న్యూఢిల్లీ : డోక్లాం వివాదం తరువాత భారత్.. సరిహద్దుల్లో యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణాలను చేపడుతోంది. ప్రధానంగా చైనా సరిహద్దుకు దగ్గరగా మౌలిక వసతుల కల్పన, రహదారులకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్మీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ప్రధానంగా చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న నిటీ, లిపులేహ్, తాంగ్లా, సాంగ్చోలా ప్రాంతాలను కలుపుతూ రహదారి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు ఆర్మీ తెలిపింది.
నాలుగు ప్రాంతాలను కలుపుతూ నిర్మించే ఈ రహదారిని 2020లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. నార్త్‌ర్న్ ఆర్మీ కమాండ్ పరిధిలోకి వచ్చే ఈ రహదారులు.. సరిహద్దులో అత్యంత కీలకమవుతాయని ఆర్మీ చెబుతోంది. ఈ రహదారులను బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. ఇదిలాఉండగా.. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా మిలటరీ కేంద్రాలను ఆధునీకరంచేందుకు ప్రణాళికలను ఆర్మీ అధికారులు రూపొదించారు.
Comments
Please login to add a commentAdd a comment