
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్ : నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సోమవారం పాక్ కాల్పులకు తెగబడింది. సుబేదార్ సెక్టార్‌లో కాల్పుల బారినపడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
దాడిలో అమరులైన రైఫిల్‌మెన్ వినోద్ సింగ్, జాకీ శర్మలు జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. వినోద్ సింగ్(24) అక్నూర్ జిల్లాకి చెందిన దనాపూర్ వాసి. జాకీ శర్మ(30) హిరానగర్ జిల్లాకి చెందిన సన్‌హైల్ గ్రామ నివాసి. భారత్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు లేకపోయిన పాక్ ఈ అకృత్యానికి దిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment