సాక్షి, ముంబై: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో మన నాయకులు నీరు, విద్యుత్, రోడ్లు తదితర అంశాలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంత వరకు ఏదీ పరిష్కారం కాలేదు’ అని అనేక బహిరంగ సభల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్‌సీ) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ధ్వజమెత్తారు. తమ పార్టీకీ ఒకసారి అధికారం ఇచ్చి చూడాలని, రాష్ట్రం రూపురేఖలు మారుస్తానని పలు సందర్భాలలో ప్రస్తావించారు. అభివృద్థికి సంబంధించిన బ్ల్యూ ప్రింట్ త్వరలో విడుల చేస్తామని మంగళవారం ప్రకటించారు.
మాటుంగాలో 9న బ్లూప్రింట్ ఆవిష్కరణ
రాష్ట్ర అభివృద్ధిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) వైఖరిని తెలియజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ‘బ్లూప్రింట్’(సుమారు 10000 పేజీల పుస్తకం)ను ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రవేశపెట్టనున్నారు. మాటుంగాలోని షణ్ముఖానందా హాలులో ఈ నెల 9,10 తేదీల్లో ఎంతో ఆర్భాటంగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.
అందులో ఏముందనే విషయంపై ఇటు పార్టీ కార్యకర్తల్లో అటూ సాధారణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. విద్యా, ఉపాధి, పర్యాటక రంగం, అత్యధునిక కట్టడాలు, అందరికి తాగునీరు. మరుగుదొడ్లు, పరిశ్రమలు, ఇతర మౌలికసదుపాయాలు తదితరా అంశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఆ బ్ల్యూ ప్రింట్‌లో రోడ్ల అభివృద్ధి, టోల్ వసూళ్లపై రాజ్ ఠాక్రే ఎలాంటి వైఖరి అవలంభించారనే దానిపై ఆసక్తి నెలకొంది.
అదే రోజు బ్ల్యూ ప్రింట్ అవిష్కరణతోపాటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టునున్నట్లు తెలిసింది. 2006లో ఎమ్మెన్నెస్ స్థాపించిన తర్వాత జరిగిన మొదటి బహిరంగ సభలో బ్ల్యూ ప్రింట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఏకంగా ఎనిమిదేళ్ల త ర్వాత అదేంటో ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రజలకు అవకాశం లభించింది. 9వ తేదీన బ్ల్యూ ప్రింట్ అవిష్కరణ జరుగుతుంది. 10వ తేదీన బ్లూప్రింట్ వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
Published Wed, Sep 3 2014 10:36 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement