marathan
-
వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపుపై సీఎం హర్షం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి గుర్తింపు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మారథాన్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చ, తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ స్టాన్లీ జోన్స్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ కమిటీ మెంబర్ రామ్ కటికనేని సీఎం రేవంత్‌రెడ్డిని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆగస్టు 24న జరగనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన మద్దతు ఇస్తామని, మారథాన్‌లో పాల్గొనే వారందరికీ సీఎం 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.ఇవి చదవండి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు! -
‘టిల్లు’ సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు
హైదరాబాద్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ 5కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు. డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు దీనిలో భాగంగా టీజే టిల్లు సినిమా సాంగ్‌కు సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. బీట్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Olympic Marathon1904: మొత్తం గందరగోళం!
1904 ఒలింపిక్స్ మారథాన్ అత్యంత గందరగోళం నెలకొన్న క్రీడగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ ఏడాది తొలిసారి విశ్వక్రీడలు అమెరికాలో జరిగాయి. సెయింట్‌లూయిస్ నగరం పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ పరుగు మారథాన్ కొండలు, ఎగుడు దిగుడు, రాళ్లు, మట్టి కలగలసి ఉన్న దారిలో సాగింది. ఈ పోటీల్లో మొత్తం 32 మంది పాల్గొన్నారు. వీరంతా ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, గ్రీస్, క్యూబాకు చెందిన వాళ్లు. పోటీలకు ఎంపిక చేసిన మార్గం కఠినంగా ఉండడంతోపాటు భరించరాని వేడి, ఉక్కపోతతో క్రీడాకారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వల్లకాక సగం మంది మధ్యలోనే పందెం విరమించుకోగా ఆఖరికి 14 మంది మాత్రం గమ్యస్థానం చేరుకున్నారు. వీరిలో తొలుత ఫినిష్ లైన్‌ను చేరుకున్న క్రీడాకారుడిగా ఫ్రెడ్ లోర్జ్ను నిర్వాహకులు ప్రకటించారు. అయితే, అతను రేసు మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని, కొద్ది దూరం కారులో ప్రయాణించాడని, ఆ కారు కూడా మధ్యలో ఆగిపోవడంతో తిరిగి పరుగు ప్రారంభించాడని ఓ సహ క్రీడాకారుడు బయటపెట్టాడు. దీనిని లోర్జ్ సైతం అంగీకరించాడు. ప్రాక్టిక్ల్ జోక్ చేసేందుకే తాను అలా ప్రవర్తించానని అతను చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్వాహకులు ఏడాది నిషేధం విధించారు. ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన థామస్ హిక్స్ను విజేతగా ప్రకటించారు. వాస్తవానికి హిక్స్ తుది లైన్‌ను తన సహాయకుల సాయంతో చేరుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే రేసులో బాగా పరిగెత్తేందుకు ఉపకరిస్తుందని అతను మార్గమధ్యలో గుడ్లు, బ్రాందీ, స్ట్రైచిన్ సల్ఫేట్ర్ మిశ్రమ ద్రావణాన్ని తీసుకున్నాడు. ఇది క్రీడల చరిత్రలో నమోదైన డ్రగ్స్ సంఘటనగా గుర్తింపు పొందింది. స్ట్రైచిన్.. ఎలుకలు, పక్షులను చంపేందుకు ఉపయోగించే రసాయన మందు. ఈ విషయం తెలియక హిక్స్ ఆ మిశ్రమాన్ని తాగడంతో అతనికి వాంతులు అయ్యాయి. ఫలితంగా తుదిలైన్కు చేరుకుంటాడనగా నీరసపడి కిందపడ్డాడు. అతని శిక్షకులు హిక్స్ను రెండు భుజాలపై మోస్తూ తుదిలైన్కు చేర్చారు. అతడినే విజేతగా ప్రకటించారు. ఇక నాలుగో స్థానంలో నిలిచిన క్యూబా క్రీడాకారుడు ‘‘కార్బజాది’’ మరో విచిత్ర గాథ. అతను పోటీల్లో పాల్గొనేందుకు విరాళాల రూపంలో తెచ్చుకున్న డబ్బును అమెరికాలో దిగగానే పోగొట్టుకున్నాడు. చచ్చీచెడి పోటీలకు చేరుకున్నప్పటికీ అతని వస్త్రధారణ పోటీలకు అనుగుణంగా లేదు. దాంతో మరో సహచరుడు కార్బజా ప్యాంటును కత్తిరించి షార్ట్ లాగా చేశాడు. అంతటితో కార్బజా కష్టాలు తీరలేదు. అతను పోటీలకు ముందు తిన్న యాపిల్స్ కారణంగా పరుగు మధ్యలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అయినా సరే కాసేపు విశ్రాంతి తీసుకొని, తిరిగి పోటీల్లో పాల్గొని నాలుగో స్థానం పొందడం విశేషం. ఇక తొమ్మిదో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా క్రీడాకారుడు లెన్ టావుది మరో కష్టం. మార్గమధ్యలో కుక్కలు అతని వెంటపడ్డాయి. దీంతో అతను మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం కోల్పోయాడు. చదవండి: బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్ -
ఉత్సాహంగా మారథాన్
మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఆర్డీడీ నిర్వహిస్తున్న అల్ట్రా మారథాన్ ఓడీచెరువు మండలం సుందరయ్య కాలనీ వద్ద గురువారం ప్రారంభమైంది. మారథాన్‌లో స్పెయిన్ దేశస్తులు, ‘అనంత’ క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆర్డీడీ ఆధ్వర్యంలో నాలుగో అల్ట్రా మారథాన్ ఉత్సాహంగా సాగింది. గురువారం ఓడీచెరువు మండలం సుందరయ్య కాలనీ వద్ద ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ ప్రొగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డితో కలిసి మారథాన్‌ను ప్రారంభించారు. ‘ఒక కిలోమీటర్ ఒక జీవితం’ అనే నినాదంతో ప్రారంభమైన మార«థాన్‌కు స్పెయిన్ దేశస్తులు, అనంతకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదట సుందరయ్య కాలనీలో మారథన్ పరుగు శిలాఫలకాన్ని ఆన్నేఫెర్రర్, మాంఛోఫెర్రర్ ప్రారంభించారు. పేదలకు గృహాలను అందించేందుకే పరుగు సుందరయ్య కాలనీలో నివాసముండే పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి నిధుల సేకరణ కోసం మారథాన్ రన్‌ను నిర్వహిస్తున్నట్లు మాంఛోఫెర్రర్ తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి ఆవరణలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధి వరకు రన్ కొనసాగుతుందన్నారు. ఒక కిలో మీటర్ పరుగు ఒక జీవితాన్ని బాగుచేస్తుందనే నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆర్డీటీ స్థాపించి శుక్రవారం నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. రన్ డైరెక్టర్ జువాన్ మ్యాన్యువల్ మాట్లాడుతూ రన్ ఓడీ చెరువు మండలం సుందరయ్యకాలనీ, తాటిమేకల పల్లి, చెవిటివారి పల్లి, బనియాన్‌చెరువు, మేకల చెరువు, వాయకట్ల దేవుల చెరువు, పులిగాండ్లపల్లి, తలుపుల, బట్రేపల్లి, గొందిపల్లి, తపటవారిపల్లి, తిమ్మనాయుని పాలెం, ఇందుకూరు, బూదనాంపల్లి, మర్రిమేకలపల్లి, తాడిమర్రి మీదుగా బత్తలపల్లికి చేరుకుంటుందన్నారు. ప్రతి పది కిలో మీట్లకు ఒక జట్టు రన్ చేస్తుందని, శుక్రవారం మధ్యాహ్నం పరుగు ముగుస్తుందని చెప్పారు. సుమారు 150 మంది స్పెయిన్ దేశస్తులు ఉత్సాహంగా పరిగెత్తారు. ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల భారీగా విద్యార్థులు, ప్రజలు చప్పట్ల ద్వారా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, డైరెక్టర్లు షీబా, సాయికృష్ణ, చంద్రశేఖర్‌నాయుడు, నాగేశ్వర్‌రెడ్డి, కృష్ణవేణి పాల్గొన్నారు. -
కళైమణిని పేదరికం ఓడించింది
కోయంబత్తూర్ : పరుగు అంటే ఆమెకు ప్రాణం. లేడిని మించిన వేగం ఆమెది. పరుగు పందెంలో నాలగు బంగారు పతకాలు గెలిచింది. ప్రభుత్వం మెచ్చి, ఏదైనా ఉపాధి చూపిస్తుంది అనుకుంది. కానీ నిరాశే ఎదురయ్యింది. పరుగు పందెంలో గెలిచిన ఆమెను పేదరికం ఓడించింది. చేసేదేమిలేక కుటుంబపోషణ నిమిత్తం ప్రస్తుతం టీ కొట్టు పెట్టుకుని బతుకు బండిని లాక్కొస్తోంది. ఆమే తమిళనాడుకు చెందిన కళైమణి. కోయంబత్తూరుకు చెందిన కళైమణి (45) రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. పదవ తరగతి వరకు చదువుకున్న కళైమణికి చిన్నతనం నుంచి క్రీడలంటే ఆసక్తి. పాఠశాలలో కబడ్డీ, మిగితా క్రీడల్లో పాల్గొనేది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి 41కి.మీ. మరాథన్‌లో బంగారు పతకాలు సాధించింది. ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడంతో వివాహం చేసుకుని క్రీడలకు దూరమయ్యింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లల బాధ్యత చూసుకోవడం కోసం భర్తకు సహాయంగా ఒక చిన్న టీ కొట్టు నడుపుతుంది. టీ కొట్టు మీద రోజుకు రూ.400 - 500 వరకు సంపాదిస్తుంది. ఇప్పటికి పరుగు మీద ఇష్టాన్ని వదులుకోలేక ప్రతిరోజు 21కి.మీ దూరం పరిగెత్తుతు సాధన కొనసాగిస్తుంది. పూర్తిస్థాయిలో పరుగు మీద దృష్టి పెట్టడానికి, మెరుగైన సదుపాయల కల్పన కోసం రుణం ఇవ్వమని బ్యాంకులను ఆశ్రయించింది. కానీ బ్యాంకులు అప్పు ఇవ్వడానికి నిరాకరించడంతో స్నేహితుల వద్ద నుంచి ఆర్థిక సహాయం తీసుకుని సాధన కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏదైన సహాయం చేస్తే తనలాంటి మరికొంత మందికి శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. -
జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్‌ఫోన్స్
బీజింగ్: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా తన మారథన్ (ఎం) సిరీస్‌లోనే ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ అనే రెండు స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.27,200గా ఉంటుందని అంచనా. ‘ఎం6’ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ప్రైవసీ ప్రొటక్షన్, మాల్వేర్ డిస్ట్రక్షన్ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. ఇక ‘ఎం6 ప్లస్’లో 6 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 6,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా ప్రత్యేకతలు ఉన్నట్లు తెలిపింది.