర్ 9. డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మీనన్ నుంచి వేళకాని వేళలో నెహ్రూకి కాల్! ‘‘వేరే దారి లేదు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. చైనా దళాలు ‘తలా రిడ్జ్’లో సౌత్‌కి వచ్చేశాయి’’ అంటున్నాడు మీనన్. స్నేహాన్ని నమ్మినంత కాలం నమ్మాం. ఇప్పుడు సైన్యాన్ని నమ్ముకోవలసిన కాలం వచ్చేసిందని నెహ్రూకి అర్థమైంది. నెహ్రూ అప్పుడు లండన్‌లో ఉన్నాడు. కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ మీట్లో. సరిగ్గా అర నిమిషం తర్వాత నెహ్రూ నుంచి మీనన్‌కి ‘డన్’ అని సంకేతం. వెంటనే మన సెవన్త్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్.. చైనా సేనలు బలంగా నిలుచుని ఉన్న ‘నమ్కా ఛు’ వైపు కదిలింది. ‘సిక్కు రెజిమెంట్’ ఆ బ్రిగేడ్లోనే ఉంది. జోగీందర్ సింగ్ ఆ రెజిమెంట్‌లోనే ఉన్నాడు. సుబేదార్ అతడు. దళపతి. ‘నమ్కా ఛు’ని చేరుకునే దారిలో ‘బమ్ లా’ పోస్టు దగ్గర మూడు వైపుల్నుంచీ కదిలి వచ్చిన చైనా సేనల్ని సిక్కు రెజిమెంట్ అడ్డుకుంది. వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లు తక్కువగా ఉన్నారు. ఎక్కువ తక్కువల్ని చూసుకోలేదు సుబేదార్ జోగీందర్ సింగ్. తన సేనల్లో స్ఫూర్తిని నింపి అన్ని వైపులకు కదిలించాడు. కానీ శత్రువుల బలగం ఎక్కువగా ఉంది. నిమిష నిమిషానికీ మన బ్రిగేడ్ బలం సన్నగిల్లుతోంది. సిక్కు రెజిమెంట్‌లో ఉన్నదే 20 మంది సైనికులు. వారిలోనూ పది మంది నేలకు ఒరిగారు. మిగిలింది జోగీందర్, మరో తొమ్మిది మంది! వారి దగ్గర కూడా బాయ్నెట్లే మిగిలాయి. వాటితోనే పోరాడుతున్నారు. జోగీందర్ ఒంటినిండా బలమైన గాయాలు. చివరికి ఆ గాయాలు అతడిని చైనా సైనికులకు బందీని చేశాయి! బందీగానే మరణించాడు జోగీందర్ . తండ్రి మరణ వార్త వినగానే జోగీందర్ సింగ్ పెద్ద కూతురు కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. చైనా అతడి చితాభస్మాన్ని సైనిక మర్యాదలతో ఇండియాలోని బెటాలియన్‌కి పంపించింది. భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. వందల మంది శత్రుదేశ సైనికులతో పోరాడిన ఇరవైమంది సైనికుల వీరోచిత పోరాటానికి దృశ్యరూపం .. ‘సుబేదార్ జోగీందర్ సింగ్’. సింగ్‌గా గిప్పీ గ్రేవాల్ నటిస్తున్నారు. టీజర్ చివర్లో.. ‘ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండియా’ అంటాడు గ్రేవాల్. అలా అంటున్నప్పుడు అతడిని చూస్తే.. జోగీందర్ సింగ్ ఆత్మ అతడిలో ప్రవేశించిందా అనిపిస్తుంది. పంజాబీలనే కాదు, మిగతా రాష్ట్రాల యువకులనీ సైన్యంలోకి పట్టి తీసుకుపోయేంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది సుబేదార్ జోగీందర్ సింగ్ లైఫ్ హిస్టరీ. అదిప్పుడు తగిన సమయంలో తెరకెక్కబోతోంది. సుబేదార్ జోగీందర్ సింగ్ పరమవీరచ్ర - 1921–1962 జననం : పంజాబ్ -
భారత్-చైనా సరిహద్దులో భూకంపం
ఈటానగర్ : భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. టిబెట్‌లో కూడా భూమి కంపించింది. భారత్‌లో అలాంగ్కు 185 కి.మీ, పాసిఘాట్కు 200కి.మీ, తేజు నగరాలకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. -
2020 లక్ష్యం
న్యూఢిల్లీ : డోక్లాం వివాదం తరువాత భారత్.. సరిహద్దుల్లో యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణాలను చేపడుతోంది. ప్రధానంగా చైనా సరిహద్దుకు దగ్గరగా మౌలిక వసతుల కల్పన, రహదారులకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్మీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ప్రధానంగా చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న నిటీ, లిపులేహ్, తాంగ్లా, సాంగ్చోలా ప్రాంతాలను కలుపుతూ రహదారి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. నాలుగు ప్రాంతాలను కలుపుతూ నిర్మించే ఈ రహదారిని 2020లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. నార్త్ర్న్ ఆర్మీ కమాండ్ పరిధిలోకి వచ్చే ఈ రహదారులు.. సరిహద్దులో అత్యంత కీలకమవుతాయని ఆర్మీ చెబుతోంది. ఈ రహదారులను బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. ఇదిలాఉండగా.. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా మిలటరీ కేంద్రాలను ఆధునీకరంచేందుకు ప్రణాళికలను ఆర్మీ అధికారులు రూపొదించారు. -
ఇండియా యుద్ధ విమానం ఏమైందో తెలియదు: చైనా
బీజింగ్: కనిపించకుండా పోయిన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం జాడ తమకు తెలియదని చైనా స్పష్టం చేసింది. భారత్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతానికైతే తమ వద్ద దానికి సంబంధించిన సమాచారం మాత్రం లేదని పేర్కొంది. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం చైనా సరిహద్దులో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్ టేకాఫ్ తీసుకుని చైనా సరిహద్దుకు సమీపంలోని దౌలాసాంగ్ సమీపంలో కనిపించకుండా పోయింది. చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయ్యాయి. తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చైనా సరిహద్దుకు 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం భారత యుద్ధ విమానం జాడ తెలియలేదు. అయితే, భారత్ యుద్ధ విమానానికి సంబంధించి తమకు సాధ్యమైన మేరకు సాయం చేస్తామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ చెప్పారు. -
చైనా సరిహద్దులో సుఖోయ్ గల్లంతు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కనిపించకుండా పోయింది. సాధారణంగా చైనా సరిహద్దుకు సమీపంలోని గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్ టేకాఫ్ తీసుకుంది. అయితే, చైనా సరిహద్దకు సమీపంలోని దౌలాసాంగ్ సమీపంలో ఈ విమానం కనిపించకుండా పోయిందని, చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయినట్లు చెప్పారు. తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చైనా సరిహద్దుకు 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే ఏడాది మార్చి నెలలో సుఖోయ్ 30 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని బార్మర్‌లో కుప్ప కూలిన విషయం తెలిసిందే. -
చైనా సరిహద్దులో సుఖోయ్ గల్లంతు
-
అమెరికా నుంచి మనకు భారీగా ఆయుధాలు
అమెరికా నుంచి మన దేశం భారీ ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఎం777 తరహా అతి తేలికైన హోవిట్జర్ గన్స్ కొనుగోలుకు రూ. 5వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. వీటిని ఎక్కువగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది. 1980లలో బయటపడిన బోఫోర్స్ స్కాం తర్వాత ఈ తరహా ఆర్టిలరీ గన్స్ కొనుగోలుకు జరిగిన మొట్టమొదటి ఒప్పందం ఇది. అమెరికా నుంచి ఈ తరహా గన్స్ కొనుగోలుకు సంబంధించి 'లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్' మీద భారతదేశం సంతకం చేసింది. మొత్తం 145 గన్స్ కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. భారత అమెరికా సైనిక సహకార బృందం 15వ సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఎం777 తరహా గన్స్ కొనుగోలుకు తాము ఆసక్తిగా ఉన్నామంటూ భారత ప్రభుత్వం ఇంతకుముందే ఆమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. వీటి బరువు చాలా తక్కువగా ఉండటంతో.. హెలికాప్టర్లతో కూడా తరలించి, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో మోహరించడానికి వీలుగా ఉంటుంది. దానికి అమెరికా కూడా స్పందించడంతో రక్షణ శాఖ దానికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలించింది. ముందుగా 25 గన్స్ భారతదేశానికి వస్తాయి. మిగిలిన వాటిని మహీంద్రా సంస్థ భాగస్వామ్యంతో ఇక్కడే ఏర్పాటుచేసే అసెంబ్లీ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీలో అసెంబుల్ చేస్తారు. ఒప్పందం కుదిరిన ఆరు నెలల్లోగా మొదటి రెండు హోవిట్జర్లను అందిస్తారు. మిగిలినవి నెలకు రెండు చొప్పున వస్తాయి.