hug of love
-
అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ
కొన్ని విషయాలు పిల్లల చూసి నేర్చుకునేలా ఉంటాయి. వాళ్ల పసిమనసు, నిష్కల్మషమైన హృదయం, అమాయకత్వంతో చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి. మనకే అనిపిస్తుంది వాళ్లలా మనమెందుకు అంత స్వచ్ఛంగా లేం అని. బహుశా అందువల్లనే ఏమో చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు. పైగా వారి అల్లరిని చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్లు చికాకులు అన్ని ఎగిరిపోతాయి. ఒక్కసారిగా చాలా రిలీఫ్‌గా ఫీలవుతాం కూడా. ఇక్కడొక సన్నివేశం కూడా అచ్చం అలానే చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాక మనసును కదిలించేలా చేస్తోంది. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!) అసలు విషయంలోకెళ్లితే...కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి ఉత్సహంగా డ్యాన్స్ చేస్తాడు. పైగా ఆ బాలుడిని కూడా డ్యాన్స్ చేయమంటూ కియాన్ష్ ప్రోత్సహిస్తాడు. అయితే ఆ మహిళ కొడుకు కియాన్ష్ దగ్గరకు వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా కియాన్ష్ డ్యాన్స్ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్ తల్లి అశ్విని నికమ్ దేటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి మిలియన్లకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) View this post on Instagram A post shared by Kiansh Dete & Ayansh Dete (@kiansh_ayansh) -
ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!
న్యూఢిల్లీ/కొచ్చి: మొన్న కిస్ ఆఫ్ లవ్... నిన్న హగ్ ఆఫ్ లవ్... కేరళలోని కొచ్చి విద్యార్థులు నైతిక పోలీసింగ్ (నైతిక నియమావళి పేరుతో ఆంక్షలు)ను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసనలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ వాదులు వీరికి అడ్డు తగులుతుండడంతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీస్తోంది. సంప్రదాయ వాదులు తమ యత్నాలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ‘కిస్ ఆఫ్ లవ్’ మద్దతు దారులు కొందరు శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జందేవాలన్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యాలయం వరకు ప్రదర్శనగా రాగా రెండంచెల బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. వీరికి దీటుగా హిందూసేన కూడా అదే సమయంలో మరో ప్రదర్శన తలపెట్టగా వారి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మరోవైపు కిస్ ఆఫ్ లవ్‌కు మద్దతు ప్రకటిస్తూ కొచ్చిలోని మహారాజా కాలేజీ విద్యార్థులు ‘హగ్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించారు. -
ముద్దు తెచ్చిన ముప్పు.. 10 మంది సస్పెన్షన్
ఒక్క ముద్దు, మరొక్క కౌగిలింత.. చివరకు సస్పెన్షన్‌కు దారితీశాయి. ఏబీవీపీకి చెందినవాళ్లు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ.. దానికి వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంఘీభావంగా 'హగ్ ఆఫ్ లవ్' అనే కార్యక్రమాన్ని కూడా కొంతమంది విద్యార్థినీ విద్యార్థినులు నిర్వహించారు. అయితే.. ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పదిమంది విద్యార్థులను అక్కడి కాలేజి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం విషయంలో పోలీసులు సైతం వంద వరకు కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా కాలేజి నుంచి సస్పెన్షన్ వరకు దారితీసింది. ఈ ముద్దుల వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.