మళ్లీ ‘కిస్ ఆఫ్‌ లవ్’ | Kiss of Love returns: Kerala activists to protest against Shiv Sena moral policing | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘కిస్ ఆఫ్‌ లవ్’

Published Thu, Mar 9 2017 3:52 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

మళ్లీ ‘కిస్ ఆఫ్‌ లవ్’

మళ్లీ ‘కిస్ ఆఫ్‌ లవ్’

కొచ్చి: కేరళలో మరోసారి ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనకు రంగం సిద్ధమైంది. మహిళా దినోత్సవం నాడు కొచ్చిలో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని స్వేచ్ఛావాదులు పిలుపునిచ్చారు. కొచ్చి మెరైన్ డ్రైవ్ మైదానంలో గురువారం సాయంత్రం ‘కిస్ ఆఫ్ లవ్’  కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. యువ జంటలపై శివసేన కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ ఆందోళనకు దిగుతున్నట్టు ప్రకటించారు. మెరైన్ డ్రైవ్ మైదానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోజికోడ్ లోని ఓ హోటల్ లో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు వ్యతిరేకంగా 2014లో ‘కిస్ ఆఫ్‌ లవ్’ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

కాగా, కొచ్చి మోరల్ పోలీసింగ్ ఘటనలో కొచ్చి సెంట్రల్ సబ్-ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎనిమిది మంది పోలీసులను ఆర్మెడ్ రిజర్వుడు పోలీసు క్యాంపుకు బదిలీ చేశారు. మోరల్ పోలీసింగ్ ఘటనను కొచ్చి మేయర్ సౌమిని జైన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement