జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్ఫోన్స్ | Gionee M6 and M6 Plus unveiled: huge phones, huge batteries | Sakshi
Sakshi News home page

జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్ఫోన్స్

Published Wed, Jul 27 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్ఫోన్స్

జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్ఫోన్స్

బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా తన మారథన్ (ఎం) సిరీస్‌లోనే ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.27,200గా ఉంటుందని అంచనా. ‘ఎం6’ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ప్రైవసీ ప్రొటక్షన్, మాల్వేర్ డిస్ట్రక్షన్ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. ఇక ‘ఎం6 ప్లస్’లో 6 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 6,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా ప్రత్యేకతలు ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement