శివగామిపై అతిలోకసుందరి ఆశపడ్డారా? | Sridevi Demanded Rs 6 Crores To Play Ramya Krishna | Sakshi
Sakshi News home page

శివగామిపై అతిలోకసుందరి ఆశపడ్డారా?

Published Sun, Sep 6 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

శివగామిపై అతిలోకసుందరి ఆశపడ్డారా?

శివగామిపై అతిలోకసుందరి ఆశపడ్డారా?

చిత్రపరిశ్రమలో అతిలోకసుందరి అనగానే కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యేది నటి శ్రీదేవినే. ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమ చేతనే బ్రహ్మాండ నటి అనిపించుకున్న శ్రీదేవి కథానాయికగా మంచి హైప్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు కామా పెట్టారు. కాగా సుదీర్ఘ విరామం తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో నటించి విజయం సాధించారు.మళ్లీ చిన్న గ్యాప్ తరువాత తాజాగా తమిళంలో విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న పులి చిత్రంలో రాణిగా వెండితెరపైకి రానున్నారు. కాగా ఇటీవల విడుదలై అద్భుతాలు సృష్టించిన బాహుబలి చిత్రంలో రమ్యక్రిష్ణ పోషించిన శివగామి పాత్రను శ్రీదేవి చేయాల్సింది.
 
 ముందుగా ఆమెనే ఈ పాత్రకు ఎంపిక చెయ్యాలనుకున్నారు.అయితే శ్రీదేవి అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో శివకామి పాత్ర రమ్యక్రిష్ణను వరించింది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర పండడంతో ఇప్పుడు బాహుబలి-2 లో శ్రీదేవి నటించాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయాన ఆ చిత్ర దర్శకుడు రాజమౌళినే వెల్లడించినట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే బాహుబలి-2లో అతిలోకసుందరి నటించే అవకాశం లేదని తెలుస్తోంది.అయితే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందాన ఏమో రాజమౌళి తలచుకుంటే శ్రీదేవిని నటింపజేయనూ వచ్చు అంటోంది ఒక వర్గం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement