Nehrus birth anniversary
-
నాట్య సంబరం
-
నెహ్రూ జయంతి సాక్షిగా ఏకమైన విపక్షాలు
న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేదికపై విపక్షాలు ఏకమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న నెహ్రు 125 జయంతి వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారం ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరపున పాల్గొనే తొమ్మిది మంది సభ్యుల బృందానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. -
మహాత్మా... మన్నించు
పలమనేరు: ఓ వైపు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఎటుచూసినా వేడుకలు జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతీయ నాయకులను గౌరవిస్తున్నాం. పారిశుధ్యంపై స్వచ్చభారత్ పేరిట ప్రభుత్వం విసృ్తత ప్రచారం చేస్తోంది. ప్రజలు ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాంటిది ఓ వ్యక్తి పలమనేరులోని సబ్‌జైలు గోడపై చిత్రీకరించినన మహాత్మగాంధీ బొమ్మపై మూత్రవిసర్జన చేస్తుండగా ఎవరో సెల్ఫోన్లో ఈ దృశ్యాన్ని బంధించారు. అంతటితో ఆగక దీన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ దృశ్యాన్ని చూసిన నెటిజన్ల నుంచి వందలాది నిరసన సందేశాలు వ్యక్తం అయ్యాయి. జాతిరత్నాల చిత్రాలు కొన్ని అనువైన ప్రదేశాల్లో మాత్రమే చిత్రీకరించడం సబబు అనే విషయాన్ని అధికారులు గుర్తించడం సముచితం. -
గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’
న్యూఢిల్లీ: అస్సాం ప్రకృతి సౌందర్యాన్ని, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిఫలించేలా ఆకర్షణీయంగా రూపొందిన ‘డూడుల్’,.. శుక్రవారం భారత్‌లో గూగుల్ సెర్చిఇంజన్ హోమ్ పేజీపై దర్శనమిచ్చింది.నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక డూడుల్‌ను ‘గూగుల్’ తన హోమ్‌పేజీపై పొందుపరిచింది. ‘ప్రాకృతిక, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ అన్న శీర్షికతో పూణె సైనిక స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి, వైదేహి రెడ్డి రూపొందించిన ఈ ‘డూడుల్’ను గూగుల్ సంస్థ ఒక పోటీలో ఎంపిక చేసింది. డూడుల్ ఫర్ గూగుల్ (Doodle4GoogleD4G) అన్న పేరుతో నిర్వహించిన ఈ పోటీలో 50 నగరాలకు చెందిన 2,100స్కూళ్లనుంచి అందిన 10లక్షలకుపైగా ఎంట్రీలను పరిశీలించారు. చివరకు, వైదేహి అస్సాంపై రూపొందించిన ఈ డూడుల్‌ను ఎంపికచేశారు. అస్సాం వన్యజీవులను, వృక్ష సంపదను, ప్రతిఫలించేలా పులి, ఖడ్గమృగం, తేయాకు పొదలు, వెదురు చెట్లు, సంప్రదాయబద్ధమైన టోపీతో నృత్యం చేస్తున్న అస్సాం మహిళ తదితర అంశాలతో వైదేహి రెడ్డి ఈ డూడుల్‌ను చిత్రించింది. పొలిటికల్ కార్టూనిస్ట్ అజిత్ నీనన్, ఏసీకే మీడియా సేవియో సంస్థ ఆర్ట్ డెరైక్టర్ మస్కరెన్హాస్ , గూగుల్ నిపుణుల బృందంతో కూడిన న్యాయనిర్ణేతల బృందం వైదేహి ఎంట్రీని ఎంపిక చేసింది.