
‘హీరోలూ విలన్‌లూ లేరీ నాటకంలో..’ అంటూ 2010లో దర్శకుడు దేవా కట్టా రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రస్థానం’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ నటన, సాయి కుమార్ డైలాగ్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలిచాయి. ఇప్పుడు అవే పదునైన సంభాషణలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పలకబోతున్నారు. తెలుగులో రిలీజ్ అయిన ఎనిమిది సంవత్సరాలకు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దేవా కట్టా. సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. హీరోయిన్‌గా అమైరా దస్తూర్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంజయ్ దత్ ఓ నిర్మాత కావడం విశేషం. సంజయ్ దత్ తల్లి, బాలీవుడ్ సూపర్‌స్టార్ నర్గీస్ జయంతి సందర్భంగా జూన్ 1న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment