gionee
-
ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్
చైనాలో దిగ్గజ కంపెనీ జియోనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్లతో సంబంధం ఉన్న ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 2018 మరియు అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలలో ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ట్రోజన్ హార్స్ వైరస్ తో దెబ్బతిన్నాయని కోర్టు కనుగొంది. “స్టోరీ లాక్ స్క్రీన్” ప్రత్యేక యాప్ వినియోగదారుల నుండి అయాచిత ప్రకటనలు మరియు ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా లాభాల సాధనంగా ఉపయోగబడిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ఐఫోన్13 కెమెరా ఫీచర్లు వైరల్) “స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ యొక్క అప్డేట్ ద్వారా వినియోగదారుల ఫోన్లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్‌ను అమర్చడానికి షెన్జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు కోర్టు తెలిపింది. నివేదిక తెలిపినట్లుగా, "పుల్ పద్ధతి"ని ఉపయోగించి వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్లలో అప్డేట్ చేసారని కోర్టు పేర్కొంది. దీని కోసం జియోనీ 40 లక్షల డాలర్లు ముడుపులు ఇచ్చుకుంది. 2018లో మొదటిసారిగా వారు ఈ వైరస్‌ను ఫోన్లలో ఇన్స్టాల్ చేయడం ప్రారంభించారు. 2019 అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్ఫోన్లను ప్రభావితం చేయడంతో ద్వారా.. కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది. -
జియోనీ ఎఫ్ 9 ప్లస్ : అద్భుత ఫీచర్లు, బడ్జెట్ధర
సాక్షి, ముంబై: మొబైల్ సంస్థ జియోనీ ఎఫ్ 9 ప్లస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ డిస్ప్లే, బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమెరాలాంటి అద్భుత ఫీచర్లతో ఈ డివైస్‌ను తీసుకొచ్చింది. 6.26-అంగుళాల హెచ్డి + ఫుల్ వ్యూ డిస్ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫీచర్‌తో తీసుకొచ్చింది. ధర: రూ.7690 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు 6.26 ఇంచ్ డిస్ప్లే 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలతో బ్రాండ్లు అభివృద్ధి చెందాలి ,సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న ధోరణులకనుగుణంగా ఉత్పత్తులు ఉండాలి. ముఖ్యంగా కస్టమర్ల స్పష్టమైన అభిరుచిని చేరుకునేందుకు జియోనీ ఎల్లపుడూ ప్రయత్నిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ తెలిపారు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు, జియోనీ ‘జీబడ్డీ’ పేరుతో కొత్త సబ్ బ్రాండ్‌ను కూడా ప్రకటించింది. ఈ బ్రాండ్ కింద వైర్లెస్ హెడ్‌ఫోన్స్, వైర్లెస్ నెక్‌బ్యాండ్ హెడ్సెట్, ఇయర్‌ఫోన్స్ , పవర్ బ్యాంక్‌లను ఆవిష్కరించింది. -
జియోని నుంచి ఒకే రోజు 8 స్మార్ట్ఫోన్లు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే రోజు ఎనిమిది స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌కు సిద్దమైంది జియోని. ఈ స్మార్ట్ఫోన్లన్నింటి హైలెట్ బెజెల్-లెస్ డిస్‌ప్లేలే. ఈ ఫోన్లకు సంబంధించి కంపెనీ తాజాగా రెండు టీజర్లను విడుదల చేసింది. ఆన్లైన్లో పోస్టు చేసిన ఈ టీజర్లలో అన్ని స్మార్ట్ఫోన్ల పేర్లను రివీల్ చేసింది. జియోని ఎం7 ప్లస్, ఎస్11, ఎస్11ఎస్, ఎఫ్205, ఎఫ్6, స్టీల్ 3, ఎం7 లుగా పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లను నవంబర్ 26న జియోని విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లపై వస్తున్న రూమర్ల ప్రకారం ఎం7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్షిప్ మోడల్స్‌లో ఒకటిగా తెలుస్తోంది. టీనా లిస్టింగ్‌లో ఎం7 ప్లస్ చాలా ప్రత్యేకమైన డిజైన్‌ను, మెటల్ ప్లేట్‌తో లెదర్ బ్యాక్‌ను, డ్యూయల్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని వెల్లడవుతోంది. 