గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’ | Children's Day: Pune schoolgirl's Google doodle on Assam | Sakshi
Sakshi News home page

గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’

Published Fri, Nov 14 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’

గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’

న్యూఢిల్లీ: అస్సాం ప్రకృతి సౌందర్యాన్ని, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిఫలించేలా ఆకర్షణీయంగా  రూపొందిన ‘డూడుల్’,.. శుక్రవారం భారత్‌లో గూగుల్ సెర్చిఇంజన్ హోమ్ పేజీపై దర్శనమిచ్చింది.నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక డూడుల్‌ను ‘గూగుల్’ తన హోమ్‌పేజీపై పొందుపరిచింది. ‘ప్రాకృతిక, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ అన్న శీర్షికతో పూణె సైనిక స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి, వైదేహి రెడ్డి రూపొందించిన ఈ ‘డూడుల్’ను గూగుల్ సంస్థ ఒక పోటీలో ఎంపిక చేసింది.

డూడుల్ ఫర్ గూగుల్ (Doodle4GoogleD4G) అన్న పేరుతో నిర్వహించిన ఈ పోటీలో 50 నగరాలకు చెందిన 2,100స్కూళ్లనుంచి అందిన 10లక్షలకుపైగా ఎంట్రీలను పరిశీలించారు. చివరకు, వైదేహి అస్సాంపై రూపొందించిన ఈ డూడుల్‌ను ఎంపికచేశారు. అస్సాం వన్యజీవులను, వృక్ష సంపదను, ప్రతిఫలించేలా పులి, ఖడ్గమృగం, తేయాకు పొదలు, వెదురు చెట్లు, సంప్రదాయబద్ధమైన టోపీతో నృత్యం చేస్తున్న అస్సాం మహిళ తదితర అంశాలతో వైదేహి రెడ్డి  ఈ డూడుల్‌ను చిత్రించింది.
 
పొలిటికల్ కార్టూనిస్ట్ అజిత్ నీనన్, ఏసీకే మీడియా సేవియో సంస్థ ఆర్ట్ డెరైక్టర్ మస్కరెన్‌హాస్ , గూగుల్ నిపుణుల బృందంతో కూడిన న్యాయనిర్ణేతల బృందం వైదేహి ఎంట్రీని ఎంపిక చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement