కొత్త ఏడాదికి గూగుల్ వెల్‌కమ్- నెట్టింట్లో డూడుల్ వైరల్ | Google New Year Animated Doodle | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతున్న గూగుల్ - నెట్టింట్లో వైరల్ అవుతున్న డూడుల్

Published Sun, Dec 31 2023 2:53 PM | Last Updated on Sun, Dec 31 2023 3:07 PM

Google New Year Animated Doodle - Sakshi

కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి.. 2023కి వీడ్కోలు పలకడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమైపోయారు. అంతకంటే ముందు గూగుల్ ఓ కొత్త డూడుల్ ప్రదర్శించింది. దీనికి సంబంధించిన యానిమేషన్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

3... 2... 1... హ్యాపీ న్యూ ఇయర్! అంటూ గూగుల్ పేర్కొంది. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలను, విషాదాలను నెమరు వేసుకుంటూ.. 2024 సంతోషంగా సాగాలని కోరుకుంటూ వెల్‌కమ్ చెప్పడానికి ప్రపంచమే సిద్దమవుతున్న సమయంలో గూగుల్ ఈ విన్నూత ప్రయోగం చేసింది.

నిజానికి 1998 నుంచి 2003 వరకు, గూగుల్ వివిధ సందర్భాలను పురస్కరించుకుని, వ్యక్తులను గౌరవించడం మొదలు ఏకంగా 5000 కంటే ఎక్కువ డూడుల్ రూపొందించినట్లు సమాచారం. ఈ డూడుల్ ఐడియా అనేది సంస్థ కో-ఫౌండర్స్ నుంచి పుట్టుకొచ్చిందే.

ఇదీ చదవండి: చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్‌లెస్ ట్రైన్ వీడియో వైరల్

1998లో గూగుల్ సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ నెవాడాలో బర్నింగ్ మ్యాన్ ఉత్సవానికి హాజరు కావడానికి ఆఫీసుకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గూగుల్ వినియోగదారులకు తెలియజేయడానికి ఓ సులభమైన మార్గాన్ని ఆలోచించడంలో భాగంగానే ఈ డూడుల్ అనేది పుట్టుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement