తెలుగు సినిమా రీమేక్లో సంజయ్దత్ | Sanjay Dutt To Remake Prasthanam | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా రీమేక్లో సంజయ్దత్

Published Sun, Feb 19 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

తెలుగు సినిమా రీమేక్లో సంజయ్దత్

తెలుగు సినిమా రీమేక్లో సంజయ్దత్

బాలీవుడ్ స్టార్  హీరో సంజయ్ దత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ ఇటీవలే భూమి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు.

శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడి దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్థానం రిలీజ్ సమయంలోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన ఉందని ప్రకటించాడు దర్శకుడు. ఇన్నేళ్ల తరువాత ఆ మాట నిలబెట్టుకోబోతున్నాడు. త్వరలోనే సంజయ్ దత్ హీరోగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement