శివగామి పాత్రలో బాలీవుడ్ మోడల్‌ | Tv Actress Mrunal Thakur to play Sivagami | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 2:26 PM | Last Updated on Tue, Sep 18 2018 2:29 PM

Tv Actress Mrunal Thakur to play Sivagami - Sakshi

బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా బాహుబలికి  ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది.

ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్‌ థాకూర్‌ కనిపించనున్నారట.  సిల్వర్‌ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. శివగామి పాత్రలో మృణాల్‌ కనిపించటం ఖరారయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. కుంకుమ్‌ భాగ్య సీరియల్‌లో బుల్ బుల్‌ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న సూపర్‌ 30లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement