ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే రోజు ఎనిమిది స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌కు సిద్దమైంది జియోని. ఈ స్మార్ట్‌ఫోన్లన్నింటి హైలెట్ బెజెల్-లెస్ డిస్‌ప్లేలే. ఈ ఫోన్లకు సంబంధించి కంపెనీ తాజాగా రెండు టీజర్లను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన ఈ టీజర్లలో అన్ని స్మార్ట్‌ఫోన్ల పేర్లను రివీల్ చేసింది. జియోని ఎం7 ప్లస్, ఎస్11, ఎస్11ఎస్, ఎఫ్205, ఎఫ్6, స్టీల్ 3, ఎం7 లుగా పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్లను నవంబర్ 26న జియోని విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై వస్తున్న రూమర్ల ప్రకారం ఎం7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో ఒకటిగా తెలుస్తోంది.
టీనా లిస్టింగ్‌లో ఎం7 ప్లస్ చాలా ప్రత్యేకమైన డిజైన్‌ను, మెటల్ ప్లేట్‌తో లెదర్ బ్యాక్‌ను, డ్యూయల్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని వెల్లడవుతోంది. 6జీబీ ర్యామ్, 6.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో ఇది రూపొందిందట. మరికొన్ని రూమర్ల ప్రకారం జియోని ఎస్11 కూడా వెనుక, ముందు వైపు రెండు కెమెరాలను ఉంటుందని టాక్. వెనుకవైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెనార్. ముందు వైపు 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఇది రూపొందిందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 5.99 అంగుళాల డిస్‌ప్లేను, 6జీబీ ర్యామ్‌ను, 64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
జియోని ఎఫ్205 స్మార్ట్‌ఫోన్... 5 అంగుళాల డిస్‌ప్లే, మీడియోటెక్ ఎంటీ6739 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా. జియోని ఎఫ్6కు 5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, మీడియా టెక్ ఎంటీ6739, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్, వెనుక వైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు కెమెరాలు, ఫ్రంట్ వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్లన్నీ నిజమో కాదో తెలుసుకోవడం కోసం నవంబర్ 26న చైనాలో జరుగబోయే ఈవెంట్ కోసం వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment