Prasthanam
-
మట్టి పలకల నుంచి... మైక్రోచిప్పుల దాకా...!
మైక్రోచిప్పులు, హోలోగ్రామ్‌లు, బయోమెట్రిక్ ఫోటోలు, బార్ కోడ్లతో నిండిన నేటి పాస్‌పోర్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అద్భుతాలు. ఇప్పుడు మనం చూస్తున్న పాస్ పోర్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తయారైంది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. కానీ దాని మూలాలు సహస్రాబ్దాల నాటివి. మానవ చరిత్ర ప్రారంభ యుగాల్లో ఎలాంటి సరిహద్దులు లేవు. స్వేచ్ఛా వలసలు ఉండేవి. తర్వాత ఉద్భవించిన నాగరికతలు భూమిని విభజించడమే గాక అన్వేషణ, పరిశోధనల సారాన్ని మార్చేశాయి. ఆ క్రమంలో సురక్షితంగా దేశాలు దాటేందుకు అధికారిక పత్రంగా పాస్‌పోర్టు పుట్టుకొచ్చింది.క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో మెసపొటేమియాలో ప్రయాణ అనుమతులకు మట్టి పలకలు వాడారు. ఒకరకంగా వీటిని అత్యంత పురాతన పాస్‌పోర్టులుగా చెప్పవచ్చు. పురాతన ఈజిప్టులో ప్రయాణికులు, వ్యాపారుల భద్రత కోసం అధికారిక లేఖలను ఉపయోగించారు. భారత ఉపఖండంలో ప్రయాణాలను మౌర్య సామ్రాజ్య కాలం నుంచి డాక్యుమెంట్ చేసినట్టు ఆనవాళ్లున్నాయి. అవి నేటి ప్రయాణ అనుమతుల వంటివి కావు. కేవలం ప్రయాణికుల ప్రవర్తన తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలుగా మన్నన పొందేవి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుని పాలనలో ప్రయాణాలను సులభతరం చేయడానికి, రక్షణ, అధికారిక ఆమోదాన్ని తెలపడానికి శాసనాలు జారీ చేశారు.మొదటి ప్రపంచ యుద్ధంతో..యూరప్ వలసవాదులు ప్రస్తుత పాస్‌పోర్ట్ వ్యవస్థ రూపశిల్పులని చెప్పవచ్చు. అన్వేషణలో భాగంగా వారు ప్రపంచవ్యాప్తంగా కలియదిరిగి భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లారు. 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రయాణాల్లో కొన్ని పద్ధతులు వచ్చి చేరాయి. ఆరోగ్య పరీక్షలు, కొన్ని ప్రశ్నలతో సరిహద్దులు దాటనిచ్చేవారు. అప్పటికి ప్రయాణ పత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత ప్రమాణమంటూ లేదు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పాస్‌పోర్ట్ నియంత్రణ స్వరూపం నాటకీయంగా మారింది. సంఘర్షణ నేపథ్యం నుంచి పుట్టిన నానాజాతి సమితి శాంతి, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ ప్రయాణానికి ప్రామాణిక వ్యవస్థను రూపొందించింది. 1921 నాటికి కఠినమైన వలస నియంత్రణలను విధించడానికి అమెరికా నాటి రాజకీయ అవకాశాలను ఉపయోగించుకుంది. ఎమర్జెన్సీ కోటా చట్టం, 1924 ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచి్చంది. ఇవి వలసల ప్రవాహాన్ని తగ్గించాయి. ఒకప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఉన్న పాస్‌పోర్టు ఆ తరువాత పాశ్చాత్య కేంద్రీకృత శక్తులు ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించే నియంత్రణ సాధనంగా మారింది.