పలమనేరు: ఓ వైపు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఎటుచూసినా వేడుకలు జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతీయ నాయకులను గౌరవిస్తున్నాం. పారిశుధ్యంపై స్వచ్చభారత్ పేరిట ప్రభుత్వం విసృ్తత ప్రచారం చేస్తోంది. ప్రజలు ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది.
అలాంటిది ఓ వ్యక్తి పలమనేరులోని సబ్‌జైలు గోడపై చిత్రీకరించినన మహాత్మగాంధీ బొమ్మపై మూత్రవిసర్జన చేస్తుండగా ఎవరో సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాన్ని బంధించారు. అంతటితో ఆగక దీన్ని ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ దృశ్యాన్ని చూసిన నెటిజన్ల నుంచి వందలాది నిరసన సందేశాలు వ్యక్తం అయ్యాయి. జాతిరత్నాల చిత్రాలు కొన్ని అనువైన ప్రదేశాల్లో మాత్రమే చిత్రీకరించడం సబబు అనే విషయాన్ని అధికారులు గుర్తించడం సముచితం.
మహాత్మా... మన్నించు
Published Sat, Nov 15 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement