సంజయ్‌ దత్‌ ‘ప్రస్థానం’ మొదలవుతోంది..! | Sanjay Dutt New Movie Prasthanam Shooting Starts On 1st june | Sakshi
Sakshi News home page

Published Thu, May 24 2018 1:08 PM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

Sanjay Dutt New Movie Prasthanam Shooting Starts On 1st june - Sakshi

‘ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు.. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు , విలన్లు లేరీ నాటకంలో’... ఈ డైలాగ్‌ ఒక్కటి చాలు ప్రస్థానం సినిమా ఏంటో చెప్పేయడానికి. దేవకట్టా తెరకెక్కించిన ఈ సినిమాకు సాయి కుమార్‌ తన నటనతో ప్రాణం పోశారు. ఎన్నో అవార్డులను, ఎంతో మంది విమర్శకుల ప్రశంసలను పొందింది ఈ సినిమా. కమర్షియల్‌ సక్సెస్‌ సాధించకపోయినా... టాలీవుడ్‌లో ఈ సినిమాది ప్రత్యేక స్థానమే. ఎందుకంటే ఈ సినిమా రిలీజైన ఇన్నేళ్లకు హిందీలో రీమేక్‌ అవుతోందంటే ఈ సినిమా స్టామినా ఏంటో అర్థమవుతోంది. 

ప్రస్థానం సినిమాను రీమేక్‌ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.. ఇప్పటికి సరైన సమయం వచ్చింది. సంజయదత్‌ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను తన తల్లి నర్గీస్‌ దత్‌ పుట్టిన రోజైన జూన్‌ 1న ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగులో సాయికుమార్‌ పోషించిన పాత్రను సంజయ్‌దత్‌ పోషిస్తున్నట్లుగా తెలిపారు. బాలీవుడ్‌ నేటివిటికి తగ్గట్లు మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రీమేక్‌ కూడా దేవకట్టా దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది. అలీ ఫజల్‌, అమైరా దస్తూర్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement