kochi incident
-
ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు
తిరువనంతపురం: అత్యాచారానికి గురయిన బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల పిండాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా నెలలు నిండకుండానే ప్రసవించేందుకు ప్రయత్నించడంతో పిండం బయటకు వచ్చింది. ఆస్పత్రిలోని బాత్రూమ్లో పిండాన్ని నీళ్లు పోసి వదిలించుకునేందుకు ప్రయాస పడింది. ఈ హృదయ విదారక సంఘటన కేరళలో జరిగింది. 18 ఏళ్లు నిండని బాలిక అత్యాచార బాధితురాలు. గర్భిణి కావడంతో వైద్య పరీక్షల కోసం తల్లితో కలిసి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బుధవారం వెళ్లింది. వైద్యురాలి కోసం వేచి చూస్తున్న సమయంలో ఆ యువతి బాత్రూమ్కు వెళ్లింది. చదవండి: సీక్రెట్ యాప్తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త ఈ సమయంలో నెలలు నిండకుండానే బలవంతంగా ప్రసవించేందుకు ప్రయత్నించింది. తీవ్ర ప్రయత్నం చేయడంతో ఆరు నెలల పిండాన్ని ప్రసవించింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాత్రూమ్లో ఎక్కువగా నీళ్లు పోసి కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. అయితే పిండం ఆ నీటికి మరుగుదొడ్డిలోకి వెళ్లలేదు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి గమనించి ఆస్పత్రి నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలికను 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
మళ్లీ ‘కిస్ ఆఫ్ లవ్’
కొచ్చి: కేరళలో మరోసారి ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనకు రంగం సిద్ధమైంది. మహిళా దినోత్సవం నాడు కొచ్చిలో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని స్వేచ్ఛావాదులు పిలుపునిచ్చారు. కొచ్చి మెరైన్ డ్రైవ్ మైదానంలో గురువారం సాయంత్రం ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. యువ జంటలపై శివసేన కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ ఆందోళనకు దిగుతున్నట్టు ప్రకటించారు. మెరైన్ డ్రైవ్ మైదానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోజికోడ్ లోని ఓ హోటల్ లో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు వ్యతిరేకంగా 2014లో ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, కొచ్చి మోరల్ పోలీసింగ్ ఘటనలో కొచ్చి సెంట్రల్ సబ్-ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎనిమిది మంది పోలీసులను ఆర్మెడ్ రిజర్వుడు పోలీసు క్యాంపుకు బదిలీ చేశారు. మోరల్ పోలీసింగ్ ఘటనను కొచ్చి మేయర్ సౌమిని జైన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
ఆ ఘటన అవమానకరం.. సీఎం సీరియస్
తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం నాడు కొచ్చి బీచ్ లో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనను ఆయన ఖండించారు. ఇది అవమానకర ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కొచ్చి బీచ్ లో బుధవారం పలు యువ జంటలపై శివసేన కార్యకర్తలు దాడులు చేశారు. పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరిమికొట్టారు. ఈ ఘటనపై ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక వార్త ఇక్కడ చదవండి: ‘ఉమెన్స్ డే’ జంటలను పరుగెత్తించి కొట్టారు