ఫ్యాన్స్కు శివగామి థ్యాంక్స్ | ramya krishna thanks audience for baahubali 2 | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్కు శివగామి థ్యాంక్స్

Published Sat, Apr 29 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

ఫ్యాన్స్కు శివగామి థ్యాంక్స్

ఫ్యాన్స్కు శివగామి థ్యాంక్స్

శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సక్సెస్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సినిమాలో రాజమాత శివగామి దేవిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ, తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ' ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్లతో పాటు ఫోన్ చేసి, మేసేజ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఉన్న ఈ పొజిషన్కు మీ ప్రేమ, ఆదరణే కారణం. జై మాహిష్మతి' అంటూ ట్వీట్ చేసింది రమ్యకృష్ణ.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ లను చెరిపేస్తూ ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ లోనూ సత్తా చాటుతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1000 కోట్ల వసూళ్ల సాధించటం కాయంగా కనిపిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement