
హైదరాబాద్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు.
సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ 5కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు.
డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు
దీనిలో భాగంగా టీజే టిల్లు సినిమా సాంగ్‌కు సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. బీట్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment