దేవా కట్టా, సంజయ్‌దత్
అబ్బా.. బాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయిరా బాబు! మన టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు రావడం తక్కువ అని కొందరు అంటుంటారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందుకు మన ‘బాహుబలి’ చిత్రమే నిదర్శనం. అంతెందుకు ఇప్పుడు చూడండి. తెలుగు సినిమాలు ‘ప్రస్థానం, టెంపర్, అర్జున్‌రెడ్డి’ బీటౌన్లో రీమేక్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’కు టీమ్ కొబ్బరికాయ కొట్టారు.
గురువారం హిందీ ‘ప్రస్థానం’ మొదలైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు జాకీ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. పదేళ్ల క్రితం హిందీ చిత్రం ‘కార్‌తూస్’లో కలిసి నటించిన సంజయ్, మనీషా, జాకీ మళ్లీ ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తుండటం విశేషం. ‘‘ఫస్ట్ డే షూట్‌లో సంజయ్‌దత్ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దేవా కట్టా.
Comments
Please login to add a commentAdd a comment