ఈ రోజు గూగుల్ 11 స్లయిడ్‌లతో ఓ ఇంటారాక్టివ్ డూడుల్‌ని రూపొందించింది. అందులో ఓ మహిళ ఫోటో ఉంది ఎవరు ఆమె?. ఎందుకు గూగుల్ సోమవారం ఆ మహిళతో ఉన్న డూడిల్ రూపొందించిన నివాళులర్పించింది. తొలిసారిగా గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కనుగొన్న తొలి వ్యక్తే ఆమె. ఆమె పేరు యూనిస్ న్యూటన్ ఫుట్, అమెరికన్ శాస్త్రవేత్త. స్త్రీలు అంతగా చదువుకోని ఆరోజుల్లో ఆమె చదువుకోవడమేగాక ఇలాంటి పరిశోధనల వైపుకి వెళ్లే అవకాశమేలేని స్థితిలో అటువైపుకే అడుగులు వేయడం విశేషం. ఇక ఫుట్ 1856లో ఓ ప్రయోగాన్ని నిర్వహించింది.
గాజు సిలండర్లలో పాదరసంతో కూడిన థర్మామీటర్లను ఉంచింది. సిలిండర్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉండటం వల్లే సూర్యరశ్మీ ప్రభావానికి బాగా గురైందని కనుగొంది. దీని ఫలితంగా గాల్లో ఉండే కార్బన్ డయాక్స్‌డ్ స్థాయిల వల్ల వాతావరణం చాలా సులభంగా వేడుక్కుతుందనే విషయాన్ని నిర్థారించింది. ఆ పరిశోధనలే నేటి వాతావరణ మార్పుల అవగాహన సదస్సులకు మూలం అయ్యింది. ఇలా ఫుట్ తన పరిశోధనలను ప్రచురించిన తర్వాత వాతావరణ స్థిర విద్యుత్‌పై రెండొవ అధ్యయనాన్ని రూపొందించింది. మొత్తంగా ఆమె రెండు భౌతిక శాస్త్ర అధ్యయనాలను ప్రచురించిన మొదటి మహిళ. వాటిపై జరిగిన చర్చలే తదుపరి ప్రయోగాలకు దారితీశాయి.
ఆ తర్వాత దాన్నే ఇప్పుడు మనం 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌గా' పిలుస్తున్నాం. ఆమె వేసిన పునాది వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వాతావరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు కారణమైంది. అంతేగాదు గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని, గ్లోబల్ వార్మింగ్ దాని ప్రభావం గురించి అధ్యయనం చేసిన తొలి మహిళగా అమెరికన్ శాస్త్రవేత్త ఫుట్ నిలిచింది. నిజానికి ఫుట్ 1819లో కనెక్టికట్‌లో జన్మించింది. ఆమె ట్రాయ ఫిమేల్ సెమినరీ అనే పాఠశాలలో చదువుకున్నారు.
ఇది విద్యార్థులను సైన్స్ తరగతులకు హాజరయ్యేలా చేయడమే గాక కెమిస్ట్రీ ల్యాబ్‌లోని ప్రయోగాల్లో పాల్గొనేలా ప్రోత్సహించేది. ఇక్కడ నుంచి ఫుట్‌కి సైన్స్‌పై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఫుట్ ఇలా పరిశోధనలు చేస్తూనే మహిళా హక్కుల ప్రచారానికి కూడా సమయం కేటాయించింది. ఫుట్ 19848లో సెనెకా ఫాల్స్‌లో జరిగిన మొదటి మహిళా హక్కుల సమావేశానికి హాజరయ్యి డిక్లరేషన్ ఆఫ్ సెంటిమెంట్స్‌పై సంతకం చేసింది.
ఇది సామాజికంగా చట్టపరమైన హోదాలో మహిళలకు సమానత్వాన్ని కోరే పత్రం. ఐతే గొప్ప శాస్త్రవేత్త అయిన ఫుట్ 1888లో మరణించడంతో ఒక శతాబ్దానికి పైగా ఫుట్ విజయాలను గుర్తింపు లభించలేదు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఆమెకి నివాళులర్పిస్తూ సోమవారం ఈ డూడుల్‌ని రూపొందించింది. అది ఆమె సాధించిన విజయాలను తెలిపేలా గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కూడా వివరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment