సాయికుమార్ ప్రత్యేక పాత్రలో ‘కమీనా’
సాయికుమార్ ప్రత్యేక పాత్రలో ‘కమీనా’
Published Mon, Sep 9 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
‘‘స్వార్థం అనేది ఎంత ప్రమాదమో తెలిపే చిత్రం ఇది. ‘ప్రస్థానం’ తర్వాత నేను ఇందులో మంచి పాత్ర చేశాను’’ అన్నారు సాయికుమార్. ఆయన ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘కమీనా’. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. వరప్రసాద్ అరిమండ నిర్మాత. క్రిషి, లేఖా వాషింగ్టన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది క్రైమ్ డ్రామా అయినప్పటికీ వినోద ప్రధానంగా సాగుతుంది. అద్భుత కావ్యం అని చెప్పను కానీ అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు. హిందీ చిత్రం ‘జానీ గద్దర్’ ఆధారంగా ఈ చిత్రం చేశారని, అందులో వినయ్ పాటక్ చేసిన పాత్రను చేశానని బ్రహ్మాజీ చెప్పారు.
కిషి మాట్లాడుతూ-‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. దర్శకుడు నా నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. సీనియర్ ఆర్టిస్టుల సహకారం మరవలేనిది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: విజయశారదారెడ్డి అరిమండ.
Advertisement
Advertisement