‘తైవాన్ ఎప్పటికీ మాదే’
బీజింగ్: మెయిన్‌లాండ్, తైవాన్ ఎప్పటికీ తమలో అంతర్భాగమేనని చైనా స్పష్టం చేసింది. తైవాన్‌కు ప్రత్యేక స్వాతంత్ర్యం ఎప్పటికీ ఇవ్వలేమని తేల్చిపారేసింది. ఎప్పటికీ తైవాన్ చైనా రిపబ్లిక్‌లో భాగమేనని పునరుద్ఘాటించింది. 1992లో కుదిరిన ఏకాభిప్రాయానికే తాము కట్టుబడి ఉంటామని, అది ఒకే చైనా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందని గుర్తు చేసింది.
శాంతియుతంగా వాతావరణంతో తిరిగి తైవాన్‌ను తమలో కలుపుకొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంది. ఈ విషయంలో చాలా నిజాయితీగా పనిచేస్తామని, ప్రత్యేక తైవాన్ వాదులకు తాము మద్దతివ్వబోమని, మరింకేవిధమైన రూపానికి కూడా తాము అనుమతించబోమని తైవాన్ వ్యవహారాల అధికారిక ప్రతినిధి మా జియాగాంగ్ చెప్పారు.