Gold rates1947-2023 భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. చిన్నా పెద్దా తేడా లేకుండా భారతీయులు అందరూ పసిడి ప్రియులే. ఒక విధంగా చెప్పాలంటే పుత్తడి భారతీయ సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లు అయినా, పండగొచ్చినా, పబ్బమొచ్చినా, బంగారం ఒక భాగం కావాల్సిందే. అంతేకాదు భూమి, పొలంతోపాటు, భారతీయులు బంగారాన్ని 'సురక్షితమైన' పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే గోల్డ్ వినియోగంలో చైనా తరువాత ఇండియా నిలుస్తోంది. బంగారం దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బంగారం ధరల ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం!
1964లో బంగారం అతిపెద్ద పతనం
ఇండిపెండెన్స్ తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.
1947లో బంగారం ధర రూ. 88.62 అంటే అప్పట్లో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు 10 కిలోల బంగారం ధర కంటే ఎక్కువ ధర ఉండేది. కేవలం 5 సంవత్సరాల క్రితం అంటే 1942లో బంగారం ధర 10 గ్రాములకు రూ.44 ఉండేది. 1950 - 60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.
1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర 184కి చేరింది. ఇది 1980లో రూ.1,330గా మారి 1990 నాటికి రూ.3,200 దాటింది. 2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది. 2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటి 2000-2010 మధ్య బంగారం రేటు పరుగులు పెట్టింది. రూ 4,400 నుండి 18,500 వరకు పెరిగింది. ఆ తరువాతి దశాబ్దంలో కూడా ధరలు రెండింతలు పెరిగాయి. 2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720. 2023లో రూ. 60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది. 2023లో పసిడి ధర హెచ్చుతగ్గులకు లోనైంది. అయితే 2022తో పోలిస్తే బంగారం ధరలు ఆల్‌టైం హైంకి చేరాయి.తొలి ఆరు నెలల్లో, ధరలు దాదాపు రూ.3,000 పెరిగాయి, దాదాపు 6.5శాతం లాభాన్ని చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం బంగారం ధరలు పెరగడంలో పాత్రను పోషించాయి. బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల ఈక్విటీ మార్కెట్ సంవత్సరం ప్రారంభంలో నష్టపోయినా దలాల్ స్ట్రీట్‌లో గత రెండు నెలలుగా వరుసగా రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి.
బంగారం ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?
పెట్టుబడి పరంగా బంగారం అత్యంత నమ్మదగిన ఎంపిక గోల్డ్. ప్రపంచ మార్కెట్లలో కదలిక కూడా బంగారం విలువను నిర్ణయిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర పెరగడం, తగ్గడం దేశీయంగా ప్రభావం చూపుతుంది. భౌగోళిక, రాజకీయ అంశాలే కాకుండా, ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రభుత్వ విధానం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. డాలరు, బంగారం , ద్రవ్యోల్బణం ఒకదానికొటి భిన్న దశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం తగ్గుతుంది.
దిగుమతి ఎక్కడ నుంచి?
స్విట్జర్లాండ్ నుంచి దాదాపు సగం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. 2021-22లో మొత్తం బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 45.8శాతం. స్విట్జర్లాండ్ బంగారం కోసం అతిపెద్ద రవాణా కేంద్రం. అక్కడి అత్యుత్తమ శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసిన బంగారం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతోంది. బంగారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో నష్టాలను తగ్గించే డైవర్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే చాలా కష్ట సమయాల్లో తక్షణం అక్కరకు వచ్చే ముఖ్యమైన ఎసెట్. స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలలో నష్టాలొచ్చినా బంగరం మాత్రం మెరుస్తూనే ఉంటుంది.
గోల్డ్ రేటు హిస్టరీ
1947 | -రూ. 88.62 |
1964 | -రూ. 63.25 |
1970 | -రూ. 184 |
1975 | -రూ.540 |
1980 | -రూ.1,333 |
1985 | - రూ.2,130 |
1990 | - రూ.3,200 |
1995 | - రూ.4,680 |
2000 | - రూ.4,400 |
2005 | - రూ.7,000 |
2010 | - రూ.18,500 |
2015 | - రూ.26,343 |
2016 | - రూ.28,623 |
2017 | - రూ.29,667 |
2018 | - రూ.31,438 |
2019 | - రూ.35,220 |
2020 | - రూ.48,651 |
2021 | - రూ.48,720 |
2022 | - రూ.52,670 |
2023 | - రూ.61,080 |
Comments
Please login to add a commentAdd a comment