జియోనీ నుంచి మరో కొత్త ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ జియోనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. పీ7 మ్యాక్స్ పేరుతో సరికొత్త ఫోన్ ప్రవేశపెట్టింది. అద్భుత ఆకృతి, ఫీచర్లతో ఈ ఫోన్ తయారు చేసినట్టు జియోనీ ఇండియా ఎండీ, సీఈవో అరవింద్ ఆర్. వొహ్రా తెలిపారు. ఫోన్ వినియోగంలో యూజర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
పీ7 మ్యాక్స్ వాడకం వినియోగదారులకు సరికొత్త అనుభవం ఇస్తుందని ఆయన భరోసాయిచ్చారు. ఆటో కాల్ రికార్డ్, యాంటి తెఫ్ట్, ఓటీసీ సపోర్ట్, డబుల్ క్లిక్ వేకప్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. గోల్డ్, గ్రే-బ్లూకలర్ లో లభ్యమయ్యే ఈ ఫోన్లు అక్టోబర్ 17 నుంచి మార్కెట్ లో అందుబాటుకి వచ్చాయి.
జియోనీ పీ7 మ్యాక్స్ ఫీచర్లు
డబుల్ సిమ్
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
2.2 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్
3 జీబీ ర్యామ్
128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫోన్ బరువు 182 గ్రాములు
ధర రూ. 13,999