indian independence celebrations
-
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి 77వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తూ విస్తృత ఏర్పాట్లుచేయాలన్నారు. అదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా ఏర్పాట్లుచేయాలని సీఎస్ వారిని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటుచేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ ప్రొటోకాల్ సహా తగిన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కూడా సీఎస్ సూచించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు.. మరోవైపు.. వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏపీఎస్పీ అదనపు డీజీపీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శకటాల ప్రదర్శనకు ఇప్పటివరకూ 13 శాఖలు ముందుకొచ్చాయని, పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ వేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా స్క్రీన్లు ఏర్పాటుచేయడంతోపాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ చానాళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఇక వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో తిప్పనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు.. అనంతరం.. ఎన్టీఅర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కూడా మాట్లాడారు. అంతకుముందు.. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం సంచాలకులు ఎం. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వివిధ శాఖలపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలకపాత్ర
వాషింగ్టన్: వచ్చే పాతికేళ్ల భారత అభివృద్ధి పయనంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా పార్లమెంట్లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు.. ఇరు దేశాల మైత్రీబంధంలో మైలురాయిగా నిలిచిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్‌లో ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయ సంతతి అమెరికన్లకు ప్రధాని మోదీ సందేశం పంపారు. ప్రధాని సందేశంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లో.. ‘ భారత్ అనే పదం వినగానే ఎన్నో అంశాలు స్ఫురిస్తాయి. అధునాతన ప్రజాస్వామ్య దేశం, భిన్నజాతులు, ప్రాచీన నాగరికతల ఇండియాను ప్రపంచం గుర్తుచేసుకుంటుంది. ఇదే రీతిలో భిన్న అంశాల్లో గ్లోబల్ ఇండియన్‌తో భారత్ మమేకమైంది. వచ్చే పాతికేళ్ల అమృతకాలంలో భారత సుస్థిరాభివృద్ధికి అమెరికా ఎంతగానో సాయపడనుందని భావిస్తున్నా. అమెరికాలో మీరంతా భారత్ తరఫున అత్యద్భుతమైన ప్రతినిధులుగా ఉంటారని ఆశిస్తున్నా’ అని మోదీ అన్నారు. యూఎస్ ఇండియా రిలేషన్షిప్ కౌన్సిల్, సేవా ఇంటర్నేషనల్, హిందూ స్వయంసేవా సంఘ్, జీఓపీఐఓ సిలికాన్ వ్యాలీ, యూఎస్ ఇండియా ఫ్రెండ్షిప్ కౌన్సిల్, సనాతన్ సంస్కృతి సర్దార్ పటేల్ ఫండ్ తదితర 75 భారతీయ అమెరికన్ సంఘాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇదీ చదవండి: సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం -
వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్ (ఫొటోలు)
-
‘టిల్లు’ సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు
హైదరాబాద్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ 5కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు. డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు దీనిలో భాగంగా టీజే టిల్లు సినిమా సాంగ్‌కు సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. బీట్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఇంటింట త్రివర్ణం
ఈ ఆగస్టు 14కు భారత స్వాతంత్య్ర ‘అమృతోత్సవాలు’ పూర్తవుతున్నాయి. మన స్వతంత్రం 75 ఏళ్లు పూర్తి చేసుకుని ఆగస్టు 15న 76లోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భాన్ని దేశ ప్రజలు ఘనమైన వేడుకగా జరుపుకోవాలని ఆదివారం జూలై 31న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని కోరారు. సోషల్ మీడియా అకౌంట్లలో మన త్రివర్ణ పతకాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 2 నుంచి (నేటి నుంచి) 15 వ తేదీ వరకు ప్రొఫైల్ పిక్‌ను ఉంచుకోవాలని సూచించారు. ఆగస్టు 2కు ఉన్న ప్రాముఖ్యాన్ని చెబుతూ, జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య ఆగస్టు 2నే జన్మించారని మోదీ గుర్తు చేశారు. దేశం స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తవుతున్న ఈ చరిత్రాత్మక సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడగలగడం నేటి తరం చేసుకున్న అదృష్టం అని అన్నారు. ‘‘బానిసత్వ కాలంలో మనం జన్మించి ఉంటే మహోన్నతమైన ఇలాంటి ఒక రోజును ఆనాడు ఊహించగలిగి ఉండేవాళ్లమా?’’ అని ప్రశ్నిస్తూ.. ‘‘దేశ ప్రజలంతా నిబద్ధతతో, బాధ్యతల్ని గుర్తెరిగి మసులుకుంటూ, స్వాతంత్య్ర సమర యోధుల కలలను నిజయం చేసేందుకు వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని నిర్మించుకోవాలన్నదే ఈ ఆజాదీ కా అమృతోత్సవ్ సందేశం’’ అని చెప్పారు. ఈ శుభ తరుణంలో ప్రతి ఒక్కరూ అమృతోత్సవాలలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని దేశ ప్రధాని కోరారు. -
భారత స్వాతంత్ర్య వేడుకల్లో టాక్
లండన్: లండన్ లోని భారత హై కమీషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన స్వాతంత్ర్య వేడుకల్లో, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్.. టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ అన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత మూడు సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్లో ప్రదర్శించారు. తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, టాక్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, మూడు సంవత్సరాలుగా సాధించిన విజాయాల తో కూడిన ప్రత్యేక ‘తెలంగాణా స్టాల్’ ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు. చేనేత పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయత్వంలో చేనేత వస్త్రాలపై తీసుకొస్తున్న అవగాహనను కూడా టాక్ సంస్థ తన ప్రదర్శన లో పెట్టింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లిమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, ఇతర ప్రతినిధుల బృందం ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించారు. తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలను ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చాలా స్పూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. అలాగే తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను టాక్ సంస్థ ప్రతినిధులని అడిగి తెలుసుకున్నారు. స్టాల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్ ను భారత హై కమిషనర్ వైకే సిన్హా కట్ చేశారు. ప్రవాస తెలంగాణా వాసులు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించారు. తెలంగాణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్న తీరుని అభినందించారు. చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ తనం విదేశీ గడ్డపై ఉట్టిపలే ఉందని అభినందించారు. ఫోటోలు, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది. ‘తెలంగాణా జానపద నృత్యం’ను సాంస్కృతిక వేదిక పై ప్రదర్శించడం విశేషం. దీంతో అతిథులు కేరింతలతో ఎంతో ఉత్సాహంగా లేచి వారితో జత కలిసి నృత్యం చేశారు. తెలంగాణ జానపద నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో హైలైట్ గా నిలిచింది. జానపద నృత్య ప్రదర్శన ఇచ్చిన సత్య చిలుముల, వంశీ చిడిపోతు, నాగరాజు మన్నం, శివకుమార్ గ్రంధి, దేవి ప్రవీణ్ అడబాల( చెర్రీ) , తిరు కణపురం, రుచిత రేణికుంటలను.. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించిన ఆతిథులందరికి మన ‘హైదరాబాద్ బిర్యానీ’ రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల, జాయింట్ సెక్రటరీ లు నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల, ఇవెంట్స్ , కల్చరల్ ఇన్చార్జ్ అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, రీడింగ్ సెక్రటరీ, స్పోర్ట్స్ఇంచార్జ్ మల్లా రెడ్డి, మహిళా విభాగం ఇంచార్జ్ సుమా దేవిపురుమని, మహిళా విభాగం సెక్రటరీ సుప్రజ పులుసు, మహిళా విభాగం సభ్యులు ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, కల్చరల్ సెక్రెటరీలు సత్య చిలుముల, శ్రావ్య వందనపు, కల్చరల్ కోఆర్డినేటర్ శైలజ జెల్ల, స్పాన్సర్ సెక్రటరీ రవి రత్తినేని, ఐటీ ఇంచార్జ్ రవి ప్రదీప్ పులుసు, సంస్థ సభ్యులు రవికిరణ్, వెంకీ సుదిరెడ్డి, నవీన్ భువనగిరి, సుషుమ్న, సుమ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.