6జీబీ ర్యామ్, 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో ఇది రూపొందిందట. మరికొన్ని రూమర్ల ప్రకారం జియోని ఎస్11 కూడా వెనుక, ముందు వైపు రెండు కెమెరాలను ఉంటుందని టాక్. వెనుకవైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెనార్. ముందు వైపు 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఇది రూపొందిందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 5.99 అంగుళాల డిస్ప్లేను, 6జీబీ ర్యామ్‌ను, 64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. జియోని ఎఫ్205 స్మార్ట్‌ఫోన్... 5 అంగుళాల డిస్ప్లే, మీడియోటెక్ ఎంటీ6739 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా. జియోని ఎఫ్6కు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ ఎంటీ6739, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్, వెనుక వైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు కెమెరాలు, ఫ్రంట్ వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్లన్నీ నిజమో కాదో తెలుసుకోవడం కోసం నవంబర్ 26న చైనాలో జరుగబోయే ఈవెంట్ కోసం వేచిచూడాల్సిందే. -
జియోని స్మార్ట్‌ఫోన్: భారీ బ్యాటరీ, సెల్ఫీ కెమెరా
సాక్షి, న్యూఢిల్లీ: జియోనీ ఇండియా కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌ను కొనసాగించిన కంపెనీ ఎక్స్ 1 ఎస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. రూ.12,999 ధరలో బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో సెప్టెంబర్ 21నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, అతిపెద్ద బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెప్పింది. ఆధునిక వినియోగదారులకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మెరుగైన సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను అందించే లక్ష్యంతో ఎక్స్ 1ఎస్ ను విడుదల చేశామని బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ అలోక్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఎయిర్టెల్ వినియోగదారులకు వరుసగా 6 రీచార్జ్‌లకు 10 జీబీ డేటా అదనం. ఎక్స్ 1 ఎస్ ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0.1 ఆపరేటింగ్ సిస్టం 1.5 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గొరిల్లా గ్లాస్ ప్రొ టెక్షన్ 3 ఫింగర్ ప్రింట్ సెన్సర్ 13 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 వరకు విస్తరించుకునే అవకాశం 4000 ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
డోంట్ వర్రీ: ఆ స్మార్ట్ఫోన్ల రేట్లు పెరగవు!
న్యూఢిల్లీ : వామ్మో నేటి నుంచి జీఎస్టీ వచ్చేసింది.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలంటే వెనుకా ముందు ఆలోచించాల్సిందేనని భయపడుతున్నారా? అయితే ఇలాంటి భయాలేమీ అక్కర్లేదట. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండు తయారీదారులు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు చెప్పాయి. కొత్త పన్ను విధానంతో పడబోయే వ్యయాన్ని తామే భరించాలని కూడా కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఈ కంపెనీల స్మార్ట్ఫోన్లపై జీఎస్టీ ప్రభావం లేనట్టనేని తెలుస్తోంది. జీఎస్టీ ప్రభావం తమ ధరలపై పడదని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ వోహ్రా చెప్పారు. ''ప్రస్తుతం మార్కెట్లో భిన్నమైన పన్ను విధానం ఉంది. కొన్ని మార్కెట్లో నీవే పన్ను కడితే, కొన్ని మార్కెట్లో పన్నులను నీవే పొందుతావు'' అని చెప్పారు. జీఎస్టీ వల్ల పన్నుభారం పెరుగుతుందని, కానీ వాటిని కంపెనీలే భరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. చైనీస్ కంపెనీలు షియోమి, ఒప్పోలతో పాటు దేశీయ హ్యాండ్సెట్ తయారీదారి లావా కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావంతో రేట్లను పెంచమని చెప్పాయి. సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కూడా ప్రస్తుత మోడల్స్ రేట్లను పెంచకూడదని నిర్ణయించిందని తెలిసింది. అయితే కొత్త మోడల్స్‌పై జీఎస్టీ రేటు 12 శాతాన్ని విధించాలని చూస్తున్నట్టు సమాచారం. అధికారికంగా మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. మైక్రోమ్యాక్స్ మాత్రం దీనిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది. ఇండస్ట్రీ డేటా ప్రకారం మొత్తం 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లపై 5 శాతం వ్యాట్ రేటు, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉన్నాయి. అంటే మొత్తంగా మొబైల్ ఫోన్లపై 6 శాతం పన్ను ఉంది. జీఎస్టీ కింద వీటికి 12 శాతం పన్ను రేటు విధించారు. అంటే ప్రస్తుతమున్న దానికంటే 4-5 శాతం ఎక్కువ. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ రేట్లు ఎక్కువగా ఉన్నందున వారికి జీఎస్టీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. వ్యాట్ రేటు తక్కువగా ఉన్న పంజాబ్, రాజస్తాన్, చండీఘర్ లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండగా.. వ్యాట్ ఎక్కువగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో ధరలు తగ్గనున్నాయి. -
జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎస్10 త్వరలో
న్యూఢిల్లీ: జియోనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. చైనా వెబ్సైట్ టీనా అందించిన సమాచారం 'ఎస్10' ను పేరుతో వచ్చే నెలలో దీన్ని విడుదల చేయనుంది. మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు టీనా రిపోర్ట్ చేసింది. ఎస్ 9 కి సక్సెసర్‌గా దీన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభ్యంకానుందని తెలిపినప్పటికీ ధర వివరాలను మాత్రం వెల్లడి చేయలేదు. గత ఏడాది నవంబర్ జియోని ఎస్ 9 ను విడుదల చేసింది. జియోనీ ఎస్10 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్, 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3700 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఈ వార్తలపై జియోని అధికారికంగా స్పందించలేదు. చైనా, ఇతర ప్రాంతాలో ఈ డివైస్ లభ్యత, స్పెక్స్‌ను ధృవీకరించలేదు. అయితే కానీ టీనామాత్రం లాంచింగ్‌ను నిర్ధారిస్తోంది. -
జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ‘ఏ1’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ1’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇం దులో సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 16 ఎంపీ ఫ్రంట్ కెమె రా, 13 ఎంపీ రియర్ కెమెరా, 4,010 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5.5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 7.0 నుగోట్ ఓఎస్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. ఏ1 స్మార్ట్‌ఫోన్స్‌ను ఈ నెల 31 నుంచి అమెజాన్‌లో ప్రి–బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. జియోనీ 2017–18 ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్ కోసం రూ.750 కోట్లను వెచ్చించాలని భావిస్తోంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మార్కెటింగ్ బడ్జెట్ (రూ.400 కోట్లు)తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కాగా, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జియోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. మార్చి తర్వాత భారత్‌లో విక్రయమయ్యే అన్ని జియోనీ ఫోన్లు మేడిన్ ఇండియావేనని తెలిపింది. -
జియోని బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లి
త్వరలో ప్రచార కార్యక్రమాలు న్యూఢిల్లీ: జియోని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యవహరించనున్నారు. ఈ మేరకు కోహ్లితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని జియోని తెలిపింది. ఇప్పటికే తమ సంస్థకు ప్రముఖ హిందీ సినిమా నటి అలియాభట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని జియోని ఇండియా సీఈఓ, ఎండీ అర్వింద్ ఆర్. వోహ్రా పేర్కొన్నారు. జియోని త్వరలో చేపట్టబోయే ప్రచార కార్యక్రమాల్లో విరాట్ పాల్గొంటారని, తమ బ్రాండ్ కొత్త శిఖరాలకు చేరడానికి ఆలియాతో కలసి ఆయనఇతోధికంగా తోడ్పడుతారని వివరించారు. గత నాలుగేళ్లలో 1.2 కోట్ల మొబైల్స్‌ను విక్రయించామని పేర్కొన్నారు. భారత్‌లో తమకు ప్రస్తుతం వంద బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయని, వీటిని వచ్చే ఏడాది మార్చికల్లా 500కు పెంచనున్నామని తెలిపారు. -
జియోనీ నుంచి మరో కొత్త ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ జియోనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. పీ7 మ్యాక్స్ పేరుతో సరికొత్త ఫోన్ ప్రవేశపెట్టింది. అద్భుత ఆకృతి, ఫీచర్లతో ఈ ఫోన్ తయారు చేసినట్టు జియోనీ ఇండియా ఎండీ, సీఈవో అరవింద్ ఆర్. వొహ్రా తెలిపారు. ఫోన్ వినియోగంలో యూజర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పీ7 మ్యాక్స్ వాడకం వినియోగదారులకు సరికొత్త అనుభవం ఇస్తుందని ఆయన భరోసాయిచ్చారు. ఆటో కాల్ రికార్డ్, యాంటి తెఫ్ట్, ఓటీసీ సపోర్ట్, డబుల్ క్లిక్ వేకప్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. గోల్డ్, గ్రే-బ్లూకలర్ లో లభ్యమయ్యే ఈ ఫోన్లు అక్టోబర్ 17 నుంచి మార్కెట్ లో అందుబాటుకి వచ్చాయి. జియోనీ పీ7 మ్యాక్స్ ఫీచర్లు డబుల్ సిమ్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే 2.2 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్ 3 జీబీ ర్యామ్ 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ బరువు 182 గ్రాములు ధర రూ. 13,999 -
జియోనీ సరికొత్త స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ జియోనీ ఎస్ సిరీస్ లో మరో కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. వినియోగదారులకు వర్చువల్ రియాలిటీ ఫీచర్ అనుభవం అందించేందుకు ఎస్ 6 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇందులో జీయోనీ వీఆర్ యాప్ ముందుగానే లోడ్ చేసి ఉంటుంది. గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ స్టైల్, ఫర్మార్మేషన్స్ మేలు కలయికగా జీయోనీ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ ఆర్. వొహ్రా పేర్కొన్నారు. అర్బన్ సెల్ఫీ జనరేషన్ కోసం ప్రత్యేకంగా దీన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. వీడియో ఎడిటర్, డెస్క్ టాప్ ఎడిటర్, ఇమేజ్ ప్లస్, వీడియో బ్యూటిఫికేషన్, టైమ్స్ లాప్స్, టెక్ట్స్ రికగ్నైజేషన్ వంటి ఫీచర్లు పొందుపరిచారు. అక్టోబర్ 1 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు వర్చువల్ రియాలిటీ హ్యాండ్ సెట్(రూ.2,499) కూడా విడుదల చేసింది. జియోనీ ఎస్ 6 ప్రో ఫీచర్లు 5.50 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే 1.8 గిగా హెడ్జ్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 3130 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ. 23,999 -
28వేల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ జియోనీ హరియాణాలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈమేరకు హరియాణా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతగా రూ.500 కోట్ల పెట్టుబడితో దాదాపు 50 ఎకరాల్లో తయారీ యూనిట్‌ను ఫరీదాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రానున్న మూడేళ్లలో దాదాపు 28వేల మంది ఉపాధి కల్పించనున్నట్టు జియోనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం తమకు అత్యంత ముఖ్యమైన మార్కెట్ గా భావిస్తున్నామని ఇక్కడ విశేషమైన వృద్ధి ఉందని జియోనీ మొబైల్ చైర్మన్ లియు లిరాంగ్ చెప్పారు. 30 మిలియన్ యూనిట్లుప్రస్తుత వార్షిక సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. తాజా నూతన తయారీ కేంద్రం నుంచి నెలకు రూ.6 లక్షల మొబైళ్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాన్నారు. భవిష్యత్‌లో దీన్ని ఎగుమతి కేంద్రంగా కూడా ఉపయోగించనున్నట్లు జియోని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా ఇనీషియేటివ్ లో భాగంగా తమ సొంత తయారీ యూనిట్లపై దృష్టిపెట్టినట్టు జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ వోరా తెలిపారు. కాగా 2013 లో భారత మార్కెట్లో ప్రవేశించిన జియోని 2015 చివరి నాటికి రూ 3,250 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్టు మార్కెట్ వర్గాల విశ్లేషణ. మరోవైపు ఈ సంవత్సరం చివరినాటికి మూడు రెట్లు టర్నోవర్ పై కంపెనీ దృష్టిపెట్టింది. జియోనీకి తమిళనాడు, నోయిడాలో రెండు యూనిట్లు ఉన్నాయి. -
జియోనీ ఫోన్లకు ‘హోమ్ క్రెడిట్’ వడ్డీ లేని రుణం
హైదరాబాద్: బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ అయిన హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్, మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియోనీ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎటువంటి వడ్డీ లేకుండా హోమ్ క్రెడిట్ రుణం సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా 1,000కిపైగా రిటైల్ దుకాణాల్లో ఈ సౌకర్యం ఉంటుందని హోమ్ క్రెడిట్ సీఎంవో థామస్ తెలిపారు. ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. -
జియోనీ ఎం6 లాంచ్ ఆగస్టులో
జియోనీ తన కొత్త స్మార్ట్ ఫోన్లు ఎం 6, ఎం 6 ప్లస్ లను చైనా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎం సిరీస్ మారథాన్ లో లాంగ్ బ్యాటరీ లైఫ్ పై దృష్టి పెట్టిన సంస్థ ఈ స్మార్ట్ ఫోన్లను బీజింగ్ లో విడుదల చేసింది. ఈ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్లను ఆగస్టు 6న విడుదల చేయనుందని భావిస్తున్నారు. ప్ రపంచంలో ఇదే మొదటి హైయ్యస్ట్ సెక్యూర్డ్ ఫోన్ అని చెబుతోంది. అలాగే 64, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్స్ లో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ సుమారు 29.229 64 జీబీ వేరియంట్ సుమారు రూ 27.212 గా లభించనుంది . యూజర్ల వ్యక్తిగత సమాచారమును రక్షించుకునే ఎన్క్రిప్టెడ్ చిప్ ను అమర్చినట్టు కంపెనీ చోబుతోంది. అలాగే ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో ఫింగర్ ప్రింట్, స్కానర్, ప్రైవసీ ప్రొటెక్షన్, మాల్వేర్ డిస్ట్రాక్షన్ అమర్చినట్టు తెలిపింది. గత 14సం.రాలుగా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో ఉన్నామని సంస్థ ప్రెసిడెంట్ విలియం లు చెప్పారు. టెక్నాలజికల్ ఇన్నోవేషన్, వినియోగదారుల ప్రయోజనాలు అనే రెండు విషయాలు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ ను స్మైల్ ఫోన్ గా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. జియోనీ ఎం6 ఫీచర్లు... 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోల్డ్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 × 1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్ 1.8 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ 4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.0 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్‌ఫోన్స్
బీజింగ్: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా తన మారథన్ (ఎం) సిరీస్‌లోనే ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ అనే రెండు స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.27,200గా ఉంటుందని అంచనా. ‘ఎం6’ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ప్రైవసీ ప్రొటక్షన్, మాల్వేర్ డిస్ట్రక్షన్ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. ఇక ‘ఎం6 ప్లస్’లో 6 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 6,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా ప్రత్యేకతలు ఉన్నట్లు తెలిపింది. -
జియోనీ నుంచి ఎఫ్103 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్స్ తయారీలో ఉన్న జియోనీ తాజాగా ఫ్యాషన్ సిరీస్‌లో ఎఫ్103 ప్రో పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.11,999. గతేడాది ప్రవేశపెట్టిన ఎఫ్103కు మరిన్ని ఫీచర్లు జోడించి ప్రో మోడల్‌ను రూపొందించారు. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీతో తయారు చేశారు. ఆటోఫోకస్ లెడ్ ఫ్లాష్‌తో 13 ఎంపీ కెమెరా, ఫ్లాష్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు. 0.1 సెకనులోపే ఫోకస్ చేయవచ్చని, సెల్ఫీలు మరింత అందంగా కనపడేలా ఫిల్టర్లు వాడినట్టు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ ఇతర ఫీచర్లు. 2.5డీ గ్లాస్ రక్షణ ఉంది. వాయిస్ ఓవర్ ఎల్టీఈని సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. -
జియోనీ నుంచి ‘ఎం5 ప్లస్’ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా ‘మారథాన్ ఎం5 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.26,999. ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెక్యురిటీ ఆప్షన్, 64 జీబీ మెమరీ, 1.3 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 6 అంగుళాల హెచ్డీ తెర వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. -
జియోని నుంచి రెండు 4జీ స్మార్ట్ఫోన్లు
బీజింగ్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ జియోని ‘ఇలైఫ్ ఇ8’, ‘మారథాన్ ఎం5’ అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్‌పై నడిచే ‘ఇలైఫ్ ఇ8’ స్మార్ట్‌ఫోన్‌లో 24 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్, డ్యూయెల్ సిమ్, 4జీ, 6 అంగుళాల తెర, 64 జీబీ మెమరి, 3 జీబీ ర్యామ్, 3,520 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.41,000గా ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ లాలిపప్ ఓఎస్, 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 16 జీబీ మెమరి, 2 జీబీ ర్యామ్ వంటి ప్రత్యేకతలు ‘మారథాన్ ఎం5’ స్మార్ట్‌ఫోన్ సొంతం. దీని ధర రూ.23,600 ఉంటుందని అంచనా. -
జియోనీ ఎస్5.5 హల్చల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అతి సన్నని(స్లిమ్) స్మార్ట్‌ఫోన్ జియోనీ ఈలైఫ్ ఎస్5.5 భారత మార్కెట్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అతితక్కువ మందం 5.5 మిల్లీమీటర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇదొక్కటే. దీంతో ఎప్పుడు చేతుల్లోకి వస్తుందా అని కస్టమర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ తొలి లాట్లో 30 వేల పీసులను భారత్‌కు తెప్పించింది. వారం రోజుల్లో ఇవి రిటైల్ షాపుల్లోకి చేరనున్నాయి. బుకింగ్స్ ఇంత కంటే అధికంగా ఉండడంతో అదనంగా 30 వేల పీసులను కంపెనీ తెప్పిస్తోంది. రెండు నెలల్లో 70 వేల పీసులకుపైగా అమ్ముడవుతాయని జియోనీ అంచనా. ఈలైఫ్ ఎస్5.5 ధర రూ.22,999 ఉంది. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ దీని విశిష్టతలు. రాష్ట్రంలో 1,000 పీసులకు పైగా బుకింగ్స్... భారతీయ కస్టమర్లు అనుభూతి కోరుకుంటున్నారని అనడానికి ఎస్5.5కు ఉన్న డిమాండ్‌ను చూస్తే అర్థమవుతోందని జియోనీ ఇండియా హెడ్ అరవింద్ ఆర్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 1,000 పీసులకుపైగా బుకింగ్స్ నమోదైనట్టు సమాచారం.