మొగలుల కాలంలో.. మధ్యయుగానికి వచ్చే నాటికి ప్రయాణ డాక్యుమెంటేషన్ ప్రగతి సాధించింది. ప్రయాణాల పర్యవేక్షణ, నియంత్రణకు భారత ఉపఖండమంతటా పలు రకాల చట్టబద్ధత, ఆమోదంతో కూడిన పత్రాలు జారీ చేసేవారు. మొగల్ చక్రవర్తులతో పాటు ప్రాంతీయ పాలకులుం కూడా ప్రయాణికులకు, వ్యాపారులకు, యాత్రికులకు, దౌత్యవేత్తలకు ‘సనద్’లు, సురక్షిత ప్రవర్తన లేఖలు జారీ చేశారు. వాణిజ్య, సాంస్కృతిక మారి్పడిని ప్రోత్సహించి వారు సురక్షితంగా ప్రయాణించేలా చూశారు. శతాబ్దాల క్రితంం వెలుగు చూసిన ‘సౌఫ్ కండిక్ట్’ (సేఫ్ కండక్ట్) పాస్‌ను ప్రాథమిక ప్రయాణ పత్రంగా చెప్పవచ్చు. అయితే ఇది ప్రధానంగా పాలకుల మధ్య లిఖితపూర్వక ప్రతిజ్ఞ. యుద్ధ భయం లేకుండా సరిహద్దులు దాటి సురక్షితంగా ప్రయాణించేలా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం వంటిది.1920 నాటి ‘పాస్‌పోర్ట్ తీర్మానం’ అంతర్జాతీయ ప్రయాణాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూనే, అసమానతలకు పునాది వేసిందంటారు. ఎందుకంటే అప్పట్లో అమెరికాలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ ఉండేది కాదు. భర్తల పాస్పోర్టులోనే ఫుట్ నోట్సులో భార్య పేరు పేర్కొనేవారు. దాంతో వారు స్వతంత్రంగా సరిహద్దులను దాటలేకపోయారు. ఇవన్నీ నాటి సమాజ లింగ అసమానత, మహిళలపై వివక్షకు అద్దం పట్టేవే. ఇటీవలి దశాబ్దాల్లో పాస్‌పోర్ట్ ప్రపంచ రాజకీయాలు, మార్కెట్ శక్తుల ఇష్టాలకు లోబడి డిమాండ్ ఉన్న వస్తువుగా మారిపోయింది. 2016లో అమెరికాలోనే ఏకంగా 1.86 కోట్ల పాస్‌పోర్టులు జారీ అయ్యాయంటే వాటి డిమాండ్ ఎంతటిదో అర్థమవుతోంది. ప్రపంచానికి ప్రవేశ ద్వారమైన పాస్‌పోర్ట్ కొందరికి అధికార చిహ్నం. మరికొందరికి మినహాయింపులకు సాధనం. మనం పుట్టిన దేశాన్ని బట్టి, పాస్ పోర్ట్ మనకు అత్యంత సౌలభ్యాన్ని ఇవ్వొచ్చు. లేదా విపరీతమైన బాధను కలిగించవచ్చు. -
ఆ ‘అగ్ని’ రాజేసిన ఆవేశం ఇప్పటికీ చల్లారలేదు
‘‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరీ నాటకంలో’’.. తెలుగు సినీ చరిత్రలో కలకలం గుర్తుండిపోయే డైలాగ్ ఇది. ‘ప్రస్థానం’ ద్వారా ఈ ఆణిముత్యం లాంటి డైలాగ్‌ను అందించిన క్రెడిట్ సగం దర్శకుడు దేవకట్టాది అయితే.. తన నటనతో, కంఠంతో పవర్‌ఫుల్‌గా ఆ డైలాగ్‌ను ప్రజెంట్ చేసి మిగిలిన సగభాగం క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నటుడు సాయి కుమార్. డైలాగ్ కింగ్‌గా, అంతకు మించి విలక్షణ నటుడిగా తెలుగు, కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటూ వస్తున్నాడాయన. ఇవాళ ఆయన 61వ పుట్టినరోజు.. పుడిపెద్ది సాయి కుమార్..1960 జులై 27న జన్మించాడు. తండ్రి డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు పీజే శర్మ సొంతూరు విజయనగరం, తల్లి నటి జ్యోతి బెంగళూరువాసి. చెన్నైలో ఎంఫిల్ విద్య పూర్తి చేసుకున్నాక.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యాడు సాయి కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్ సినిమాలకు పని చేసిన ఆయన.. పెద్దయ్యాక కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కొనసాగాడు. 1977లో ‘స్నేహం’ ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు. స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ.. పవర్ఫుల్ టోన్ కావడంతో బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయనకు గుర్తింపు దక్కింది. మధ్య మధ్యలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ..పూర్తిస్థాయి నటుడి గుర్తింపుదక్కలేదు. అలాంటి టైంలో.. అగ్ని.. ఆ... ఏం జరిగిందో ఏమోగానీ.. డబ్బింగ్ కోసం కొందరు హీరోలు వేరే వాళ్ల వాయిస్ అరువు తెచ్చుకోవడం, మరో వైపు హీరో-ఆర్టిస్ట్‌గా అవకాశాలు పల్చబడడంతో సాయి కుమార్ ఢీలా పడిపోయాడు. సరిగ్గా ఆ టైంలో థ్రిల్లర్ మంజు డైరెక్షన్లో వచ్చిన ‘పోలీస్ స్టోరీ’ సాయి కుమార్ సినీ ‘జీవితాన్ని’ నిలబెట్టింది. కన్నడ నటుడు కుమార్ గోవింద్ చేయాల్సిన ఆ సినిమా అనుకోకుండా సాయి కుమార్ దగ్గరికి వెళ్లడం.. ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 1996లో కన్నడనాట ‘పోలీస్ స్టోరీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆవేశం ఉన్న పోలీసాఫీసర్ అగ్ని పాత్రలో కలకాలం గుర్తుండిపోయే అమోఘమైన నటన అందించాడాయన. ‘సత్యా.. ధర్మా.. అమ్మా..’ అంటూ ఎమోషనల్‌గా చెప్పే డైలాగులు, విలన్లను ఉద్దేశించి ‘ ఏయ్ లబ్బే’ అంటూ ఊగిపోతూ చెప్పే పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఇప్పటికీ జనాల చెవులో మారుమోగుతుంటాయి. ఆ సినిమాతో కన్నడనాట స్టార్ హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు దక్కింది. నటనా ప్రస్థానం కన్నడలో హీరోగా ఫేడవుట్ అయ్యాక.. తిరిగి టాలీవుడ్లో, మధ్య మధ్యలో కన్నడ, తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు సాయి కుమార్. 2002 తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘సామాన్యుడు’ రూపంలో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకుగానూ బెస్ట్ విలన్‌గా టాలీవుడ్లో తొలి నంది అవార్డును అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లోక్‌నాథ్ నాయుడు రోల్ రూపంలో మరిచిపోలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా రెండో నందిని అందించింది. ఆపై ‘అయ్యారే, ఎవడు, పటాస్, సరైనోడు, సుప్రీం, జనతా గ్యారేజ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, మహర్షి.. ఇలా కమర్షియల్ డ్రామాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో కన్నడనాట ‘రంగితరంగ’ ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. వెండితెరపైనే కాదు.. ‘కట్ చేస్తే’ బుల్లితెరపై కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తూ వస్తున్నారాయన. వాయిస్‌తో మ్యాజిక్ సుమన్, రాజశేఖర్ల కెరీర్‌కు సాయి కుమార్ అందించిన గొంతుక ఒక ‘పుష్అప్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషా, పెదరాయుడు ద్వారా రజినీకాంత్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది కూడా ఈయన గొంతే. ఇక బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్‌కు ‘ఖుధా గవా’(1992) ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ కాగా.. అందులో బిగ్‌బీకి వాయిస్ఓవర్ అందించాడు సాయి కుమార్. మోహన్‌లాల్, మమ్మూటీ, మనోజ్ జయన్, అర్జున్ సార్జా, విష్ణువర్ధన్ పోలీస్ రోల్స్‌కిగానూ సురేష్ గోపీ, విజయ్‌కాంత్ లాంటి వాళ్లకు తన పవర్ఫుల్ వాయిస్ అందించి.. ఆయా నటులను తెలుగు ఆడియొన్స్‌కు దగ్గరయ్యేలా చేశాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్. -సాక్షి, వెబ్‌డెస్క్ -
సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు!
సాయికుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. 2010లో దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్లో రీమేక్ అయ్యింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన దేవా కట్టానే ఈ సినిమాను తెరకెక్కించారు. సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాపై వివాదం తెరమీదకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ షీమారు ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ ప్రస్థానం రీమేక్ రైట్స్ తమవద్ద ఉన్నాయంటూ వాదిస్తున్నారు. ఈ మేరకు సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయాన్ని సంజయ్ దత్తో గతంలోనే చర్చించామని అయినా సంజు బాబా అవేవి పట్టించుకోకుండా సినిమాను రూపొందించారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రస్థానం దర్శక నిర్మాతలు స్పందించాల్సి ఉంది. -
అడుగుజాడ
-
ప్రస్థానం ప్రారంభం
అబ్బా.. బాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయిరా బాబు! మన టాలీవుడ్లో అలాంటి సినిమాలు రావడం తక్కువ అని కొందరు అంటుంటారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందుకు మన ‘బాహుబలి’ చిత్రమే నిదర్శనం. అంతెందుకు ఇప్పుడు చూడండి. తెలుగు సినిమాలు ‘ప్రస్థానం, టెంపర్, అర్జున్‌రెడ్డి’ బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’కు టీమ్ కొబ్బరికాయ కొట్టారు. గురువారం హిందీ ‘ప్రస్థానం’ మొదలైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు జాకీ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. పదేళ్ల క్రితం హిందీ చిత్రం ‘కార్తూస్’లో కలిసి నటించిన సంజయ్, మనీషా, జాకీ మళ్లీ ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తుండటం విశేషం. ‘‘ఫస్ట్ డే షూట్లో సంజయ్‌దత్ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దేవా కట్టా. -
బాలీవుడ్ ప్రస్థానం
‘హీరోలూ విలన్లూ లేరీ నాటకంలో..’ అంటూ 2010లో దర్శకుడు దేవా కట్టా రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రస్థానం’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ నటన, సాయి కుమార్ డైలాగ్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్స్గా నిలిచాయి. ఇప్పుడు అవే పదునైన సంభాషణలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పలకబోతున్నారు. తెలుగులో రిలీజ్ అయిన ఎనిమిది సంవత్సరాలకు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దేవా కట్టా. సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. హీరోయిన్గా అమైరా దస్తూర్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంజయ్ దత్ ఓ నిర్మాత కావడం విశేషం. సంజయ్ దత్ తల్లి, బాలీవుడ్ సూపర్‌స్టార్ నర్గీస్ జయంతి సందర్భంగా జూన్ 1న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సంజయ్ దత్ ‘ప్రస్థానం’ మొదలవుతోంది..!
‘ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు.. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు , విలన్లు లేరీ నాటకంలో’... ఈ డైలాగ్ ఒక్కటి చాలు ప్రస్థానం సినిమా ఏంటో చెప్పేయడానికి. దేవకట్టా తెరకెక్కించిన ఈ సినిమాకు సాయి కుమార్ తన నటనతో ప్రాణం పోశారు. ఎన్నో అవార్డులను, ఎంతో మంది విమర్శకుల ప్రశంసలను పొందింది ఈ సినిమా. కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా... టాలీవుడ్లో ఈ సినిమాది ప్రత్యేక స్థానమే. ఎందుకంటే ఈ సినిమా రిలీజైన ఇన్నేళ్లకు హిందీలో రీమేక్ అవుతోందంటే ఈ సినిమా స్టామినా ఏంటో అర్థమవుతోంది. ప్రస్థానం సినిమాను రీమేక్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.. ఇప్పటికి సరైన సమయం వచ్చింది. సంజయదత్ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను తన తల్లి నర్గీస్ దత్ పుట్టిన రోజైన జూన్ 1న ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్రను సంజయ్‌దత్ పోషిస్తున్నట్లుగా తెలిపారు. బాలీవుడ్ నేటివిటికి తగ్గట్లు మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రీమేక్ కూడా దేవకట్టా దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది. అలీ ఫజల్, అమైరా దస్తూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. -
హిందీలో కొత్త ప్రస్థానం
దాదాపు ఎనిమిదేళ్ల కిత్రం శర్వానంద్, సాయికుమార్, సందీప్ కిషన్ ముఖ్య తారలుగా దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాకు టాలీవుడ్లో మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు హిందీలో ‘ప్రస్థానం’ మొదలు కానుంది. అవును.. తెలుగు ‘ప్రస్థానం’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన దేవ కట్టానే హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తారట. శర్వానంద్ చేసిన పాత్రకు హీరో అలీ ఫజల్‌ను తీసుకున్నారు. సాయికుమార్ ప్లేస్‌లో సంజయ్‌దత్ కనిపించనున్నారట. కథానాయికగా అమైరా దస్తూర్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే.. తెలుగులో ఈ చిత్రం నిడివి 2గంటల58 నిమిషాలు. కానీ హిందీ చిత్రం నిడివి తక్కువగా ఉంటుంది. జస్ట్ 2 గంటలే ఉంటుందట. సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని టాక్. -
సంజయ్ దత్ 'ప్రస్థానం'..!
భూమి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, తన నెక్ట్స్ సినిమాల కథ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హీరో ఇమేజ్ ను పక్కన పెట్టిన వయసుకు, లుక్ కు తగ్గ పాత్రలో కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే భూమి సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ చిన్న సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడిగా దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన చేసిన అప్పట్లో వర్క్ అవుట్ కాలేదు. ఇన్నేళ్ల తరువాత తిరిగి ఆ ప్రయత్నాలు ప్రారంభించాడు దేవ కట్టా. ఈ రీమేక్ లో సాయికుమార్ పాత్రలో సంజయ్ నటించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు సంజయ్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
తెలుగు సినిమా రీమేక్‌లో సంజయ్‌దత్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ ఇటీవలే భూమి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడి దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్థానం రిలీజ్ సమయంలోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన ఉందని ప్రకటించాడు దర్శకుడు. ఇన్నేళ్ల తరువాత ఆ మాట నిలబెట్టుకోబోతున్నాడు. త్వరలోనే సంజయ్ దత్ హీరోగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
వెండితెరపై మరో 'ప్రస్థానం'
రెండు సినిమాలతోనే దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు దేవాకట్టా. తొలి సినిమా వెన్నెలతో ఆకట్టుకున్న దేవాకట్టా తరువాత ప్రస్థానం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు కూడా దేవాకట్టా దర్వకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారు. సాయికుమార్, శర్వానంద్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రస్థానం దర్శకుడితో పాటు శర్వానంద్ కెరీర్ ను కూడా మలుపు తిప్పింది. ప్రస్థానం సినిమా తరువాత అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు దేవాకట్టా. నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన ఆటోనగర్ సూర్యతో పాటు, మంచు హీరోగా తెరకెక్కిన డైనమేట్ సినిమాలకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ దర్శకుడి కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో దేవాకట్టాకు బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. తన కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకుడి కోసం రిస్క్ చేయడానికి రెడీ అంటున్నాడు. -
సాయికుమార్ ప్రత్యేక పాత్రలో ‘కమీనా’
‘‘స్వార్థం అనేది ఎంత ప్రమాదమో తెలిపే చిత్రం ఇది. ‘ప్రస్థానం’ తర్వాత నేను ఇందులో మంచి పాత్ర చేశాను’’ అన్నారు సాయికుమార్. ఆయన ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘కమీనా’. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. వరప్రసాద్ అరిమండ నిర్మాత. క్రిషి, లేఖా వాషింగ్టన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది క్రైమ్ డ్రామా అయినప్పటికీ వినోద ప్రధానంగా సాగుతుంది. అద్భుత కావ్యం అని చెప్పను కానీ అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు. హిందీ చిత్రం ‘జానీ గద్దర్’ ఆధారంగా ఈ చిత్రం చేశారని, అందులో వినయ్ పాటక్ చేసిన పాత్రను చేశానని బ్రహ్మాజీ చెప్పారు. కిషి మాట్లాడుతూ-‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. దర్శకుడు నా నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. సీనియర్ ఆర్టిస్టుల సహకారం మరవలేనిది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: విజయశారదారెడ్డి అరిమండ.